Sunday, June 3, 2012

జానపద గేయాలు - 2 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


2. కర్షకుల పాట


ఈ యేటికోతల్లు గైరమ్మా!
ముప్పావలాకూలె గైరమ్మా! సేను
సితకాపండిందోలె గైరమ్మా
అర్ధరూపాయికూలె గైరమ్మా!

ఆకుతోటైతేను గైరమ్మా!
పావలా కూలె గైరమ్మా!
పదునుకొడవలిబట్టి గైరమ్మా
పంటసేను కోతామె గైరమ్మా!

రాజనాలపంట రమ్మెమైనా పంట
భూదేవి పండించె గైరమ్మా!
భూదేవి పండించె గైరమ్మా!

1 comment:

  1. "అత్తలేని కోడలుత్తమురాలు" పాట మీదగ్గరుంటే మీ బ్లాగులో పెట్టగలరా?

    అలాగే ఆకాశవాణి వారు ప్రసారం చేసే జానపద గేయాలు మీ దగ్గరున్నాయా?

    ఉదా: కొత్తకుండా నీరుతీపి ..., ఓహో యాత్రికుడా ... మొదలైనవి

    ~సూర్యుడు

    ReplyDelete