Saturday, June 30, 2012

బ్లాగరు తృష్ణగారు అందించిన పుచ్చా పూర్ణానందం గారి - తాంబూలం, పిల్లి ఎదురొచ్చింది - రేడియో ప్రసారాలు

బ్లాగరు తృష్ణగారు అందించిన పుచ్చా పూర్ణానందం గారి - తాంబూలం, పిల్లి ఎదురొచ్చింది - రేడియో ప్రసారాలు వెబ్సైటులో ఆకాశవాణి - ఇతర కార్యక్రమాలు సెక్షన్లో

తృష్ణగారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఆవిడ అందించిన మరిన్ని ఆడియోలు కొద్దిరోజుల్లో వెబ్సైటులోఉంచబడతాయని తెలియచేసుకుంటూ

భవదీయుడు
మాగంటి వంశీ

ఇదో వొటేలు - అందులో .....!!!

ఇదో వొటేలు - అందులో వణ్ణం

అదేనండీ - పూటకూళ్ళ ఇల్లన్నమాట...మా ఊళ్ళో ఉన్న ఓ పేరున్న రెష్టారెంటు...


Lunch Time Quickie

Since it's Perspective Drawing time was about 8 mins


Pencil on A4
Friday, June 29, 2012

ఇది భామాకలాపం కాదు మామాకలాపం !

నాటక రచన పోటీల్లో బహుమతి పొందిన నాటిక "మామా కలాపం"

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారం

రచన: శ్రీ తాడేపల్లి పతంజలి
నిర్వహణ: శ్రీ డి.ఎస్.ఆర్.ఆంజనేయులు

ఇందులో

ముకుందం: శ్రీ రెండుచింతల రామచంద్ర రావు
కామాక్షి: శ్రీమతి మద్దాలి సుశీల
శంకరం: శ్రీ శనగల కబీర్ దాస్
ఆనందం: శ్రీ కె.ఆదినారాయణరావు
సుబ్బారావు: శ్రీ పాండురంగ


ఆడియో సౌజన్యం: శ్రీ తాడేపల్లి పతంజలి

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

PS:

1) Navigation has been changed for easy access and maintenance....So please pay attention to the sections
2) This audio is 64 MB. So please be patient
3) Audio is played best in IE browser

Thursday, June 28, 2012

మరింకేం! బ్రహ్మానందం....

ఎక్కడికో? ఎందుకో?

తెలుసా నీకు?

మరింకేం! బ్రహ్మానందం....

Acrylics on 16 by 20 Canvas

Time: 1 hr

Colors: Bright Red, Titanium White, Pthalo Green, Bright Yellow, Black, Royal Violet, Gold, Coral Blueఈ పాటల శేషమ్మ గారి గురించి ఎవరికైనా తెలుసా?

ఈ పాటల శేషమ్మ గారి గురించి ఎవరికైనా తెలుసా?

Pic from Andhra Jyothi - 1960.....There are quite a few, infact very many songs of this lady in the magazine - So the question


 Wednesday, June 27, 2012

మెక్కరా....మెక్కు! అదేగా పని?

మెక్కరా....మెక్కు!

అదేగా పని?

విసర్జించరా! విసర్జించు

భాషను విస్మరించు, అక్షరాలను పట్టించుకోకు

నీ చావు నువ్వే కొనితెచ్చుకో!

చంపు - చావు
Acrylics on 16 by 20 Inches Canvas


Time taken: 50 mins

Colors used: Bright yellow, Bright Red, Titanium white, Gold, Black

ఆ ఊదేది అక్కడ ఊదితే వంటన్నా అవుతుంది....

LOLTuesday, June 26, 2012

బంధితుడు - వాసిరెడ్డి సీతాదేవి నవల

బంధితుడు నాటకం

ఆకాశవాణి కడప, విశాఖపట్నం కేంద్ర ప్రసారం

వాసిరెడ్డి సీతాదేవి నవలకు రేడియో అనుసరణ: శ్రీ కె.ఆంజనేయులు
నిర్వహణ: శ్రీమతి శారదా శ్రీనివాసన్

ఇందులో

సత్యం: శ్రీ సుబ్బరాయ శర్మ
సరోజ: శ్రీమతి శారదా శ్రీనివాసన్
పద్మ: శ్రీమతి పుట్టపర్తి నాగపద్మినీ దేవి
హరికృష్ణ: శ్రీ ఎన్.రవీంద్రా రెడ్డి

ఆడియో సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం  

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ 

సంధ్యావందన మహత్యం - నాటిక

సంధ్యావందన మహత్యం - నాటిక
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం 

ఆడియో సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం  

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ 

Monday, June 25, 2012

ఆర్టిష్టుల కాలనీ

ఆర్టిష్టుల కాలనీ
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కథ: శ్రీ ఎన్.శ్రీనివాసన్
మాటలు: శ్రీ కురుమెళ్ళ వెంకటరావు

ఇందులో

శ్రీమతి కె.హైమావతి
శ్రీ బి.ఆనందమోహన్
శ్రీ నారాయణమూర్తి
శ్రీ హనుమంతరావు

మున్నగువారు

ఆడియో సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం  

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ 

ఇదీ బాపు గారి కాప్షన్ !!

మందిరే మందిరే మాధవం మాధవం.....

ఇదీ బాపు గారి కాప్షన్... :)

ఆంధ్ర పత్రిక 1960 ప్రతి నుండి
Sunday, June 24, 2012

నీ బాధలు నావి - ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ!

అఖిల భారత నాటక కార్యక్రమంలో ప్రసారమైన ఒక ప్రయోజనాత్మక నాటకం - నీ బాధలు నావి - తుమ్హారే దం (గం ) మేరే హై అనే శీర్షికతో శ్రీ రేవతీ శర్మ హిందీలో రచించిన రచనకు తెలుగుసేత శ్రీ దండమూడి మహీధర్

ఇది నాటకం కాదు, ప్రస్తుత సామాజానికి నిలువుటద్దం. అవినీతికి, అన్యాయానికి ఆలవాలమైపోతున్న ప్రస్తుత సమాజంలో సామాన్యమానవుడి కర్తవ్యం ఏమిటి?  పోరాటమేనా?

ఆ ప్రశ్నకు సమాధానం ఈ నాటకంలో

నాటక ప్రయోక్త: శ్రీ కె.చిరంజీవి
ఆడియో సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం 

ఇందులో

దీన్ దయాళ్: శ్రీ రవీంద్రరెడ్డి
సరస్వతి : శ్రీమతి శారదా శ్రీనివాసన్
అబద్ధాల వకీలు: శ్రీ భానుప్రకాష్
లీడర్ : శ్రీ చంద్రమౌళి
పంతులు: శ్రీ అట్లూరి రామారావు
పంతులు బంటు మిశ్రా: శ్రీ ఆనందమోహన్
జూనియర్ వకీలు వర్మ: శ్రీ బి.వి.ఎస్.నారాయణమూర్తి
స్మగ్లర్ మగన్ లాల్: శ్రీ సిద్దప్ప నాయుడు
మహారచయిత వినోద్ కుమార్: శ్రీ బి.నారాయణ
హెడ్మాష్టర్: శ్రీ కలపటపు రామగోపాలరావు
అసిస్టెంట్ హెడ్మాష్టర్: శ్రీ కె.ఎస్.శర్మ
జుబేదా: శ్రీమతి విజయలక్ష్మి వర్ధని
జుబేదా తల్లి : రఘుమఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

అజ్ఞానపురిలో ఆకలి చావులు - ఆకలి మందు - రజనీ పవర్ఫుల్ సంగీతం.....

ఆకలి మందు నాటకం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ఆడియో సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం

రచన, నిర్వహణ: శ్రీ కె.చిరంజీవి
సహకారం: శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీ శ్రీరాం

ఇందులో

నిరుద్యోగి: శ్రీ ఎన్.రవీంద్రరెడ్డి
ఏ.సి.పి: శ్రీ బి.వి.ఎస్.ఎన్.రాజు
కల్పన: శ్రీమతి శారదా శ్రీనివాసన్
డాక్టర్ రాంజోషి : శ్రీ కె.చిరంజీవి
డాక్టర్ గోపి: శ్రీ రామారావు
కర్ణరంజన్: శ్రీ జె.సిద్దప్పనాయుడు
శ్రీమాన్ జీ: శ్రీ డి.రాజేశ్వర రావు
డి.సి.పి: శ్రీ కె.సూర్యనారాయణ
వైర్ లెస్ ఆపరేటర్: శ్రీ బి.వి.ఎస్.నారయణమూర్తి
పోలీసులు: సర్వశ్రీ జి.రామచంద్ర రావు, పి.వి.ఎస్ చైనులు

ఇంకా శ్రీ కాశీ విశ్వనాథ శాస్త్రి, శ్రీ Y.చంద్రమౌళి, శ్రీ కె.శ్రీనివాసమూర్తి, శ్రీమతి ప్రభావతి మొదలైనవారు పాల్గొన్నారు

సాంకేతిక సహాయం: శ్రీ నజీర్ అహ్మద్, శ్రీ విశ్వనాథన్

సంగీతం: శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు

ఈ పాడు ప్రపంచంలో నేను బ్రతకలేను పోలీసులూ ఓ పోలీసులూ అంటూ ఆక్రందనలు చేస్తున్న ఒక నిరుద్యోగి, అజ్ఞానపురిలో ఆకలి చావులు అంటూ న్యూసుపేపర్లో వచ్చే వార్త - ఇలా సమకాలీన సమాజానికి అద్దం పడుతూ శ్రీ చిరంజీవి గారు వ్రాసిన ఈ నాటకం ఒక్కోచోట ఒక్కోవిధంగా మనసు పిండేస్తుంది..

ఈ నాటకానికి అందించిన సంగీతం చాలా పవర్ఫుల్ గా ఉన్నది....మరి రజనీ గారు కదా అందుకు.... 

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

ఊరోళ్ళు మేల్కొంటున్నారు

ఊరోళ్ళు మేల్కొంటున్నారు నాటకం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం

ఇందులో

వరమ్మ: శ్రీమతి శకుంతల
బాల్ రాజ్: శ్రీ భానుప్రకాష్
రంగయ్య: శ్రీ రామ్మోహనరావు
సీతమ్మ: శ్రీమతి శారదా శ్రీనివాసన్
అనంతయ్య: శ్రీ సి.హెచ్.గోపాలకృష్ణ
లక్ష్మయ్య: శ్రీ డి.అమరేంద్ర
దుర్గయ్య: శ్రీ పి.ఆర్.వెంకటేశ్వర్లు
బ్రహ్మయ్య: శ్రీ తిలక్
సర్పంచ్: శ్రీ సి.హెచ్.అభిషిక్త వర్మ
పోలీసు: శ్రీ నాగరాజారావు
ఎస్.ఐ: శ్రీ లోకనాధం
భిక్షపతి: శ్రీ శశాంకరావు
వెంకటమ్మ: శ్రీమతి సి.హెచ్. కళ్యాణి
మల్లమ్మ: శ్రీమతి ఎం.సులోచనా రాణి
వాచ్ మాన్: శ్రీ డి.హనుమంతరావు
రాజలింగం: శ్రీ డి.ఆనంద్
గజ్జెమ్మ: శ్రీమతి పి.ఉమ
యాదగిరి: శ్రీ ఎం.భరత్ రెడ్డి

సాంకేతిక సహాయం: శ్రీ శ్రీనివాసన్, శ్రీ ఆకెళ్ళ భాస్కర్

రచన, నిర్వహణ: శ్రీ కె.చిరంజీవి 

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

Saturday, June 23, 2012

నేరము - శిక్ష

నేరము - శిక్ష నాటకం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం


ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ
యయాతి - ప్రత్యేక త్రైమాసిక నాటకం - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

యయాతి - ప్రత్యేక త్రైమాసిక నాటకం
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కన్నడ మూలం : శ్రీ గిరీష్ కర్నాడ్
తెలుగుసేత, రేడియో అనుసరణ: శ్రీమతి భార్గవి పి. రావు

ఇందులో

సూత్రధారుడు: శ్రీ ఉదయభాను
యయాతి: శ్రీ ఎం.కాశీ విశ్వనాథ శాస్త్రి
దేవయాని : శ్రీమతి గాలి ప్రభావతి
శర్మిష్ఠ: శ్రీమతి శారదా శ్రీనివాసన్
స్వర్ణలత: శ్రీమతి బాలకోటీశ్వరి
పురు: శ్రీ ఏ.మురళీకృష్ణ
చిత్రలేఖ: శ్రీమతి ఎం.అరుణ

నిర్వహణ: శ్రీ కె.చిరంజీవి

సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం


ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, June 22, 2012

ఒక కిల్లర్ కార్టూన్ !!

ఒక కిల్లర్ కార్టూన్ - శ్రీ శంకర్ గారి కలం నుండి....

అసలు ఆ మొహాలు, ఆ ఎక్స్ ప్రెషన్సు , ఆ రాత - అదరహా!

కార్టూనంటే ఇలాగుండాలయ్యా

ఆంధ్ర పత్రిక ప్రతి నుండిపండగ రోజు అలా జరిగిందన్నమాట


పండగ రోజు నాటకం - ఆకాశవాణి, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం

ఆడియో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో

నాటకం వివరాలు

1 గంట నాటకం.

రచన : శ్రీ నండూరి సుబ్బారావు
నిర్వహణ : శ్రీ పాండురంగ

ఇందులో

కుటుంబరావు : శ్రీ A లింగరాజు శర్మ
భార్య గాయత్రి : శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి
కూతురు శ్రీలక్ష్మి : శ్రీమతి వి. బి. కనకదుర్గ
కోడలు రాధ : శ్రీమతి ఎస్.రాధారాణి
కొడుకు గోపి : శ్రీ మాడుగుల రామకృష్ణ
అల్లుళ్ళు : నటరాజు : శ్రీ సుబ్బారావు
వామనమూర్తి : శ్రీ ఉపాధ్యాయుల
వెంకటేశ్వర్లు : శ్రీ గోపరాజు రమణ
వియ్యంకుడు రామయ్య : శ్రీ చుండూరు మధుసూదన రావు
అప్పన్న : శ్రీ బోయినపల్లి రామారావు
అప్పాయమ్మ : శ్రీమతి సి. హెచ్. స్వరాజ్య లక్ష్మిఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

Thursday, June 21, 2012

పొగ మేడ నాటకం - శ్రీమతి శారదా శ్రీనివాసన్, శ్రీ కె.చిరంజీవి...

పొగ మేడ నాటకం - రెండు భాగాలు
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రసారం
 
సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం

రచన: శ్రీ శివం

పాల్గొన్నవారు

శ్రీమతి శారదా శ్రీనివాసన్
శ్రీ కె.చిరంజీవి
శ్రీ పి.వి.ఎస్.వరప్రసాద్
శ్రీ ఐ.వి.రాఘవరావు
శ్రీ సి.హెచ్.వి.శంకరయ్య
శ్రీ శ్యామలరావు
శ్రీ కోట వెంకటరామయ్య
శ్రీమతి బి.విజయలక్ష్మి

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

బ్లాగాడిస్తా రవి - ఇదిగో మీ కోసం!

బ్లాగాడిస్తా రవి - ఇదిగో మీ కోసం!

రవికి తెలుసు ఈయనెవరో.....మిగిలినవారికో ప్రశ్నఈయనెవరో తెలుసా మీకు ?

పోనీలెండి - క్లూ ఇస్తా ...

మీరు కవిత్వం ఎందుకు చెప్పరు? అని వీరిని అడిగితే

కవిత్వంలో నేను కొత్తగా ఇవ్వగల పదార్ధం లేదు, అందుకు....అన్న సమాధానం వచ్చిందిట...


అంతటి మహాపండితులకు సాష్టాంగ నమస్కారాలతో

క్లూ ఇచ్చా కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పొచ్చు


Lunch Time Pencil Drawing On A4సుధామగారు - నేనేం చేయగలను?

జగమెరిగిన బ్రాహ్మడు శ్రీ సుధామగారు - "నేనేం చేయగలను"

1971 విజయవాణి పత్రిక నుండి
భవదీయుడు
వంశీ

Wednesday, June 20, 2012

ఈ ఆడియో వింటే మీ ఒళ్ళు గగుర్పొడచడం ఖాయం!!!

సోనార్ బాంగ్లా - ఇది కావటానికి బంగ్లాదేశ్ కి సంబంధించిన నాటకమే అయినా, ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా, ఎక్కడైనా జరగవచ్చు. స్వేచ్ఛా స్వాతంత్రాలకోసం పోరాడే ఏ దేశమైనా, ఏ జాతైనా ఈ నాటకం మాదేనని అనవచ్చు. కాకుంటే రంగస్థలం మారుతుంది, పాత్రలు మారతాయి.

మానవ విలువ కోసం, శ్రేయస్సు కోసం - అది ఏ దేశమైనా సరే, ఏ జాతియైనా సరే పడుతున్న తపనకు ప్రతీక మాత్రమే ఈ చిన్న నాటకం.

  • పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది
  • దానికి కారణం హిందువులా, ముస్లిములా లేక ఆంగ్లేయుల కుట్ర ఫలితమా
  • హిందూ ముస్లిము సంస్యా పరిష్కారం కోసం పుట్టిన పాకిస్తాన్లో తిరిగి ముసలం పుట్టటానికి కారణమేమిటి
  • మతమనేది ఒక్కటే మనుషులని కలపగలితే అటు అల్జీరియా నుండి ఇటు ఇండోనేషియా దాకా ఒకటే రాజ్యం కావలసింది కదా మరి కాలేదేమిటి.
  • విడిపోయిన పాకిస్తానుకు ఇండియా సహాయమే కావలసి వచ్చిందా
  • ఇండియా చేసిన సాయంలో స్వార్థం ఉందా  లేక నిస్వార్థంగానే చేసిందా
  • ఇండియా చేసిన సాయం జోక్యం కల్పించుకోటమే అయితే టర్కీ, ఇరాన్, అమెరికా, చైనాలు చేసిందేమిటి
  • ఆ సాయాన్ని ఏ పద్దు కింద వేస్తారు

ఇలాటి ప్రశ్నలన్నిటికి ఈ నాటకం సమాధానం చెప్పదు.

చెప్పవలసిన వారు రాజకీయనాయకులు, చరిత్రకారులు

ఏ దేశమైనా సరే ఏ జాతియైనా సరే, నల్లవాళ్ళు కానీ, తెల్లవాళ్ళు కానీ, ఇజ్రాయెలీలు కానీ , ఈజిప్షియన్లు కానీ, సామ్రాజ్యవాదులు కానీ, సోషలిస్టు మాంధాతలు కానీ. తూర్పున కానీ పడమర కానీ ఉత్తరాది కానీ దక్షిణాది కానీ ఎక్కడ ఏ అశ్రువు రాలినా, రక్తపు బొట్టు చిందినా అక్కడ ఇలాటి నాటకమే ఆడతారు జనం. 1971, ఏప్రిల్ 17వ తేదిన బాంగ్లా రాజధాని నగరం ఢాకాలో జరిగినట్టుగానే జరిగి తీరుతుంది 

ఆ నాటకాన్ని తెలుగులో రచించీ, పాత్రధారుల చేత వేయించీ - ప్రసారం చెయ్యలేకపోయింది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం....ఎందుకో, దానికి కారణాలేమిటో చెప్పనవసరం లేదు.

చరిత్ర గతుల లోకి, లోతుల్లోకి తొంగి చూసే అవకాశం కల్పించిన ఈ ఆడియో వింటే మీ ఒళ్ళు గగుర్పొడచడం ఖాయం.  

అంతటి అత్యంత అరుదైన, అత్యంత అపురూపమైన ఆడియోను అందించిన మా గురువుగారు, నేను హెడ్ మాష్టార్ గారు అని ఆప్యాయంగా పిలుచుకునే డాక్టర్ కె.బి.గోపాలం గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలనో తెలియదు కానీ, వేలవేల సాష్టాంగ నమస్కారాలు  మాత్రం ఇప్పటికిప్పుడు అర్పించగలను....

రచన, నిర్వహణ: శ్రీ కె.చిరంజీవి

నటీనట వర్గం

ప్రొఫెస్సర్ మౌలానా: శ్రీ చిరంజీవి
ఫాతిమా: శ్రీమతి ఎం.విజయలక్ష్మి
బీయమ్మ: వేజెండ్ల బాలకోటీశ్వరి
హసీనా: శ్రీమతి శారదా శ్రీనివాసన్
ఇక్బాల్: శ్రీ ఎన్.రవీంద్ర రెడ్డి
ఇస్లాం: శ్రీ టి.డి.ఎస్.వరప్రసాద్
రజాక్: శ్రీ అందే వెంకటేశ్వర రావు
అక్రం ఖాన్: శ్రీ లక్ష్మీపతి
గులాం ఖాన్: శ్రీ కె.శ్రీనివాస మూర్తి
సలాం ఖాన్: శ్రీ జె.సిద్దప్ప నాయుడు

ఇంకా శ్రీ గరిమెళ్ళ రామమూర్తి, శ్రీ డి.కె.వెంకటేశ్వర్లు మొదలైన వారు పాల్గొన్నారు

పై నటీనటులందరికీ, ప్రత్యేకంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక వందనాలతో


ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీవిజయవాడ ఆకాశవాణిలో పడిన మూడు ముళ్ళు

విజయవాడ ఆకాశవాణిలో పడిన మూడు ముళ్ళు

నాటిక

రైటర్ అండ్ ప్రొడ్యూసర్: శ్రీ నండూరి సుబ్బారావు

ఇందులో పాల్గొన్నవారు

శ్రీ సి.రామ మోహనరావు
శ్రీ నండూరి సుబ్బారావు
శ్రీ ఎం.వీరభద్ర రావు (సుత్తి వీరభద్రరావు గారు)
శ్రీ పేరి కామేశ్వరరావు
శ్రీమతి ఎం.నాగరత్నమ్మ
కుమారి వి.బి.కనకదుర్గ

తదితరులు

నిడివి: 26 నిముషాలు


ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

ఆడియో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, June 19, 2012

వ్రెండు వెక్కితే వేమవుద్ది - వర్దము వాలేదా? వదే వదే వరి....

వ్రెండు వెక్కితే వేమవుద్ది?

వర్దము వాలేదా?

వదే వదే వరి....

రెండు బొమ్మలెక్కినై కాన్వాసు మీదకు.....16 by 20.....

పెన్ను పడ్డది.....

రంగు పడవలె.....
ఇంతమంది హేమాహేమీలు ఒక్కచోట - ధన్యోస్మి!

ఇంతమంది హేమాహేమీలు ఒక్కచోట - ధన్యోస్మి!

"శ్రీ కృష్ణ రాయబారం" రంగస్థల నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి వేనవేల కృతజ్ఞతలతో

*********************************************

ఈ నాటకం గురించి శ్రీ శశిమోహన్ గారి మాటల్లోనే:

"శ్రీ కృష్ణ రాయబారం" రంగస్థల నాటకం,
రచన : కీర్తిశేషులు శ్రీ తిరుపతి వెంకట కవులు
నిర్వహణ : శ్రీ సత్యం శంకరమంచి
సహాయకులు : శ్రీ సి.రామమోహన రావు,  శ్రీ నండూరి సుబ్బారావు

ఇందు:
శ్రీకృష్ణుడు: శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు
ధర్మరాజు : శ్రీ కందుకూరి చిరంజీవిరావు
భీముడు :  శ్రీ వేమవరపు శ్రీధరరావు
అర్జునుడు : శ్రీ బి.వి.రంగారావు
సహదేవుడు : శ్రీ N.C.V. జగన్నాధాచార్యులు
ద్రౌపది       : శ్రీమతి  ఎం. నాగరత్నమ్మ
ధృతరాష్ట్రుడు : శ్రీ తురగా పుండరీకాక్షుడు
దుర్యోధనుడు : శ్రీ ఉప్పలూరి రాజారావు
కర్ణుడు        : శ్రీ వేమూరి రామయ్య
భీష్ముడు     :  శ్రీ సబ్నవీస్ శ్రీనివాసరావు
ద్రోణుడు      :  శ్రీ రామ్మోహన్
అశ్వద్ధామ :   శ్రీ చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు

ఆర్కెష్ట్రా :  శ్రీ శనగవరపు  శ్రీరామమూర్తి,  శ్రీ దత్తాడ పాండురంగరాజు,  శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, శ్రీ క్రొవ్విడి సీతారాం

ఇందులో పాల్గొన్న నటులంతా రంగస్థలం మీద హేమాహేమీలు.

********************************************

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

మరొక్కసారి శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ 

Monday, June 18, 2012

దేవుడు లేకుంటే ఏ చిక్కూ లేదు!

దేవుడు

-- కాళోజీ

1969 కళాకేళి పత్రిక నుండి


దేవుడు దేవుడు దేవుడు
దేవుడు లేం దెవరికి,
ఎవరి దేవుడు వారికి

మనిషి మనిషికి ఒక్కొక్క మనసు
మనసు మనసుకు ఒక్కొక్క దేవుడు
ఎవరి దేవుడు వారికి ప్రత్యక్షం
వారి సర్వస్వం అర్పితం దేవుడికి

ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దేవుడు
ఎప్పుడూ ఏదో ఒక దేవుడు

ప్రతివానికి దేవుడు తప్ప మరేమి లేదు
ప్రతివానికి దేవుడుతప్ప మరేమీ అక్కరలేదు

పిపీలికం నుండి బ్రహ్మపర్యంతం దేవుడు
అనాది దేవుడు, ఎడతెగని దేవుడు
అనాదిగా దేవుడు, ఎడ తెగకుండా దేవుడు

పట్టినపట్టు విడవకుండా దేవుడు
అన్ని దుఃఖాలకు మూలభూతమ్ దేవుడు
అన్ని సుఖాలకు మూలబీజం దేవుడు

బ్రతుకంతా దేవుళ్ళ ఘర్షణ
మనం చేస్తున్నది దేవుళ్ళ కాత్మార్పణ

దేవుడు లేకుంటే ఏ చిక్కూ లేదు
కాని దేవుడు లేకుంటే బ్రతుకేలేదు

ఒకరి దేవుడు మరొకరి దేవుడు తీరిస్తే
ఒకరి దేవుడు తీరడంలో మరొకరి దేవుడు
తీరితే రక్తి ముక్తి


** దేవుడు అంటే భగవంతుడనే కాదు, దేవుడు అంటే ఆరాటం కూడా....ఎంతటి అర్థంతో రాసావయ్యా కాళోజీ.....సలాములే సలాములు.....

తై...తై...తకతై....ధి..ధి..ధిధితై ....అంటున్న ఈవిడెవరో?

తై...తై...తకతై....ధి..ధి..ధిధితై ....అంటున్న ఈవిడెవరో?

Sketch on 16 by 20 canvas
 
రంగు ఎప్పుడు పడుతుందో ఏంటో?

చూద్దాం ఈ వారంతంలోపల చెయ్యగలనేమో  .......

 వంతదాకా వానందో బెమ్మి ......


Sunday, June 17, 2012

మనసుని పిండేసే పాత్రలవి - ఆకాశవాణి ప్రముఖులు శ్రీమతి శారదా శ్రీనివాసన్ - "పతితవ్రత" నాటకం ఆడియో

పతితవ్రత - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

గొరుసు జగదీశ్వర రెడ్డి గారు AndhraJyothy – Sunday Magazine – 08 June 2008  న ఊర్వశి , ఆకాశవాణి ప్రముఖులు శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారితో జరిపిన ఇంటర్వ్యూలో ఆవిడ ఇలా ఇంటారు

"నటించిన వేల నాటకాలలో కొన్ని పాత్రలు మనసుపై చాలా ప్రభావం చూపేవి. రాజా ఈడిపస్‌, పాప పరిహారం, సుప్తశిల, మెదియా, పతితవ్రత లాంటి నాటకాలు నన్ను చాలా కలతకు గురిచేశాయి. మనసుని పిండేసే పాత్రలవి. "


ఆవిడ మీద ప్రభావం చూపిన పాత్రల్లోని ఒక పాత్ర - శ్రీ నండూరి శశిమోహన్ గారు అందించిన ఈ ఆడియోలో

అరుదైన, అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ శశిమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో..

ఎక్కడ వినవచ్చు

వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

PS: సుమనస్పతి రెడ్డి గారు శారదా శ్రీనివాసన్ గారితో ముచ్చటించిన ఆడియో రంజని గారు అందించారు...ఆ ఆడియో పరిచయాలు సెక్షన్లో

Saturday, June 16, 2012

"చారు" మీద శ్లోకం

చారు చారు తరంభాతి
హింగూజీరా సమన్వితం
కించిల్లవణలోపేన
పాలాశకుసుమం యథా!

ఈ "చారు" శ్లోకం శ్రీ బులుసు వేంకటరమణయ్య గారు "దీక్ష" అనే (1954) తన రచనలో  ప్రధానపాత్ర చేత చెప్పిస్తారు...

ఆ బ్రహ్మాండమైన రచన రేపో ఎల్లుండో వెబ్సైటులో.....

Friday, June 15, 2012

రంగు పడింది! అదీ ఆడవాళ్ళ మీద....

రంగు పడింది! అదీ ఆడవాళ్ళ మీద....

మా ఆవిడను, ఇక్కడున్న వారిలో ఎవరికే రంగు బాగుంటుందని అడగకుండానే బట్టలు వగైరా మీద రంగు పడేసా - ఇంకా ఒంటి మీద పడెయ్యాలి !

అది రేపో ఎల్లుండో....

On 16 by 20 inches canvas

Acrylics....
అమృతాంజనం మీద పాటా? ఆహా!

అమృతాంజనం మీద పాటా? ఆహా!

ఎంతటి సుదినము!

గరిమెళ్ళ వారి రచనా ప్రతిభకు సలాములు


ఆసక్తికరమైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి బిజినెస్ అడ్వర్టైసుమెంటు!

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి బిజినెస్ అడ్వర్టైసుమెంటు (1957)

ఆసక్తికరమైన సంగతి......!!

Thursday, June 14, 2012

ఆకాశవాణి విజయవాడ వారి మరో ఆణిముత్యం!

 ఆకాశవాణి విజయవాడ వారి మరో ఆణిముత్యం

"నాటకం"

రచన: శ్రీ డి.వి.నరసరాజు
నిర్వహణ: శ్రీ పాండురంగం, శ్రీ సుబ్బారావు
సాంకేతిక సహాయం: శ్రీ బి.ప్రకాశరావు

ఊర్వశి: శ్రీమతి జి.నిర్మల (సినిమా నటి నిర్మలమ్మ)
రఘుపతి: శ్రీ రామచంద్ర కాశ్యప్
రామానుజం : శ్రీ నండూరి సుబ్బారావు
మధు: శ్రీ ఎల్.నరసింగరావు
బట్లర్ : శ్రీ విన్నకోట రామన్న పంతులు
శివశంకరం: శ్రీ మాచినేని వేంకటేశ్వరరావు
కామరాజు: శ్రీ కోకా సంజీవరావు

ఒక నాటకాన్ని ప్రారంభించటం, ప్రధాన పాత్రలని పరిచయం చెయ్యటం, అసలు పాత్రలెందుకు వచ్చాయో ప్రేక్షకులకు అర్థం కావటానికి అరగంట పట్టటం, ఈ గొడవంతా ఎందుకు పాత్రలని ప్రవేశపెట్టగానే స్టేజీ మీదే పరిచయం చేసేసి ఆ తర్వాత అసలు నాటకం మొదలుపెట్టటం - ఇలా కొత్త విధానం మనమే మొదలుపెడదామంటూ - ఊర్వశి రూము పక్కనే హోటల్లో రూము బుక్ చేసిన రఘుపతి సంగతులతో సాగుతూ బోల్డంత హాస్యాన్ని కురిపిస్తూ నడిచిన ఈ "నాటకం" అపురూపమైన నాటకాన్ని ఆడియో రూపంలో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో

ఈ నాటకంలోని విన్నకోట గారు, కాశ్యప్ గారు, సుబ్బారావు గారు - వీళ్ళందరి మాడ్యులేషన్ వింటే నటులంటే వీళ్ళు, నటన - ప్రెజెంటేషన్ అనేది నేర్చుకుంటే వీళ్ళ దగ్గరనుంచి నేర్చుకోవాలి అని అనిపించకపోతే అంతకన్నా "ఇది" మరొహటి లేదని ......

ఎక్కడ వినవచ్చు


వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు - నాటకాలు సెక్షన్లో

మరొక్కసారి శ్రీ శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీసీత కోసం వెతుకుతూ .....దీర్ఘాలోచనలో, శోకంలో!!

రాములోరొచ్చారు - రాంభజన

సీతకోసం వెతుకుతూ .....దీర్ఘాలోచనలో, శోకంలో ఆకాశవాణికి చెందిన ఇద్దరు దిగ్గజాలు నాటక రంగం గురించి మాట్లాడుకుంటే ? - అరుదైన ఆడియోలు

ఆకాశవాణికి చెందిన ఇద్దరు దిగ్గజాలు నాటక రంగం గురించి మాట్లాడుకుంటే ?

ఆ దిగ్గజాలు : శ్రీ ఏ.బి.ఆనంద్, శ్రీ నండూరి సుబ్బారావు

నాటకరంగమేమిటి, ఆయా నటులకు దక్కే గౌరవం ఏమిటి, వారికి దక్కే గుర్తింపు ఏమిటి, నటకులకు స్ఫూర్తి ఏమిటి, వివిధ నాటక రంగ సమాజాల గురించి, వివిధ నాటకాల గురించి, పలువురు నటుల గురించి , ఆయా నటుల డిసిప్లిన్ గురించి - ఇలా ఒకటేమిటి, ఎన్నో విషయాల గురించి విస్తృతంగా చర్చిస్తూ తన నాటక రంగ ప్రస్థానం, నాటకానుభవాలను వివరిస్తూ  శ్రీ నండూరి సుబ్బారావు - శ్రీ ఏ.బి.ఆనంద్ ల మధ్య జరిగిన అరుదైన సంభాషణ ఆడియో రూపంలో పంపించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో....

ఎక్కడ?

అరుదైన ఈ ఆడియోలు - వెబ్సైటులో - రంగస్థలనటులు - ఆడియో సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

PS: Quite a few of other audios on the page have been corrupted for unknown reasons. No trouble with the ones above though. Others - Will be fixed in a day or two.  Sorry for the inconvenience it may have causedWednesday, June 13, 2012

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ నండూరి సుబ్బారావు - అరుదైన ఆడియోలు!

ఆకాశవాణి ప్రముఖులు శ్రీ నండూరి సుబ్బారావు గారు ఆంధ్రదేశం కలకాలం గుర్తుపెట్టుకునే, గుర్తుపెట్టుకోవాల్సిన కళాకారులు. వారి గురించిన విశేషాలతో శ్రీ నండూరి వారి ఆరోగ్యం బాగులేనప్పుడు వారి ఇంటివద్దే రికార్డు చేయబడిన వీడియో నుంచి ఆడియోను వేరు చేసి, రెండు భాగాలుగా పంపించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో.

ఈ ఆడియోలో శ్రీ నండూరి వారిని పరిచయం చేసింది ప్రఖ్యాత రచయిత, కవి, పాత్రికేయులు శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు. ఆ అద్భుతమైన పరిచయం వింటూ ఉంటేనే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలిసి ఆనందం కలుగుతుంది.

పరిచయ భాగం అయిపోయాక వినపడే ఆడియో భాగంలో శ్రీ నండూరి వారిని ఇంటర్వ్యూ చేసింది శ్రీ ఏ.లింగరాజు శర్మ గారు ( నటులు మరియు అనౌన్సర్) , శ్రీ పి.పాండురంగారావు గారు (నటులు, రిటైర్డ్ స్టేషన్ డైరెక్టరు) , శ్రీ మాడుగుల రామకృష్ణ గారు (అనౌన్సర్).

అరుదైన ఈ ఆడియోలు - వెబ్సైటులో - ఆకాశవాణి కార్యక్రమాలు -- పరిచయాలు సెక్షన్లో

మరొక్కసారి శ్రీ శశిమోహన్ గారికి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ

వీడి గోలేమన్నా అర్థమైందా?

వీడి గోలేమన్నా అర్థమైందా?

నాకర్థమయ్యింది - వేసింది నేనే కాబట్టి!

నీకేం అర్థమయ్యిందో చెప్పు


Tuesday, June 12, 2012

గొట్టాం బాబు - తెలుగు అచ్చరాలు!

గొట్టాం బాబు - తెలుగు అచ్చరాలు!!!

ఎవులు బావ్ ఈన?

ఆయనెవులో పినాకియో అంట బావ్

అట్టాగున్నాడేంది ?

కన్పడ్తల్లా మెళ్ళో తెలుగచ్చరాల బోర్డు దిగేసి లగెత్తిత్తాండా

యాడికి లగెత్తిత్తన్నా?

నీ కొంపకే బావ్! ఉన్నది కాత్తా మర్సి ఊగులాడుతుండవ్ గా ...

ఌ - ఇయ్యన్నీ ఎప్పుడో అటకెక్కినై కద బావ్

నువ్వెక్కిత్తే యాడికన్నా ఎక్కుతై, దాన్సిగదరగ - ఉన్న " ఌ" ని పదంలో  క్ఌప్తంగా అని వాడుకోలేవ్?

అట్టాగే మిగతాయ్ కూడా....మనకుండాలిగానీ, పాపం అయ్యేం జేసినై......Lunch Time స్పీడ్ డ్రాయింగులో విజేతలు!!

Lunch Time స్పీడ్ డ్రాయింగులో విజేతలు ఇద్దరు

సమయం: 20 నిముషాలు
గీసినవి: 5
విజేతలు: రెండు

మొదటిది: కొద్దిగా లోపమున్నా రెండే నిముషాలు పట్టి  నాకెందుకో నచ్చింది....

రెండోది: ఓ ప్రయోగం - పెన్ను, పెన్సిలు కలిపి కొట్టింది.....6 mins....ఇదీ ఇంకా బా రావచ్చు కానీ, ఫరవాలా - బహుమతిచ్చెయ్యొచ్చు.....అందుకు విజేతను చేసేసా
వెల్లలో మునిగి అల్లక్కడే ఆగిపోయిన ఆడవారు!!!

వెల్లవేసిన ఆడువారు

అనగా రంగులద్దాల్సిన ఆడువారని అర్ధము.....

16 * 20 కాన్వాసు మీదకెక్కారు.....

రంగులు తేలట్లా......

అందుకు వెల్లలో మునిగి అల్లక్కడే ఆగిపోయారు.....వింత చుక్క - శ్రీ వడ్డాది పాపయ్య గారి కథ

వింత చుక్క - శ్రీ వడ్డాది పాపయ్య గారి కథ

ఎక్కడ?

వెబ్సైటులో అపూర్వ సాహిత్యము సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, June 11, 2012

చెప్పని సందేశం - చెప్పిన శ్రీశ్రీ

చెప్పని సందేశం - చెప్పిన శ్రీశ్రీ

ఎక్కడ?

వెబ్సైటులో అపూర్వ సాహిత్యము సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ 


దమ్ము, పానం, ఇరవై రూపాయలు, రెండు గంటలు, రొట్టె ముక్క, ఉత్సాహం

 
నాలుగైదు రోజులు దమ్ము లాగితే అలవాటు పడిపోతాం
రెండువారాలు పానం చేస్తే తాగుబోతులైపోతాం
మరి చిన్నప్పటినుంచి స్కూలుకెళ్తున్నాం...పుస్తకాలకి, చదువుకి దాసులెందుకవ్వం?
ఆలోచించాల్సిన సంగతేఇరవై రూపాయలు

బీదవాళ్ళకెవరికన్నా ఇవ్వాలంటే పెద్ద మొత్తం
హోటల్లో టిప్పు వదలాలంటే చిన్న మొత్తం
ఆలోచించాల్సిన సంగతే


రెండు గంటలు

సినిమాకైతే ఉరుకులు పరుగులు , ఆహా ఓహో
భగవంతుడిని ప్రార్థించుకోడానికైతే కుయ్యో మొర్రో వామ్మో వాయ్యో
ఆలోచించాల్సిన సంగతే


రొట్టె ముక్క

ఆకలితో భిక్షకొచ్చినవాడికి వెయ్యాలంటే పరమ చిరాకు
ఇంట్లో కొవ్వెక్కిన కుక్కకెయ్యాలంటే పరమానందం
ఆలోచించాల్సిన సంగతే


ఉత్సాహం

రోజంతా పనిచేసినా సాయంత్రం జిమ్ముకెళ్ళడానికి బోల్డంత
ఇంట్లో అమ్మకి కొద్దిగా సాయం చెయ్యాలంటే పిసరంత
ఆలోచించాల్సిన సంగతే
అలా వీణను చీల్చుకుని బయటకొస్తున్నదెవరు?

అలా వీణను చీల్చుకుని బయటకొస్తున్నదెవరు?

ఏమో నీకు తెలిస్తే చెప్పు

నాకైతే విఠలాచార్యుల వారి జగన్మోహిని భూతంలాగా ఉన్నది.....

అవునా?

మరి వీణలోకెందుకు దూరింది? 

తెలీదయ్యా ఎందుకు దూరిందో, ఆ తర్వాత ఏం చేస్తుందో!

సమయం: మూడు నిముషాలు
పేపరు సైజు: ఎ 4
గీసింది: పెన్సిలుతో

Sunday, June 10, 2012

ఇంకా విత్తం మీద కాంక్ష లేదంటూ శ్రీశ్రీ గారు నిర్వహించిన పజిల్ !

పజిల్ - శ్రీ శ్రీ

ఇంకా విత్తం మీద కాంక్ష లేదంటూ ఆంధ్రజ్యోతిలో - 1950 ప్రాంతాల్లో శ్రీశ్రీ గారు నిర్వహించిన పజిల్

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

సినిమా ప్రేక్షకులెవరు? - శ్రీ కె.వి.రెడ్డి గారి వ్యాసం

సినిమా ప్రేక్షకులెవరు? - శ్రీ కె.వి.రెడ్డి గారి వ్యాసం

ఆంధ్ర మహిళ - మే 1950 ప్రతి నుండి

ఎక్కడ?

వెబ్సైటులో అపూర్వ సాహిత్యము సెక్షన్లో

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, June 8, 2012

గొప్పవారితో గుసగుసలు!!

గొప్పవారితో గుసగుసలు

- ఆంధ్ర పత్రిక 1947వ సంవత్సరంలో శ్రీ వారణాసి శ్రీనివాసరావు గారు వ్రాసిన "గొప్పవారితో గుసగుసలు" అనే రచనలతో ఒక సీరీస్ ప్రారంభించి, ఆ గుసగుసలన్నీ ప్రకటించింది.

పూర్వమహాపురుషుల చరిత్రాంశాలను సేకరించుకొని, ఆయా సంఘటనలను, అవస్థలకు తగిన మానసిక స్థితులను ఊహించి, వారిని యధార్ధ పురుషులుగా మనలో వారిగా, మనతో సంభాషిస్తూ తమ నిజ చరిత్రను చెప్పుకొంటూన్నవారిగా, ఈ గుసగుసలలో చక్కగా చిత్రించారు. శ్రీ శ్రీనివాసరావు గారు బందరు హిందూకాళాశాల మొదటి ప్రిన్సిపాలుగా పేరెన్నికగన్నవారు.ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యాలలో అసాధారణమైన ప్రజ్ఞ కలవారు.

వారు వ్రాసిన ఆ గుసగుసలు ఇక్కడ ప్రచురించటానికి సాహసిస్తున్నాను. ఎడమవైపున ఉన్న అపూర్వ సాహిత్యము సెక్షన్లో చదువుకోవచ్చు

కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమాత్రం లేదని తెలియవేసుకుంటూ, ఈ రచనలు మరింతమందికి చేరువకావాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉంచటం జరిగిందనీ, కాపీరైటు హక్కుదారులు వీటిని తీసివెయ్యమని కోరిన వెంటనే క్షమాపణలతో  తొలగించబడతాయని తెలియచేసుకుంటూ

భవదీయుడు
మాగంటి వంశీ

వీళ్ళు కూడా తెలీదా? ఖర్మరా నాయనా!

వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళే

ఎవరు బాబూ వీళ్ళు?

వీళ్ళు కూడా తెలీదా? ఖర్మరా నాయనా!

అయితే చెప్పినా తెలియదులే!

Red Ball Point On A4
Thursday, June 7, 2012

ఆహా! చెవులకు, మనసుకు ఎంత హాయిగా ఉన్నదో....

ఈరోజు కర్నాటిక్ రేడియోలో హైలైటు పాటలు

*************************************************


ఆసై ముగం మరందు పోచె ఇదై  - మధుర కవి శ్రీ సుబ్రహ్మణ్య భారతి

శ్రీ డి.కె.జయరామన్

A killer song - rhythm wise and voice wise. Wah! Wah!

Have no clue what it means though....

Heck! who cares?

Listening to good music has no boundaries, no barriers, no language restrictions.....

PS: If any one has the translation of this beautiful song either in english or telugu, pls do share. Million thanks in advance
**************************************************అరుపదై - రాగం తానం పల్లవి - శ్రీమతి అరుణా సాయిరాం

ఆహా! చెవులకు, మనసుకు ఎంత హాయిగా ఉన్నదో**************************************************


నన్ను విడచి కదలకురా - రీతిగౌళ - త్యాగరాజు

శ్రీ డి.కె.జయరామన్

Killer Voice - Particularly This One Killer Song - Wah! Wah! 

The same in Sri Maharajapuram Santanam's voice can be heard in the website

HERE

భక్తిరంజని - ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం - జులై 12, 2011**************************************************Ooh! Aah! Vow! - 1000 Posts!

Ooh! Just noticed......

999 Posts Published as of last one......This one hits the 1000 milestone.....

Eh? How?

Yeah - I knew you would ask that pea-brain!

On top of it - There are 68 in draft mode, which did not see the "blog-light"and may not in the near future!

So technically I say - 1000 barrier has been crossed long time ago!

Ok - Back to the post - Primarily this blog serves as an advertisement to the website!

And it's out there for crawlers to pick up and display in search results.....

Had I spent these man hrs on the website, it would have turned into a monster...Oh well!  :)

Anyways .... During this blog journey - more morons have crossed the path than intelligent souls - but caring a shoe lace for them, 5 + blog years - 1000 posts journey was over all good, I say!.....

Though it might look like an odd piece here, in this post - I will extend thanks to each of the following souls

Dr K B Gopalam
Paruchuri Srinivas
Sri Kodavatiganti Rohiniprasad
Sri J K Mohana Rao
Smt Lyla Yerneni
Sri Sudhama
Tadepalli Lalita Balasubrahmanyam
Chaduvari - Tummala Sirish Kumar
Kottapali - Narayanaswamy
Bhairavabhatla Kameshwara Rao
Blaagaadistaa Ravi
Dr Ismail
Maruvam Usha

Ok - All said and all done....

Back to the business!!
"వాంతి" అనే రహస్య మార్గం

వాంతి అనే రహస్య మార్గం

1947 ఆంధ్ర పత్రికలో ఓ పదహారేళ్ళ కుర్రోడు కడుపులో కలకలం అని పేరెట్టి వ్రాసిన బ్రహ్మాండమైన కథ....

అదాటుగా మిరపకాయ్ పొట్టోడు గుర్తుకురావట్లా?Wednesday, June 6, 2012

బుడ, బుడ, బుడ - బుడుకో, బుడక్

(1952 గోసేవ పత్రిక నుండి)

అంబపల్కు
జగదంబ పల్కవే
ఆదిశక్తి
త్రిపురాంభ పల్కవే
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్

ఓంకారమే జపించు దేవరా
ఓంకారమే జపించు దేవరా
మనసులో మాటా
చెబుతాం బాబూ
మూడు లోకముల
ముచ్చటలన్నీ
ముందు జరిగెడివి
జరగబోయెడివి
అన్నీ మాకవగాహన బాబూ
ఆదిశక్తి దయవల్లను బాబూ
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్


దోసపండ్ల విధాన బిడ్డలు
దొర్లుదురు నీయింట తల్లీ
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్
బుడ, బుడ, బుడ
బుడుకో, బుడక్

శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి హస్తాక్షరి - 1935

శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి హస్తాక్షరి

1935 - చంద్రిక మాస పత్రిక నుండి

డూ డూ డూ డూ యెంకన్నా!

గంగిరెద్దు

-- అడవి బాపిరాజు (1950 జనవరి)

డూ డూ డూ డూ యెంకన్నా
పెభువుగారికి దణ్ణంపెట్టూ
పాదం వంచి భక్తితొ పెట్టూ
కాసులు మువ్వలు కడతారంటా
పట్టుశాలవలు పెడతారంటా  || డూ డూ||

మోసం చేసును మునసబుగారూ
కక్షలు కట్టూ కరణంగారూ
కలుపులుకన్నా కాపులువీరూ
డూ డూ డూ డూ యెంకన్నా ||

పత్తికాయలో బ్రామ్మణధాటీ
పాగాసుట్టే నాయుడు భేటీ
డూ డూ డూ డూ యెంకన్నా  ||

సెన్నాపట్నం సేర్వరాదు
కాశీపట్నం కానగపోదు
కాపావరమూ కదలాలేదు
డూ డూ డూ డూ యెంకన్నా ||

చెట్టు కదిలినా పుట్ట కదలదూ
నీరుపోయినా నాచుకదలదూ
గుడిపాడైనా గూబవదలదూ
గుడిమాన్నెం పూజారి వదలడు
డూ డూ డూ డూ యెంకన్నా  ||

యేడుకొండలా యెంకన్నండీ
యెండికొండలా ఈశరుడండీ
పయిడికొమ్ములా బసవయ్యండి
డూ డూ డూ డూ యెంకన్నా  ||

ఆకుమడి!

ఆకుమడి

-- అడవి బాపిరాజు (1949 జూన్)

వెయ్యరోయి, గూడవేయరా
ఓ సిన్నిబావ

వెయ్యరోయి, గూడవేయరా
వాడిపోయెను నారుమళ్ళు
వేడిగాడ్పు విసురుతాది
జోడు కలిపి నీళ్ళు తోడరా
నా సిన్నిబావ

చల్లనీళ్ళు మళ్ళకెత్తరా
తూర్పుమబ్బు పట్టలేదురా
నా సిన్నిబావ

తొలకరించి ఝల్లుకురవదోయ్
పచ్చనైన ఆకుమళ్ళు
వెచ్చనార్చె మూనలెండె
బలముపొంగ తాడుపట్టరా
నా సిన్నిబావ

పొలంపడుచు చక్కిలెట్టరా
నన్నుచూసి నవ్వబోకురా
ఓ సిన్నిబావ

పొన్నపూవు సెవిని బెడితిరా
తేనెలూరు నా సిగ్గులు
ప్రాణమిచ్చు నా సొగసులు
సుళ్ళు చుట్టి పరుగులెత్తరా
ఓ వలపుబావ
మళ్ళుకట్టి బ్రతుకు నింపరా

చచ్చేట్టు కడుపుబ్బటమేమిటి, నవ్వలేక చావటమేమిటి!!

సీనంటే, సినిమా అంటే ఇట్లాగుండాలయ్యా.....

నిన్న మూడొందలోసారి మిస్సమ్మ డి.వి.డి ఏసా!....

మచ్చుకి ఒకటి ...

********************************************

ఎస్.వి.ఆర్ - మేరీ రాలేదేం?

ఎన్.టి.ఆర్ - ఒంట్లో బాగోలేదు

ఎస్.వి.ఆర్ / అల్లు - ఏమిటి జబ్బు?

సావిత్రి - ???

అల్లు - ఓ నీవు చెప్పకపోతే మనం కనుక్కోలేమా? మనం మూగాళ్ళకు మందిచ్చాం.

అల్లు సావిత్రి చెయ్యి పట్టుకొని - ఇది వాతం, ఒక్క వాత హరి మాత్ర తగిలిస్తే తెల్లవారేసరికల్లా తేలిపోతుంది

సావిత్రి - నాకు వాతంలేదూ, పైత్యం లేదూ వెళ్ళు బయటికి

అల్లు - ఓ ఇందులో పైత్యం కూడా ఉంది, వాతం మూడు పాళ్ళు, పైత్యం ఒక పాలూ. వాతహరి ముప్పావుమాత్రా, పైత్యాంతకం పావుమాత్ర తేనెలో రంగరించి పుచ్చుకుంటే.....

సావిత్రి - తేనెలో కాదు విషంలో రంగరించి మీరే పుచ్చుకోండి. నాకేమీ అక్కర్లేదు మీ మందులు

అల్లు - వాతం కాదు పైత్యం కాదు దయ్యం పట్టింది. నేనొదిలిస్తా

సావిత్రి - నాక్కాదు దయ్యం పట్టింది, నీకూ. నేను వదిలిస్తాను

ఎస్.వీ.ఆర్ అల్లుని బయటకు తరిమేస్తూ - దయ్యం గియ్యం ఏమీలేదు పోవయ్యా. కాస్సేపటిలో మూడు రోగాలు చెప్పావ్

అల్లు - చెప్పానంటే అబద్ధం చెప్పానటండీ. ఆయా లక్షణాలను బట్టి ఆయారోగాలు చెప్పాను

అల్లు బయటకెళ్ళి మంత్రాలు.....

***************************************************

చచ్చేట్టు కడుపుబ్బటమేమిటి, నవ్వలేక చావటమేమిటి.....బాబోయ్ ...వందనాలు వందనాలు...

శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారి దస్తూరి!

శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారి దస్తూరి

1935 చంద్రిక మాస పత్రిక నుండి

హైకూ తాంబూలాలు స్వీకరించవలెను..

హైకూ తాంబూలాలు స్వీకరించవలెను..

బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ హైకూలుకు విచ్చేసి భోజన తాంబూలాదులు స్వీకరించవలె అని ప్రార్థన...

భోజనంలో తెల్లని అన్నం ఒక్కటే పెట్టబడును, ఎవరి కూరలు, పప్పులు వాళ్ళే తెచ్చుకోవలెను 

తాంబూలంలో వక్కలు సున్నము ఇవ్వబడవు, ఉత్త ఆకు నమలుకోండి....

ఇందులో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి కలగలపుగా ఉన్నవి.....కాబట్టి ఎవరిక్కావలసింది వారికేనని......!


*******************

 అదే మాట
ఒకడి నోట్లో కత్తి
ఒకడి నోట్లో మట్టి


*******************

 అదిగో భయం
దిగులు దాన్ని చూసి
తుర్రున పరిగెత్తింది

*******************

చేతిలో కలం కాగితం
భావం కోసం చూస్తే
భాష అడ్డొచ్చింది

*******************

అదిగో ఏరు
ఇదిగో తెప్ప
ఏరు దాటాక ? 

*******************

సముద్రపు ఒడ్డు
అలల స్నేహానికి
ఉరకలెత్తుతున్న మౌనం

*******************

వారపు సంత
నిండు గంపలు
జతల కళ్ళల్లో ఆశలు

*******************

రైతు కష్టం
అలల పాలు
సముద్రుడికేం?


*******************

అదిగో రాహువు
ఇదిగో జ్యోతిష్యులు
పరిగెత్తండి

*******************

గొప్పవారేమి
కొద్దివారేమి
కాలానికందరొక్కటె

*******************

నల్లని గుహలో
చిక్కని చీకటి
గల గల శబ్దం

*******************

ఎన్ని కూరలో
ఎన్ని పచ్చళ్ళో
ఈ చిన్ని పళ్ళెంలో

*******************

నాలోని కామందుకు
ఒక్కటే వస్త్రం
నా పాటకు ఒక్కరే శ్రోత

*******************
 
 హోరున వాన
వదిల్చింది తల మురికి
మూలిగింది మనసులో మురికి

 *******************

తన్నే దాకా
ఎక్కడుందో
బురదలో పంది

*******************

అదో చదరంగం
పెట్టాను దానికి
రెండు కిటికీలు

*******************

చేతిలో చెంబు
ఊర్లో చెరువు
ఆహా ఏమి సుఖం

*******************

అదో ఎర్రని ముక్కు
చీదితే బర్రున
వచ్చింది గంపెడంత

*******************

తెల్లని అన్నం
తెగ తిన్నాను
వచ్చింది పొట్ట

*******************

డాబా మీద పడుకుని
సూర్యుణ్ణి చూస్తుంటే
కళ్ళు పోయినాయి

*******************

బావిలో చేద
జర్రున లాగితే
బోలెడు నీళ్ళు

*******************

తెల్లని జుబ్బా
నల్లని పైజమా
ఆహా ఏమి వేషం

*******************

రాలిన పూలు
రాలిన ఆకులు
ఒకే చెట్టునుండి

*******************

అదో లోయ
అందులో మేనా
ఏదీ పెళ్ళికూతురు

*******************

అదొక కంప
దానికింద ఉన్నదొక
జిగురున్న బంక

*******************

అదిగో పువ్వు
ముడిస్తే సిగ్గు
విచ్చితే నిగ్గు

 *******************

భయంతో కూడిన అరుపులు
వినిపిస్తున్నాయి
నా హృదయంలో

*******************

వీణకు ఒకటే తీగ
నా దేవికి
ఒకటే పాట
 *******************


కాకీ హూత్ - (1917)

కాకీ హూత్

- బాలగేయాలు (1917)

అక్కదాచిన లక్క పిడతలు
చెల్లె తిసుక చేతబట్టెను
అక్క వచ్చి ఆడ నిలచి
టక్కు మాటలు చాల బలికి
"కాకీ హూత్త"ని అటులజూచి
"కాకీ హూత్త"ని ఇటులజూచి
చెల్లె చేతి లక్కపిడతలు
లాగుకొని తా బేగి పోయెను

Tuesday, June 5, 2012

నాకు పన్నెండేండ్ల వయసగు దాక దొంగతనములు చేయవలెనని!! - విశ్వనాథ

 దొంగతనం  -  చేస్తే ఏమవుతుంది అన్న సంగతి "అంతే" అన్న రచనలో వివరిస్తారు

********************************************

"అంతే"

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ
(1940 బాలకేసరి పత్రికనుండి)


నాకు పన్నెండేండ్ల వయసగు
దాక చిన్నవి దొంగతనములు
చేయవలెనని యూహ యుండెను
చేయుటకు భయమున్


పుస్తకంబులు కొనగవలెనని
పోయి యంగడి కచట వలసిన
పుస్తకములను కొన్ని తీసితి
పుచ్చుకొని చేతన్


అచటి యంగడిలోని మానిసి
అచ్చమైన యమాయకుండును
అతని మోసము చేయుచుండెద
రందరును పిల్లల్


రెండు పుస్తకములను దాచితి
రెండు మరి కనిపిచునట్లుగ
పుచ్చుకొంచు దుకాఋఅదారుకు
పోయి కనబడితిన్


పట్టి దాచిన పుస్తకాలకు
పావలా వెల చేత నుండిన
పుస్తకములకు రెండణాలను
పుచ్చుకొను మంటిన్


దాచి నట్టిది యాత డెచ్చట
చూచిపోవునో యంచు గుండియ
గుబుకు గుబుకున పైకి తోచగ
కొట్టుకొనుచుండెన్


అతని కనుమానమ్ము కలిగిన
అంతతో నా పనియు సరియని
నుదుట చెమ్మట పోసి నిలువున
కదలుచుండగనే


మాయ యెఱుగని యతడు పాపము
పోయి తన బేడ తా గైకొని
చేరి పదియును నాల్గణాల్ నా
చేతిలో పెట్టెన్

నేను కన్నును మూసి తెఱచెడి
లోన నచ్చటినుండి పరుగున
పోయితిని ఆ చుట్టు పట్టుల
పొడయు లేకుండన్


ఇంటికి పోవుద మటంచును
ఇంతలో మా అమ్మ కూరలు
తెమ్మటన్నది జ్ఞాపకమ్మును
తెచ్చుకొని మరలన్

ఆ బజారును వదలి కూరల
యంగడికి జని బీరకాయలు
పుచ్చుకొని నేనొక్క వీశెడు
మూట కట్టి వేసన్


బీరకాయల బేడ యంగడి
దారునకు నీయంగ జేబున
అర్ధరూపాయీని ఉంచితి
నతని హస్తములో


అంత నంగడిదారు నా దగు
అర్ధరూపా యట్టు-నిట్టుల
త్రిప్పి పడదని మరల నిచ్చెను
తిరిగి యంతటిలో


ఏల పడ దని యర్ధరూపా
యిట్టునట్టుల త్రిప్పిచూచితి
అదియు నొకవై పంత చెక్కిన
యట్లుగా నుండెన్


ఏమి చేయుటొ యింత తోచక
యెంత పట్టము తీసికొందు వ
టంచు నాతని నడుగ నాతడు
అసలు వద్దనియెన్


వారు వీరును వచ్చి చూచిరి
వారిలో గొందరు దయాళురు
అతడు బాలున్ డెంతయో యొక
యంత యిమ్మనగా


పట్టి యంగడిదారు చివరకు
పావలా వట్టం బటంచును
బేడ మినహాయించి బేడను
పెట్టె నా చేతన్


తిరిగి యింటికి వచ్చు చంతయు
గిరగిరా తిరిగెడు మనస్సున
దాని కది సరిపోయె నంచును
లోన నిది తెలిసెన్

పావలా మోసమ్ము చేసితి
పావలా వట్టమ్ము నొసగితి
పూని భగవంతుండు నాకును
బుద్ధిగా నేర్పెన్


నాకు అంతే అప్పటిప్పటి
దాక మోసము దొంగతనమును
చేయు టనగా భయము, ఊహయు
పోయె నిప్పటికిన్


ఎంతచాటుగ చేసినను వా
డెంతవాడో కాని దేవుడు
కుక్కకాటుకు చెప్పుదెబ్బగ
కూర్చియే పెట్టున్


చెవులపిల్లి ఒకటున్నదిరా! - (1946)

ఆకాశములో - ఆకాశములో
లెక్కకు మించిన చుక్కలురా
లెక్కకు మించిన చుక్కలనడుమ
చక్కనిచందురు డొక్కడురా

చక్కనిచందురు బింబముపై
చెవులపిల్లి ఒకటున్నదిరా
మాసము దినముల కొకపరి
చెవులపిల్లి మనకగపడురా


గణపతిదేవుని కోపమువలన
చంద్రునికంటె శాపమురా
శాపమువలన చందురుడెప్పుడు
పెరుగుచు తరుగుచునుండునురా

--- బొలిశెట్టి నారాయణమూర్తి (1946)

బాలగేయాలు - చింతాదీక్షితులు

బాలగేయాలు

--- చింతాదీక్షితులుకాకరపాదుకు కాయలందమ్ము
శ్రీకృష్ణతమ్మునికి తిరుమణందమ్ము
మల్లెపందిరికి మల్లెలందము
బీరపాదులకు పువ్వులందము
ఆడువారికి ముక్కుపుడకలందము


*************************ఉన్న ఊరూ విడిచి ఉండలేము
కన్నతల్లిని విడిచి ఘడియుండలేము
ఉన్న వూరూ నాకు చెన్నపట్నము
కన్నతల్లీ నాకు కల్పవృక్షము

ఐకమత్యం - శ్రీశ్రీ - 1952

ఐకమత్యం

-- శ్రీశ్రీ (1952, Jan 15 ఉదయిని)


ఐక్యం అదీ మనకి ముఖ్యం
అందులోనే వుంది సౌఖ్యం
లేనిపోని చీలికలు
రెండు రెండు నాలికలు
ఛీ యిదా బతుక్కి
ఫాయిదా


ఐక్యం అదీ వ్యవస్థ
అప్పుడుండదు మనకీ అవస్థ
కాదు ఔను అవును
కాదు కాదు అవదు
అనేకం అయితే ఏకం
అదే వివేకం

ఐక్యం అన్నింటికీ మూలం
అటే కదుల్తోంది కాలం
పురోగతికి ప్రపంచనీతి
మనదొకే మానవజాతి
వ్యక్తికి బహువచనం
శక్తి

ఐక్యం అదే మనకి గమ్యం
అప్పుడే సిద్ధిస్తుంది సామ్యం
వ్యర్థం స్పర్ధంటా
యుద్ధం వద్దంటా
కామ్యం ఐక్యం అయిన బతుకే
రమ్యం


ఐక్యం ఎప్పుడో కాదిప్పుడే
ఎక్కడోకాదు అదిక్కడే
మాట చేతగామారి
మనిషి మనిషితో చేరి
స్వప్నం సత్యం ఐతేనే
స్వర్గం

Monday, June 4, 2012

A lonely walker! Two minute sketch

A Quick two minute sketch...

Pen on A4.....

Inspired from a lonely old man walking in the neighborhood

అత్త కొట్టిన కుండ - కోడలు కొట్టిన కుండ

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ6. ఒక అత్తింటికోడలు గుంటలో పోసిన ధాన్యం దంచుకుంటూ అలసట తీర్చుకోడానికి పాడుకుంటూ సహాయం చేయమని తోటికోడల్ని రమ్మని పిలుస్తుందికొట్టారబోసిన కొలకల్లు దంచా
తోడైనరాయోలె తోటికోడల్లా

అరగదంచిన బియ్యం చేటల్లకెత్త
తోడైనరాయోలె తోటికోడల్లా

ముంగిటబోసిన మునివడ్లనెత్త
తోడైనరాయోలె తోటికోడల్లా

అంబటియేరొచ్చె అత్తగారా అంటె
కొలబుర్ర ఉన్నది కోడలన్నాది

అత్తకొట్టిన ఆ కుండ
అడుగోటి కుండైతె
కోడలు కొట్టిన కుండ
కొత్త కుండౌనా!

జానపద గేయాలు - 5 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


5. జానపద యువతీ యువకుల సరస సల్లాపాలు, అలంకారభూషితయై పోతున్న పల్లెపడుచును ఒక యువకుడు చూచి పలకరిస్తాడు. అందుకా యువతి అయిష్టతతో జవాబిస్తుంది


మెళ్ళో ముత్యాలపేరు ముద్దుగుమ్మా
బంగారు బొమ్మా
కళ్ళాకాటుక పెట్టి వెళ్ళేవయ్యారిభామ
ఒళ్ళే బంగారమా! లమ్మిఈ ! సిన్నమ్మా

సినకాపులుంటారు పెదకాపులుంటారు
నడిరోడ్డుపై సరసమయ్యా సిన్నయ్య
సందేయేళైనాది ముందెనక యేరునే
సరితోడు వుంటానె లమ్మీ సిన్నమ్మీ
నీకు సరితోడు వుంటానె లమ్మీ సిన్నమ్మీ

అందాల సందామామయ్యా తోడుండాడు
అలపూ వలపేలనోయ్ అందగాడా
నీవలసీపోతావు పోవయ్యా సిన్నయ్యా
నీవలసీపోతావు పోవయ్యా సిన్నయ్యా

జానపద గేయాలు - 4 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


4. వావివరుసలతో పిలుచుకునే పాటకపు యువతీయువకులు వారినొకరు ఒకరు జానపద శృంగారాన్ని పొందిపొదిగిన భావాలతో పలకరించుకుంటారొకచోట


సిన్నారి సిన్నోడ
సింతాసెట్టెక్కేవు సిగురాకు కోసేవు
నాకేసి సూసేవు
పదమేటొ పాడేవు   || సి ||

కొమ్మిరిగినాదంటె రెమ్మిరిగినాదంటె
కూలబడిపోతావు
కులికేవు పలికేవు || సి ||

గంపకెత్తేయాకు కదిలీ పోకుండాను
జామూపొద్దేళాయే
సరసాలేటోగాని
పోతుండరా తమ్ముడా
పోకామళ్ళాదారి పోతుండరా
తమ్ముడా    || సి ||

జరుక్ శాస్త్రిగారి "శూర్పణఖ" - All India Radio

జరుక్ శాస్త్రిగారి శూర్పణఖ

1948 జనవరి ఆంధ్ర మహిళ పత్రిక నుండి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ చదవవచ్చు?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

PS: ఇలాటివి మరికొన్ని చదవాలంటే - వెబ్సైటుకు వెళ్ళి ఎడమ పక్కన వున్న అపూర్వ సాహిత్యము సెక్షన్లో చదువుకోవచ్చు

కృష్ణశాస్త్రిగారు వేమన పద్యాలు రాస్తే ఎలాగుండొచ్చు?

కృష్ణశాస్త్రిగారు వేమన పద్యాలు రాస్తే ఎలాగుండొచ్చు?


************************

అర్చనకును రాతి నాచారమిచ్చెను
చచ్చురాతి భార్య సంఘమిచ్చె
కరకురాతి కూడు దొరతనంబిచ్చెరా
విశ్వదాభిరామ వినురవేమ!


************************

గూటిమీదనెక్కి సూటిగా కుక్కపై
విసిరినాడు రాయి అసిరిగాడు
కుక్క బొం యిమంటె గొల్లుమన్నాడయా
విశ్వదాభిరామ వినురవేమ!

************************

వీధిత్రోవనెపుడు వేంచేయు పంతులు
పెరటిదారి పందు లరుగుదెంచు
తొందరపడి సాని పందినే వలచెరా
విశ్వదాభిరామ వినురవేమ!

************************

అమెకున్న కలిమి ఆకలి కడుపై
అతనికున్న ఆస్తి అవిటికాలు
ఇరువురకును నడుమ విరితూపులెగిరెరా
విశ్వదాభిరామ వినురవేమ!

************************

సోమయాజి జోలియచూచితే
పొట్టిసాని మనసు పట్టలేదు
తండులములులేక తటపటాయించారు
విశ్వదాభిరామ వినురవేమ!

************************

నిదురమత్తులోన నీటుగా నామాలు
పెట్టె స్వామివారు పిల్లినుదుట
పిల్లి భక్తి పుట్టి చెల్లించె పులిహోర
విశ్వదాభిరామ వినురవేమ!

************************

ముఘలు పాదుషాలు తుఘలక్ నవాబులు
డొక్క చించి తోలు చెక్కిరంచు
కుట్టు సాయిబయ్య కొట్టు బడాయీలు
విశ్వదాభిరామ వినురవేమ!

************************

తాను ముసలుమాను, తాను తామర్లేను
మణుకి దూది శత్రుగణము, లింక
ఏకె ఠం యి ఠం యి ఎందరో కాఫర్ల
విశ్వదాభిరామ వినురవేమ!

************************

అపుడు విష్ణుభక్తి అపుడు శివభక్తి
బ్రహ్మభక్తి యిపుడు బయలుదేరె
ఒక్క దేవునికి చిక్కదు విశ్రాంతి
విశ్వదాభిరామ వినురవేమ!

***********************


సకలమతములన్న చక్కని ఋక్కులు
ఎన్నొ సుకవి వాక్కు, లన్నివచ్చు
భక్తవరుని తెలివి బ్రహ్మకు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ!-- ఇవి అన్నీ ఆయన నిజంగా రాసినవే, ఆంధ్రజ్యోతి పత్రికలో 1950ల్లో....ఇంకా బోల్డున్నై....వీలు వెంబడి తీరిగ్గా 

Sunday, June 3, 2012

ఇంతమంది ఆడోళ్ళంటే కష్టమే నాయనా!

ఇంతమంది ఆడోళ్ళంటే కష్టమే నాయనా!

వీళ్లందరిని పెన్సిల్లుతో ఓ చోట చేర్చడమే కష్టమయ్యింది....ఇహ పెయింటెయ్యాలంటే ?

On 16 by 20


ఇంకా బోల్డు అలంకారాలు చెయ్యాలి, సింగారించాలి.....

అందాకా ఆనందోబ్రహ్మ  !!జానపద గేయాలు - 3 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


3. కూలీనాలి చేసి కష్టపడి పొలంలో పదిడబ్బులు సంపాదించుకొని, ఆనందంతో జీవితాన్ని గడుపుకునే పల్లెటూరి యువతీయువకులు, తమ మనోభావాల్ని చెప్పుకుంటున్నారు

ఊడ్పు లూడ్చీ యింటి కెడదామే
రాయోలె పిల్లా!
ఊడ్పులూడ్చీ యింటి కెడదామే!

సీరాలెల్లి ఓ సీరాతేవయ్యో
సీరాగట్టితే సిలకలాగుంటా! ఆ
ఊడ్పులూడ్చీ యింటి కెడదామే!

పోలేరమ్మగుడి పుంతకాడ
ఆజాలారెంకటసామి జట్టేటో
ఆజాలారెంకటసామి జట్టేటో
వాలుగన్నులా సిన్నదానా!
వల్లమాలినా సిగ్గేటే
వచ్చి పోపో మంటారు
యెంటరారో యెంకన్నమావ!
యెంటరారో యెంకన్నమావ!

జానపద గేయాలు - 2 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


2. కర్షకుల పాట


ఈ యేటికోతల్లు గైరమ్మా!
ముప్పావలాకూలె గైరమ్మా! సేను
సితకాపండిందోలె గైరమ్మా
అర్ధరూపాయికూలె గైరమ్మా!

ఆకుతోటైతేను గైరమ్మా!
పావలా కూలె గైరమ్మా!
పదునుకొడవలిబట్టి గైరమ్మా
పంటసేను కోతామె గైరమ్మా!

రాజనాలపంట రమ్మెమైనా పంట
భూదేవి పండించె గైరమ్మా!
భూదేవి పండించె గైరమ్మా!

జానపద గేయాలు - 1 (1952 All Inida Radio Broadcast)

ఆంధ్రదేశపు జానపద గేయాలు
(1952 All Inida Radio Broadcast)

రచయిత్రి: శ్రీమతి గిడుగు లక్ష్మీకాంతమ్మ


1. ఎండి బీటవారిన పొలాలు నీటితో నిండాలని చక్కని పంట పండాలని కర్షకులు పాడుకుంటున్నారు


ఏతాము ఎత్తరా తమ్ముడా
ఎండిన చేలన్ని నిండాలి
భూమి పండాలి

రాజనాల పంట రమ్యమైన పంట
మూడుకాలాల మురిపాలొలికించేటి
ముత్యాల పంట

పండాలి భూమి - పండాలి
కాడీ యెద్దుల కట్టి దున్నాలి
కరువు పోవాలి

కడుపు చల్లగ మనకు నిండాలి
భూదేవికి మనము మొక్కాలి

ఏతాము ఎత్తరా తమ్ముడా
ఎండిన చేలన్ని నిండాలి
భూమి పండాలి

Saturday, June 2, 2012

ఈ అమ్మాయెవరో చెప్పగలిగితే!!

ఈ తెలుగు అమ్మాయెవరో చెప్పగలిగితే

Clue -

1) She is from the music world.
2) Classical music world.
3) It is from the 1950'sపగటిచుక్క - ఆరుద్ర

పగటిచుక్క

(ఆరుద్ర - 1952, జనవరి 15 ఉదయిని)


వాడికోరల నోరు తెరచిన
వన్యమృగమును పోలు చీకటి
మనిషిమీదకి దుముకుచున్నది
మధ్యాహ్నవేళ!


పగలుమాసిన ఇరులమూకను
పట్టి చీల్చగ పొడిచె నింగిని
పదను పట్టిన కత్తిమాదిరి
పగటిచుక్క


పట్టపగలే కారుచీకటి
ముట్టడిస్తే మూగవోయిన
పెద్దలంతా చుక్కపొడుపుకి
బొబ్బలు పెట్టిరి

ఇరుల బాధను తొలగజేసే
అరుణతారక వెలుగు సంపద
అడ్డు చెప్పినవారు సైతం
అనుభవిస్తురు

జాడలు పట్టేవాడి జాడ పట్టుకోవడం!

జాడలు పట్టేవాడి జాడ పట్టుకోవడం

TED talk by Gary Kovacs


అగ్ని పర్వతం - రెంటాల గోపాలకృష్ణ

అగ్ని పర్వతం

-- రెంటాల గోపాలకృష్ణ (1952)


మానవాళి పగతో నిండిన
మధ్యందిన భానుమండలం
                                    సంఘర్షణ!

బిగబట్టిన పిడికిలి చలిలో
రేగిన అగ్నిజ్వాలల జిహ్వలు
                                      సంహారం!

యువకంఠం చీచుకవచ్చే
ఊపిరి విసిరేసిన కేకలు
                                      సంగ్రామం!

ఉషఃకాల జల దుద్భవమౌ
అరుణారుణ రేఖావళులే
                                          సంక్షోభం!

కార్మిక కర్షక జనముల
రక్తచ్ఛాయ పతాకం
                                          సంకేతం!

నగశిఖరాగ్రములు పగిలి
నగరవీధి నిండిన జనం
                                             సంకీర్ణం!

మరచక్రపు మంటల గంటలు
మారుమ్రోగు కంఠారావం
                                               సందేశం!

పాడుపడ్డ గుడిమూలల్లో
పాడుతున్న ఆకలి గొంతుక
                                                సంగీతం!

జడతను శాసించుచు పలికిన
జగజ్జనత కవితాగీతిక
                                                 సాహిత్యం!

విశాల విశ్వాలయ గోపుర
మొక్కటిగా నిలబెట్టుట
                                                  సమధర్మం!

Friday, June 1, 2012

కవికి.......పెద్ద ఫిరంగులు

కవికి....


--- నార్ల వెంకటేశ్వరరావు

(1952 జనవరి ఉదయిని)


మాటలే కవికి
మూటలు, తేనెల
ఊటలు

రంగులే కవికి
హంగులు, పెద్ద ఫి
రంగులు


నీడలే కవికి
మేడలు, దీనుల
వాడలు

అందమే కవికి
డెందము, విమలా
నందము

యామినే కవికి
కామిని, కవితా
భామిని

పాటకే కవికి
బాటలు, వెన్నెల
తోటలు

గానమే కవికి
పానము, భాగ్య వి
తానము

సత్యమే కవికి
నృత్యము, వన్నెల
ముత్యము

వలపులే కవికి
తలపులు, రేపటి
పిలుపులు

త్యాగమే కవికి
వేగము, లంకా
యాగము

లోకమే కవికి
నాకము, అనుభవ
పాకము

విశ్వమే కవికి
అశ్వము, ఊహకు
హ్రస్వము

కల్పమే కవికి
అల్పము, పన్నగ
తల్పము

తత్త్వమే కవికి
సత్వము, సదా శి
వత్వము

కాకిగిన్నెను కాకికిస్తిని!

శిశు హృదయం


- నార్ల (1952, జనవరి 15 ఉదయిని)


చీమనెందుకు
చంపినావుర?
చెరుపు నేంఇటి
చేసె నీకది?

నన్ను గల్తే
నన్ను యెందుకు
చీమ-మరి-క
ర్చిందిరేపూ


******************


గారె తుంపులు
కాకికోసమె
పిలిచి పెడితివె
పిచ్చి తండ్రీ!


కాదె అమ్మా!
గారె తెచ్చిన
కాకిగిన్నెను
కాకికిస్తిని******************బొగ్గు గీతలు
ముగ్గు పూతలు
మురికి తగినా
ముఖమునిండా?

మురికికాదే
ముఖమునిండా
ముద్దుమీసం
ముసలి గడ్డం


******************బేడయిస్తే
యేడుపెందుకు?
అంతులేదా
ఆగడాలకు!

వద్దుపోవే
పాడుబేడా
నాల్గు కాసులు
నాకు తేవే!*****************కాగితాలకు
కరువు రోజులు
పెట్టవచ్చునె
పిచ్చి గీతలు?

పోవె! నీ కివి
పిచ్చిగీతల
చందమామకు
జాబురాస్తే!****************చదువు సంధ్యలు
చట్టు బండలు
పడవలేనా
పొద్దుగూకులు?


పడవపంపిన
బావరాడా?
అక్క నాకూ
చక్కరెట్టద?****************


జేబునిండా
చేర్చికూడా
చాలవటరా
గోలికాయలు

ఎందుకైతే
చందమామకు
కొండనిండా
గోలికాయలు?
*****************


మబ్బుతునకను
అబ్బురంబుగ
చూడనేటికి
చిన్నవాడా?

ఎంత దూరమొ
ఎవరు విడిచిరొ
చాల గొప్పది
గాలిపట మది!


*****************

స్వస్తి!

స్వస్తి

---  విద్వాన్ విశ్వం

(1952 జనవరి ఉదయినిలో)
(క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ)


ఆకాశం తెరవిచ్చి, ఉ
షః కన్యక దువాళించి
శ్రీకారం చుట్టుతోంది

చీకటి మూకల వీపులు
బాకులతో పొడుస్తోంది

శోకం సాకల్యం మా
రాకు వేయనీని అనం
తాకారం నాకం ఏ
దో కనబడుతున్నది. వ
చ్చే కాలం చలికాలం
లా కాదని, మూగనోము
తో కార్యం లేదని, అం
గీకార్యం విధి అని, కడు
పే కైలాసంగా బతి
కే కుత్సిత పాపపథం
లో కల ముళ్లన్నీ రా
లే కాలం చేరువలో
నే కలదని - చెబుతున్నది

నీకూ నాకూ మనకూ
వేకువ కాబోతున్నది

తేకువ, తెంపూ, సొంపూ
చేకూర్చుక గొంతుకెత్తి
కేకవేయి, స్వస్తి సమ
స్తాఖిల బాధిత జనతా
సౌఖ్యానికి, సఖ్యానికి
ముఖ్య ప్రాణం శాంతికి,

స్వస్తి శ్రీ
రస్తు చిరం
జీవులైన
మానవులకు

కర్నాటిక్ రేడియోలో - అమ్మ పాడితే ఇహ తిరుగేముంది!!


ఈరోజు కర్నాటిక్ రేడియోలో హైలైట్ పాటలు....రెండు.....
*************************************
 I)

కార్తికేయ గాంగేయ గౌరితనయ
కరుణాలయ అరుళ్ తిరు

పాడినవారు: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి

(తోడి, ఆది , పాపనాశం శివన్)

అమ్మ పాడితే ఇహ తిరుగేముంది, అందులోనూ కార్తికేయులవారి మీద .......చాలా చాలా చాలా బావుంది

ఆహా,  కార్తికేయుల వారు అలా ఓ సారి దర్శనమిచ్చినట్టే అనిపించింది...

Update:

Just saw a video from youtube

Sung by Srmt Radha Viswanathan (Daughter of M S) and Aishwarya

Here it is


***************************************


II)

నగుమోము గలవాని
రాగం: మధ్యమావతి
తాళం: ఆది
ఖరహరప్రియ జన్య
త్యాగరాజ కృతి

(ఇది మంగళాచరణం కింద కూడా పాడతారనుకుంటా !)

పాడినవారు: అనంతలక్ష్మి సదాగోపన్

పల్లవి

నగుమోము గలవాని నా మనోహరుని జగమేలు శూరుని జానకీ వరుని

చరణం 1

దేవాధి  దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని

చరణం 2

సు-జ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని అజ్ఞాన తమమును అణచు భాస్కరుని

చరణం 3

నిర్మలాకారుని నిఖిలాఘ హరుని ధర్మాది మోహంబు (మోక్షంబు) దయచేయు ఘనుని

చరణం 4

బోధతో పలుమారు పూజించి నే-రాధించు శ్రీ త్యాగరాజ సన్నుతుని