Monday, May 7, 2012

ఈ హౌలా ప్రపంచం నుంచి ఉల్ఫా ప్రపంచంలోకి తీసుకెళితే అది లఫూట్ సినిమా!

అవెంజర్స్ చూసానయ్యా మొన్న

బావుంది....10 డాలర్లకు తగ్గ సరుకు లభించింది...

సరుకంటే ఒక్కోడికి ఒక్కోటి కావచ్చు....

ఒకడు కథ అంటాడు, ఒకడు యాక్షనంటాడు, ఒకడు స్క్రీన్ ప్లే అంటాడు, ఒకడు యాక్టర్లంటాడు, ఇంకోడు నీ బొంద, నీ శ్రాద్ధం అంటాడు...

నాకైతే అవెంజర్స్ సినిమా సినిమా సరుకుగా లభించింది....సినిమాకెళితే ఈ హౌలా ప్రపంచం నుంచి ఉల్ఫా ప్రపంచంలోకి తీసుకెళితే అది లఫూట్ సినిమా, పాతాళానికి తీసుకుపోతే ఉల్ఫా సినిమా, మేరు పర్వతానికి తీసుకెళితే జఫ్ఫా సినిమా, అలాక్కాకుండా త్రిశంకు లోకానికి తిసుకెళితే రాంగోపాల్ వర్మ సినిమా, యక్ష - కిన్నర - కింపురుష - కిరాత - గంధర్వ - నాగ లోకాలకు తీసుకుపోతే, ఆ సినిమా సరుకున్న సినిమా అని నా నమ్మకం....ఆ సినిమా సరుకు అవెంజర్స్ సినిమాలో ఉన్నది....

ఇంకా బోల్డు చెప్పొచ్చు ఈ సరుకుల మీద కానీ అసలు విషయం అది కాదు కాబట్టి ఇంతటితో ఆపి అసలు సంగతిలోకొస్తా......

బుర్రకు భేది మాత్రేసుకుని కూర్చో! లేకుంటే జారిపోతావ్....వేసుకున్నాక ఎలాగూ జారతావనుకో, అది వేరే సంగతి....

సరే కానీ, వీడికే ఇంతమంది హీరోలుంటే మనకున్న హీరోలతో ఎలాంటి సినిమా తియ్యొచ్చంటా?

హీరోలంటే ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో ఉన్న బీమార్, బేకార్, ముసలి, కుర్ర సరుకు అనుకునేవు - అందుకే నిన్ను భేది మాత్రేసుకోమన్నది....

హీరోలంటే - మన ఆంజనేయ సామి, నరసింహ సామి, కృష్ణ సామి, జాంబవంత సామి, పరశురామ సామి, బలరామ సామి, రామ సామి, గరుత్మంత సామి, కుమార సామి, వీరభద్ర సామి, కాళికమ్మోరు, కాలభైరవ సామి, అందరినీ మించి శివ సామి - ఇల్లా ఓ లిష్టు.....

సరే హీరోలున్నారు కాబట్టి ప్రతినాయకులుండాలిగా - అందుకు వీళ్ళనేసుకోవచ్చు - కార్తవీర్యార్జున సామి, తక్షక సామి, వాలి సామి, రావణ సామి, దుర్యోధన సామి , ఇంద్రజిత్ సామి, కంస సామి, జరాసంధ సామి, హిరణ్యకశిప సామి, కీచక సామి  - ఇల్లా ఓ లిష్టుంది....

వీళ్ళందరినీ కలిపి ఓ సినిమా తిస్తే దాని సిగదరగ, రికార్డులు - స్క్రీన్లు - సినిమా తెరలు బద్దలైపోవూ ?

బానే ఉందయ్యో ప్లాను - అయితే ఈళ్ళందరినీ ఇరికించటానికి ఓ కథ ఉండాలిగా - ఆ కథేమిటంటావ్?

ఆ ఏముంది?

అప్పుడెప్పుడో జమానాలో కార్తవీర్యార్జునుడు, రావణుడు, వాలి ఈ ముగ్గురూ కలిసి , జట్టు కట్టి ముఠా మేస్త్రీలా, కాకుంటే ముగ్గురు మాయల మరాఠీల్లా జనాలందరినీ - దేవతలు, మనుషులు, కోతులు, కుక్కలు మొదలైన తేడా లేకుండా మూకుమ్మడిగా కుక్కగొడుగులు నలిపినట్టు నలిపిపారేస్తూ ఉంటే, ఆంజనేయ సామి, ఓ లక్ష సంవత్సరాల దీర్ఘ నిద్రలోంచి లేచొచ్చిన పరశురామ సామి కలిసి ఈ ముగ్గురినీ కుళ్ళబొడిచి వదిలిపెడతారు.....కుళ్ళబొడిచాకా పరుశురామ సామి మళ్ళీ దీర్ఘ నిద్దర్లోకి వెళ్ళిపోతాడు.....

మొదటి భాగం ఇంతటితో సమాప్తం.....

రెండో భాగం రేప్పొద్దున్న.....

4 comments:

 1. పురాణాల కన్నా, జానపదాలు బాగా ఆడుతాయని నా నమ్మకం. కాళికాలయం, ఏడు సముద్రాలు, గండభేరుండ పక్షులు, యక్షులు, శరభ మృగాలు, మహా సర్పాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు, రాకాసి కోనలు వీటిని కూడా సినిమాల్లో పెట్టుకోవచ్చేమో ఆలోచించండి.

  ReplyDelete
  Replies
  1. నవీన్ - మీ సూచన బాగుంది....అయితే ఈ జానపదం అంతా అక్కడి నుంచి వచ్చిందేగా! ఉదాహరణకి గరుడుడే గండభేరుండం, ఆదిశేషుడే మహాసర్పం ఇలాగన్నమాట.... :)

   Delete
 2. Amish Patel రాసిన మెలుహా పుస్తకాలు చదువుతున్నారా?

  ReplyDelete
 3. కొత్తపాళి - ఆ ఆమిష్ పటేల్ ఎవరో నాకు తెలీదు మాష్టారు....మెలుహా నా, అదేదో "ఉలూకా" లాగా ఉన్నది...

  ReplyDelete