Monday, June 4, 2012

జానపద గేయాలు - 5 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


5. జానపద యువతీ యువకుల సరస సల్లాపాలు, అలంకారభూషితయై పోతున్న పల్లెపడుచును ఒక యువకుడు చూచి పలకరిస్తాడు. అందుకా యువతి అయిష్టతతో జవాబిస్తుంది


మెళ్ళో ముత్యాలపేరు ముద్దుగుమ్మా
బంగారు బొమ్మా
కళ్ళాకాటుక పెట్టి వెళ్ళేవయ్యారిభామ
ఒళ్ళే బంగారమా! లమ్మిఈ ! సిన్నమ్మా

సినకాపులుంటారు పెదకాపులుంటారు
నడిరోడ్డుపై సరసమయ్యా సిన్నయ్య
సందేయేళైనాది ముందెనక యేరునే
సరితోడు వుంటానె లమ్మీ సిన్నమ్మీ
నీకు సరితోడు వుంటానె లమ్మీ సిన్నమ్మీ

అందాల సందామామయ్యా తోడుండాడు
అలపూ వలపేలనోయ్ అందగాడా
నీవలసీపోతావు పోవయ్యా సిన్నయ్యా
నీవలసీపోతావు పోవయ్యా సిన్నయ్యా

No comments:

Post a Comment