Wednesday, May 2, 2012

శ.డ.పీ.డా లకి అంత ఇదే ఉంటే మనుషులు - శవాలెందుకౌతార్రా పిచ్చోడా!

శవాల డబ్బులు పీక్కుతినే డాక్టర్లూ - ఇది చూడండిరా బుద్ధొస్తుందేమో

ఛా! ఆ శ.డ.పీ.డా లకి అంత ఇదే ఉంటే మనుషులు - శవాలెందుకౌతార్రా పిచ్చోడా....

57 యేళ్ళల్లో ఒక్కరోజు కూడా శలవు తీసుకోకుండా, డబ్బులు పీక్కోకుండా (ప్రస్తుతం రోజున 5 రూపాయలతో) సేవ చేస్తున్న ఈ మహానుభావుడికి సాష్టాంగ నమస్కారాలతో!

2 comments:

  1. ఇటువంటి మానవీయులు, మాననీయులు, మహనీయులు - తడుముకున్నా ఇంకాస్త పూజనీయమైన పదం తట్టటం లేదు - వైద్య వృత్తికి, మంచితనపు ఉనికికి గర్వకారణం. ఆయన వద్ద వైద్యం పొందినవారంతా ఆయన సంపాదనే, అభిమాన నిధులు. అవి డబ్బుకి కొనబడవు. వార్తకి మీకు థాంక్స్.

    ఈ ఆనందంలో నా వ్యక్తిగత ఊసొకటి.

    మా పెద్ద మావయ్య మంచి (ఇక్కడి పోస్ట్ ప్రమాణాల్లోనే సుమా) డాక్టర్. ఊరి జమీందారైనా సరైన సమయానికి వైద్యం అందక అపెండిసైటీస్ తో చనిపోయిన మా తాతగారి పరిస్థితి మరొకరికి రాకూడదని మావయ్యని డాక్టర్ ని చేసారని అమ్మ అనేవోరు. అలాగే పేదలకి, రోగులకి అండగా ఉన్నారాయన. ఆయనదీ 50+ ఏళ్ల ప్రాక్టీస్. అందుకే రాస్తున్నానిది. లెక్కలేనంతమంది అభిమానులు ఆయన చేతి మాత్రో/ఆపరేషనో కారణాన బతికిన వారు. మావయ్యని ఆరోగ్యారీత్యా చెన్నై నుంచి కలకత్తాకి తరలిస్తున్నపుడు - రాజమండ్రి స్టేషన్లో (మామూలుగా 5-10ని. కూడా ఆగని) కోరమాండల్ ని 45ని. పైన ఆపేసి, వెల్లువై పొంగిన ఆ అభిమానమే, కన్నీళ్ళతో కుంకుమలద్దిన వందలాది ఆ జనమే ఆయనకి ఊపిరిపోస్త. మా నాన్న గారి తర్వాత నాకు ఆదర్శం మా మావయ్యే! నాకే కాదు మరెందరికో అనీ తెలుసు మాకు.

    ReplyDelete
  2. ఆ కాలపు - మావయ్యలు, తాతయ్యలు అందరికీ ఆదర్శమేనండీ.....మనకా భాగ్యం లేదు....మా చినతాతయ్య కూడా అచ్చంగా ఇదే తంతు....ఎప్పుడైనా, ఎవరైనా డాట్రారు అనగానే నాకు ఆయనే కళ్ళ ముందు మెదులుతాడు.....మొన్న బ్లాగర్ల బొమ్మలేసినప్పుడు కూడా డాట్రారు ఇస్మాయిల్ బొమ్మ - చెప్పాలంటే మా చిన తాతయ్య బొమ్మే!.... :)

    ReplyDelete