Thursday, May 17, 2012

బాలగేయాలు

శ్రీ చింతా దీక్షితులు బాలగేయాలు (1948 ప్రతి నుండి)
***********************

అక్కలి కర్రా
మొక్కలి పీటా
కూర్చో కూర్చో
వదినా వదినా


***********************

కాముడోయి భీముడోయి
కందిపప్పు దేముడోయి
చెన్నపట్నం చెరుకుముక్కా
నీకోముక్కా నాకో ముక్కా

***********************

అట్లతద్దిపాట

కోటా బురుజూల మీద లాల్బావుటా
ముత్యాల్ మోపాల్ మీద లాల్బావుటా
నవుబత్ఖానాల మీద లాల్బావుటా
రాజు అంబారి మీద లాల్బావుటా


***********************

నెల్లికాయ దొంగ
నేరేడు దొంగ
పందిట్లో దొంగ
మా చిన్నారి దొంగ


***********************

వెన్నెల కుప్పలు గళ్ళు గళ్ళు
పచ్చి బియ్యం పేలాలు
పీట కిందా పిడికెడు బియ్యం
పిల్లల్లారా రండర్రోయి

No comments:

Post a Comment