Wednesday, May 16, 2012

పారమార్ధిక తత్త్వం - Late 1800's or early 1900's may be

పారమార్ధిక తత్త్వం
Source: An old paper cutting, can't see the print right...so I am assuming these are the details....

రచన: అజ్ఞాత
కాలం: ?? (1800's or early 1900's may be)


చేతులకందని రెండు శివశివ నీతులు చెప్పగ విందురటా
చేతులకందని రెండు శివశివ నీతులు చెప్పగ విందురటా

ఊరి పడమట నొక్క పాములేని పుట్ట, పుట్టలోనే యూరపిచ్చుకటా
పుట్టమీద నొక యూసర వెల్లియట, పట్టెడేసి వెన్న మెక్కునటా
చేతులకందని రెండు శివశివ నీతులు చెప్పగ విందురటా

మొదలు లేని మ్రానుకు ఆకులేని తీగకు ఐదుకొమ్మాలట
మొగ్గలేని పిందె తొడిమె లేని పండు నోరులేని బాల మ్రింగెనట
చేతులకందని రెండు శివశివ నీతులు చెప్పగ విందురటా

గుఱ్ఱము యెనుబోతు కూడ చరించగ నఱ్ఱెడ్ల మీద నడుచునట
జెఱ్ఱిపోతు జింక మఱ్ఱి మ్రానిమీద నమలక యా బయలు మేయునట
చేతులకందని రెండు శివశివ నీతులు చెప్పగ విందురటా

గురుతుగ గురువుల గురుకృప కలిగితే గురుతుగ శిష్యుడు దెల్పునటా
శివభక్తులైతే శివుని సన్నిధికి చేరుమని శివుడు చెప్పునటా
చేతులకందని రెండు శివశివ నీతులు చెప్పగ విందురటా

ఇందులో కొన్ని పదాలకు అర్థం ఇదిట:

రెండు నీతులు = సత్యం, ధర్మం
పుట్ట = మనసు
ఊరపిచ్చుక = బుద్ధి
ఊసరవెల్లి = చిత్తం
వెన్న = కర్మఫలం
ఐదు కొమ్మలు = పంచ భూతాలు

1 comment:

  1. అమోఘకృషి మీది. మంచె దిగవే ఓ పాంచాల చిలకా! - నా చిన్నప్పుడు ఆకాశ వఆణి - లో - వింజమూరి అనసూయ ద్వయం- సేకరణ - వీలైతే ఇవ్వగలరా?

    ReplyDelete