Wednesday, May 16, 2012

పదిలక్షల భోజనాలు పంచిన.....

పదిలక్షల భోజనాలు పంచిన.....

నేను టి.వి. చూసేది తక్కువే.....ఎప్పుడైనా చూసినా - నేషనల్ జియోగ్రాఫిక్ - హిస్టరీ - డిస్కవరీ ఛానల్సు, 60 minutes కార్యక్రమం మటుకు చూస్తాను.....అలాటిది మొన్న నేషనల్ జియోగ్రాఫిక్ కి వెళ్ళబోతూ పొరపాటున సి.బి.ఎస్ లోకి వెళ్ళా.....

Ray Castellani గురించి ఒక క్లిప్పొస్తోంది.....ఈయన లాస్ ఏంజిల్స్ డవున్ టవునులో "హోం లెస్" వాళ్ళకి, బీదా బిక్కీలకి ఉచితంగా భోజనాలు సొంత డబ్బులతో తయారుచేసి పంచుతాడని తెలిసి ఆశ్చర్యపోయా....అందులోనూ ఈ మధ్యే ఒక మిలియన్ భోజనాలు, అనగా పదిలక్షల ఉచిత భోజనాలు పంచటం పూర్తయ్యిందని తెలిసి మరింత ఆశ్చర్యపోయా.....

ఈ రోజు ఆయన గురించి వెతికితే ఒక డాక్యుమెంటరీ కనపడ్డది ...

ఇక్కడ చూడండి....

ఇలాగే కేరళలో ఒకాయన  ఎవరో - "షెఫ్" అనుకుంటా - పొద్దున్నే పేద్ద గుండిగల్లో వంటలూ అవీ వండేసి ఉచితంగా అందరికీ పంచేస్తాడని అప్పుడెప్పుడో వార్తల్లో చదివిన గుర్తు...ఆయన పేరు గుర్తుకులేదు కానీ - ఇలాటోళ్ళకి ఓ పాదాభివందనం మటుకు చేసెయ్యగలను.....అలాటోళ్ళకి సాయం (ధనం కానీ, సేవ కానీ) చేసే వాళ్ళకి కూడా ఓ పాదాభివందనం చేసెయ్యగలను....

No comments:

Post a Comment