Monday, June 11, 2012

అలా వీణను చీల్చుకుని బయటకొస్తున్నదెవరు?

అలా వీణను చీల్చుకుని బయటకొస్తున్నదెవరు?

ఏమో నీకు తెలిస్తే చెప్పు

నాకైతే విఠలాచార్యుల వారి జగన్మోహిని భూతంలాగా ఉన్నది.....

అవునా?

మరి వీణలోకెందుకు దూరింది? 

తెలీదయ్యా ఎందుకు దూరిందో, ఆ తర్వాత ఏం చేస్తుందో!

సమయం: మూడు నిముషాలు
పేపరు సైజు: ఎ 4
గీసింది: పెన్సిలుతో





5 comments:

  1. విఠలాచార్య సినిమాల్లో పైసా జీతం భత్యం తీసుకోకుండా పనిచేసిన భూతాలన్ని ప్రస్తుతం కనబదకుండా పోయాయని వినికిడి. అయితే ఒక భూతం మాత్రం మాగంటివారి వీణలో దాక్కుని ఈ నాటికి పెన్సిల్ పోటుతో బయటకు వచ్చిందన్నమాట. మిగతా భూతాలనూ మాగంటివారే పొడిచి మరీ బయటపడేస్తే మళ్ళీ జానపదం సినిమాలకు ప్రాణం వస్తుందని ఆశగా ఉంది.

    ReplyDelete
  2. భూతమైనా ఎంతముద్దొస్తుందో:-)

    ReplyDelete
  3. జస్ట్ మూడే నిమిషాల్లో గీసేసారా.. వావ్!

    ReplyDelete
    Replies
    1. మీరు వావ్ అన్నందుకు కాదు కానీ, అవును ఒక అరనిముషం అటూ ఇటూగా మూణ్ణిముషాలే .....మా గ్లాస్ బ్లోయింగ్ టీచరు ఎరిక్ చెబుతూ ఉంటారు - "టైమింగ్" అనేది చాలా ఇంపార్టంట్ అబ్బాయి, ముఖ్యంగా ఈ గ్లాస్ బ్లోయింగులో, లేకపోతే లేక్ తాహో అడవులే గతి అని....మన శంకరగిరి మాన్యాల్లాగానన్నమాట....

      ఆ కాన్సెప్టుని మరోరకంగా పెయింటుంగు, డ్రాయింగు లకు కుదిరించేద్దామని, ఈ వారమంతా స్టాప్ క్లాకు పెట్టుకుని బొమ్మలు పేపరెక్కిస్తున్నా.......అదీ సంగతి.... :)

      Delete
    2. గ్లాస్ బ్లోయ్ంగ్ ఏమోకాని, ఇక్కడ మైండ్ బ్లోయింగూ!
      నాదాన్ని గుర్తు పట్టేశాగా!!

      Delete