Wednesday, June 13, 2012

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ నండూరి సుబ్బారావు - అరుదైన ఆడియోలు!

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ నండూరి సుబ్బారావు గారు ఆంధ్రదేశం కలకాలం గుర్తుపెట్టుకునే, గుర్తుపెట్టుకోవాల్సిన కళాకారులు. వారి గురించిన విశేషాలతో శ్రీ నండూరి వారి ఆరోగ్యం బాగులేనప్పుడు వారి ఇంటివద్దే రికార్డు చేయబడిన వీడియో నుంచి ఆడియోను వేరు చేసి, రెండు భాగాలుగా పంపించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో.

ఈ ఆడియోలో శ్రీ నండూరి వారిని పరిచయం చేసింది ప్రఖ్యాత రచయిత, కవి, పాత్రికేయులు శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు. ఆ అద్భుతమైన పరిచయం వింటూ ఉంటేనే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలిసి ఆనందం కలుగుతుంది.

పరిచయ భాగం అయిపోయాక వినపడే ఆడియో భాగంలో శ్రీ నండూరి వారిని ఇంటర్వ్యూ చేసింది శ్రీ ఏ.లింగరాజు శర్మ గారు ( నటులు మరియు అనౌన్సర్) , శ్రీ పి.పాండురంగారావు గారు (నటులు, రిటైర్డ్ స్టేషన్ డైరెక్టరు) , శ్రీ మాడుగుల రామకృష్ణ గారు (అనౌన్సర్).

అరుదైన ఈ ఆడియోలు - వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు -- పరిచయాలు సెక్షన్లో

మరొక్కసారి శ్రీ శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ

2 comments:

  1. వంశీ గారూ,

    మీరు సైటులో పెట్టిన ఏ ఆడియో కూడా వినిపించడం లేదు. ఈ మధ్యన నా సిస్టం ఫార్మాటింగ్ చేయించవలసొచ్చింది. ఇదివరకటివేమైనా మాయం అయిపోయుండొచ్చా? నేను మామూలుగా గూగుల్ క్రోమ్ వాడతాను. మిగిలిన ఆడియోలు ( ఇతర సైట్లలోవి) వినకలుగుతున్నాను. కొద్దిగా సహాయం చేయండి. ఔనూ మీరు అన్నన్ని అద్భుతమైన ఆడియోలు పెట్టారు కదా, శ్రీ పన్యాల రంగనాధరావుగారి వాయిస్ ఒకసారి వినాలని ఉంది. ఎక్కడా వినిపించలేదు. ఓసారి పుణ్యం కట్టుకోండి....

    ReplyDelete