Thursday, May 17, 2012

ముగ్గురున్నారు - గుర్తుపట్టినవారికి సాహిత్యమూ, చరిత్ర బాగా తెలుసని

ఇక్కడ ముగ్గురున్నారు


1) ఈయనెవరో గుర్తుపట్టినవారికి సాహిత్యమూ, దాని చరిత్ర బాగా తెలుసని........




2) ఈయనెవరో గుర్తుపట్టినవారికి సాహిత్యమూ, దాని చరిత్ర బాగా తెలుసని........




3) ఈయనెవరో గుర్తుపట్టినవారికి ఆంధ్రదేశ చరిత్ర బాగా తెలుసని........




3 comments:

  1. శ్రీ వంశీ మోహన్ గారికి
    నమస్కారం!

    ఆంధ్ర మహాపురుషులను స్మరింపజేస్తున్న మీరు ఈ ప్రశ్నావళి రూపకల్పనకు నిజంగా ఎంతో అభినందనీయులు!

    నా సమాధానాలు కేవలం ఊహలు మాత్రమే. అయినా, సాహసించి వ్రాస్తున్నాను. తప్పయితే, మన్నించాలి ...

    1. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు
    2. శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారు
    3. శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహద్దరు గారు

    సర్వ శుభాకాంక్షలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    ReplyDelete
  2. శ్రీ ఏల్చూరి వారికి నమస్కారం

    మీ ఊహ నిజం. మొదటి రెండు సరిపోయినై. మూడవది చల్లపల్లి రాజావారు కాదు. అయితే ఆ సమాధానం చెప్పబోయేముందు మీకో మనవి.

    పెద్దవారు మీరు నన్ను "వంశీ" అని పిలవవచ్చు....

    పెద్దవారు ఎవరిదగ్గరినుంచైనా శ్రీ, గారు, నమస్కారం - ఇలాటివి వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది....శ్రీ / గారు తీసేసి, నమస్కారం స్థానంలో ఆశీర్వాదం ఇవ్వండి చాలు....

    విన్నవించేసుకోటం అయిపోయింది కాబట్టి, మూడవదాని సమాధానం - ఆ చిత్రం శ్రీ దుగ్గిరాల గోపాలకృష్నయ్య గారిది.....వారి "బారిష్టరు" పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంలో తీసిన చిత్రం అని ఉన్నది నా దగ్గర ఉన్న ప్రతిలో.

    నమస్కారాలతో
    భవదీయుడు
    మాగంటి వంశీ

    ReplyDelete
  3. నేను విశ్వనాథ, దుగ్గిరాల వార్లను గుర్తుపట్టాను. చిత్రమేమిటంటే నిన్ననే సాహిత్యం మీద చదివిన కొన్ని వ్యాసాల్లో మరొక 3 దిగ్గజాలను ఇక్కడ చూసాను - http://sarasabharati.wordpress.com/2012/05/03/సాహిత్య-మొర్మరాలు/ ఆ శీర్షిక నాకు నచ్చింది బాగా.

    ReplyDelete