Tuesday, June 5, 2012

బాలగేయాలు - చింతాదీక్షితులు

బాలగేయాలు

--- చింతాదీక్షితులు



కాకరపాదుకు కాయలందమ్ము
శ్రీకృష్ణతమ్మునికి తిరుమణందమ్ము
మల్లెపందిరికి మల్లెలందము
బీరపాదులకు పువ్వులందము
ఆడువారికి ముక్కుపుడకలందము


*************************



ఉన్న ఊరూ విడిచి ఉండలేము
కన్నతల్లిని విడిచి ఘడియుండలేము
ఉన్న వూరూ నాకు చెన్నపట్నము
కన్నతల్లీ నాకు కల్పవృక్షము

No comments:

Post a Comment