Thursday, June 21, 2012

బ్లాగాడిస్తా రవి - ఇదిగో మీ కోసం!

బ్లాగాడిస్తా రవి - ఇదిగో మీ కోసం!

రవికి తెలుసు ఈయనెవరో.....మిగిలినవారికో ప్రశ్నఈయనెవరో తెలుసా మీకు ?

పోనీలెండి - క్లూ ఇస్తా ...

మీరు కవిత్వం ఎందుకు చెప్పరు? అని వీరిని అడిగితే

కవిత్వంలో నేను కొత్తగా ఇవ్వగల పదార్ధం లేదు, అందుకు....అన్న సమాధానం వచ్చిందిట...


అంతటి మహాపండితులకు సాష్టాంగ నమస్కారాలతో

క్లూ ఇచ్చా కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పొచ్చు


Lunch Time Pencil Drawing On A46 comments:

 1. sri rallapalli anantha krishna sarma
  శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ -నా బాల్య స్నేహితుడు కందాల బాల గోపాల్ తాతగారు.

  ReplyDelete
 2. Vow! Did you ever get to see and talk to Sri Rallapalli? If yes, you are a blessed soul ...

  Can you pls send a test mail to maganti.org at gmail dot com ?

  Thanks
  Vamsi

  ReplyDelete
  Replies
  1. బాల్యం నుంచి భుక్తి విద్య దాకా, పూర్వజన్మ పుణ్యఫలం వల్ల,
   తిరుపతిలో జరిగిందని సగౌరవంగా మనవి చేసుకుంటున్నాను.
   ఆయన సుందర రూపాన్ని చూడడం , ఆయన మాటలు వినడం
   కూడా ఆ తాలుకా ఫలమే.
   మీ అంతర్జాల గడులల్లో సదా విహరించడం నాకు ఇష్టం.
   చదలవాడ వేంకట రామ మోహన్
   ps- please visit https://sites.google.com/site/rallapallisharma/

   Delete
  2. I am also doubly blessed to be associated with his equally famous grand son Late K Bala Gopal
   Mohan

   Delete
 3. మీ కుంచె ధన్యమైనది. (నేను రాళ్ళపల్లికి భట్రాజును! :))

  పదపుష్టిం బరికించి, శబ్దవిధులం బాటించి, యర్థంబులన్
  గొదుకుల్ బుట్టక దిద్ది, భావముల నిక్కుల్ సూచి,పద్యంబులన్
  బొదిగింపంగలమంతె కాని యదియేమో తక్కువై తోచు! నా
  కొదువం దీర్చుకవిత్వబీజమది మాకుంజిక్కునో జిక్కదో!

  - రఘువంశమ్ 17 సర్గలు తెనిగించిన తర్వాత, తన పుస్తకాన్ని తనే విమర్శించుకుని చించేసి ఈ మాట చెప్పాడాయన.నాకెందుకో "కాకః కృష్ణః.." ప్రస్తుతానికి వద్దులెండి.

  ReplyDelete
 4. కాకః కృష్ణః పికః కృష్ణః, కో భేదః పిక కాకయోః
  వస౦తకాలే స౦ప్రాప్తే, కాకః కాకః పికః పికః


  రవి - ఎవరి ఇది వారిది, అందులో సందేహం లేదు. అటువారికి ఇటువైపు ఎలా కనిపిస్తుందో, ఇటువారికీ అటువైపు అలానే కనపడుతుంది....మనం ఆ ఝంఝాటంలో ఇరుక్కోవచ్చా అన్నది ప్రశ్న....నేనైతే అదో ఛాయిస్ అంటా....It can only be either a good choice or a bad choice - nothing in between, that's always my take


  నేనెవరికీ భట్రాజును కాదు కానీ నా లిష్టులో ప్రథములు - సమానంగా - ఏ తేడా లేకుండా....అంటే వీరిలో వీరికి నా లిష్టులో రెండో స్థానం అనేదే లేదు అన్నమాట...

  విశ్వనాథ వారు, విద్వాన్ విశ్వం వారు, రాళ్ళపల్లి వారు, పుట్టపర్తి వారు, వేలూరి వారు, పానుగంటి వారు, చిలకమర్తి వారు, శ్రీపాద వారు, వేదం వారు, గిడుగు గారు, గడియారం వారు, వేటూరి ప్రభాకర శాస్త్రి, శ్రీశ్రీ, మల్లాది రామకృష్ణశాస్త్రి, జలసూత్రం వారు, కొడవటిగంటి వారు, ఆరుద్ర గారు, దాశరథి గారు, మల్లంపల్లి వారు - (ఈ లిష్టులో తెన్నేటి సూరిగారిని కూడా కలిపేసా - ఒక్క ఛెంఘిజ్ ఖాన్ కోసం!)

  ఇంతేనా, మరి మిగిలిన మహామహులంతా? ఇంకొంతమంది ఉన్నారు కానీ ఇప్పటికింతే - లిష్టు భారీగా పెరిగినప్పుడు మళ్ళొస్తా....అదీ సంగతి...

  పోతే ఉయ్యాలలు ఊక్కుంటూ, జంపాలలతో తవ్వుకుంటూ, ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి - ఠాట్ వాళ్ళకెందుకు ఇవ్వలేదు, వీళ్ళకెందుకు ఇవ్వలేదు, అంతా బాగానే ఉంది, అందరినీ సరిగ్గానే చూసాం అని మేకపోతు కబుర్లు చెప్పేవాళ్ళని మనం లెక్క చెయ్యకూడదు.......

  ఇలా బోల్డు రాసుకుంటూ పోవచ్చు....కానీ ఇంతటితో స్వస్తి....


  PS: >> మీ కుంచె ధన్యమైనది

  ధన్యం దాకా ఎందుకు కానీ - అసలు కథ ఇదీ - నిన్న పాత ఆడియో ఫైళ్ళ కోసం వెతుకుంటే హార్డు డ్రైవులోనుంచి బయటపడ్డ జెపెగ్ బొమ్మ అది...ఎప్పుడు - ఎక్కడినుంచి సేవ్ చేసుకున్నానో, ఎవరి గీసారో తెలియదు.....కానీ, అది చూడగానే మీరే గుర్తుకొచ్చి, పేపరుచ్చుకుని అచ్చంగా అలా బొమ్మలోలాగే గీసేసి పోష్టుకెక్కించా...

  ReplyDelete