Friday, May 18, 2012

సవర రాజ్యమే స్వరాజ్యమయ్యిందా?

సవర రాజ్యమే స్వరాజ్యమయ్యిందా?

శ్రీ చింతాదీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
***********************************************   

బుజబుజరేకుల పిల్లుందా
బుజ్జారేకుల పిల్లుందా
స్వామీదండలు పిల్లుందా
సవరా రాజ్యం పిల్లుందా

బుజబుజరేకుల పిల్లుంది
బుజ్జారేకుల పిల్లుంది
స్వామీదండలు పిల్లుంది
సవరారాజ్యం పిల్లుంది

బుజబుజరేకుల కెన్నేళ్ళు
బుజ్జారేకుల కెన్నేళ్ళు
స్వామీదండల కెన్నేళ్ళు
సవరారాజ్యం ఎన్నేళ్ళు


బుజబుజరేకుల కేడాది
బుజ్జారేకుల కేడాది
స్వామీదండల కేడాది
సవరారాజ్యం ఏడాది


బుజబుజరేకుల చాలావు
బుజ్జారేకుల చాలావు
స్వామీదండలు చాలావు
సవరారాజ్యం చాలావు


బుజబుజరేకుల రెండేళ్ళు
బుజ్జారేకుల రెండేళ్ళు
స్వామీదండలు రెండేళ్ళు
సవరారాజ్యం రెండేళ్ళు


బుజబుజరేకుల చాలవు
బుజ్జారేకుల చాలవు
స్వామీదండలు చాలవు
సవరారాజ్యం చాలవు


బుజబుజరేకుల కేడేళ్ళు
బుజ్జారేకుల కేడేళ్ళు
స్వామీదందల కేడేళ్ళు
సవరారాజ్యం ఏడేళ్ళు


బుజబుజరేకుల చాలూ
బుజ్జారేకుల చాలూ
స్వామిదండల చాలూ
సవరారాజ్యం చాలు


బుజబుజరేకుల నగలెన్నీ
బుజ్జారేకుల నగలెన్నీ
స్వామీదండల నగలెన్నీ
సవరారాజ్యం నగలెన్నీ


బుజబుజరేకుల కంటె
బుజ్జారేకుల కంటె
స్వామీదందల కంటె
సవరారాజ్యం కంటె


బుజబుజరేకుల చాలవు
బుజ్జారెఖుల చాలవు
స్వామీదండల చాలవు
సవరారాజ్యం చాలవు


బుజబుజరేకుల ఒడ్డాణం
బుజ్జారేకుల ఒడ్డాణం
స్వామీదండల ఒడ్డాణం
సవరారాజ్యం ఒడ్డాణం

బుజబుజరేకుల చాలూ
బుజ్జారేకుల చాలూ
స్వామీదండల చాలూ
సవరారాజ్యం చాలూ



********************************************

ఇంకోరకం

బుజబుజరేకుల పిల్లుందా
బుజ్జా రేకుల పిల్లుందా
స్వామీ దండల పిల్లుందా
స్వరాజ్యమిచ్చిన పిల్లుందా

బుజ బుజ రేకుల పిల్లుందీ
బుజ్జా రేకుల పిల్లుందీ
స్వామీ దండల పిల్లుందీ
స్వరాజ్యమిచ్చిన పిల్లుందీ

పిల్ల పేరేంటి
మహలక్ష్మి

బుజబుజరేకుల కేం నగలు
బుజ్జా రేకుల కేం నగలు
స్వామీ దండల కేం నగలు
స్వరాజ్యమిచ్చిన వేం నగలు

బుజబుజ రేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు

బుజబుజ రేకుల జడగంటుంది
బుజ్జా రేకుల వడ్ఢాణముంది
స్వామీ దండల కాసులపేర్
స్వరాజ్యమిచ్చిన రత్నాలపేర్

బుజబుజరేకుల మాకొద్దు
బుజ్జా రేకుల మాకొద్దు
స్వామీ దండల మాకొద్దు
స్వరాజ్యమిచ్చిన మాకొద్దు

బుజబుజరేకుల కేం కావాలి
బుజ్జా రేకుల కేం కావాలి
స్వామీ దండల కేం కావాలి
స్వరాజ్యమిచ్చిన ఏం కావాలి

బుజబుజరేకుల విద్యా జ్ఞానం
విద్యకు తగిన వినయం శాంతం
సంగీత సాహిత్య జ్ఞానం
కలిగుందా మీ మహలక్ష్మి?

విద్యా జ్ఞానం కలిగుంది
వినయం శాంతం కలిగుంది
గానం గాత్రం కలిగుంది,
మా మహలక్ష్మి

మరి మీ పిల్లాడూ?
మీ పిల్లాడి పేరేంటి?
మాధవుడు
మరి మీ మాధవుడికి

బుజబుజరేకుల చదువుందా
బుజ్జా రేకుల గుణముందా
చదువూ, గుణమూ, సంపదలూ
కలిగున్నాడా, మాధవుడు?

బుజబుజరేకుల చదువుంది
బుజ్జా రేకుల గుణముంది
చదువూ, గుణమూ, సంపదలూ
కలిగున్నాడూ, మాధవుడు?

కట్నాలేంటి?

బుజ బుజ రేకుల కట్నాలొద్దు
బుజ్జా రేకుల కానుకలొద్దు
కట్నం కానుకలన్నిటికీ
సరి అవుతుందీ మహలక్ష్మి

ఆనంద మానంద మాయెనే
మా మహలక్ష్మి పెళ్ళి కూతురాయెనే
ఆనంద మానంద మాయెనే
మా మాధవుడు పెళ్ళి కొడుకాయెనే

***********************************


Audio can be heard HERE

No comments:

Post a Comment