Thursday, May 17, 2012

బాలగేయాలు - 9 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*************************************

జలక్రీడలు


గొల్లభామలమ్మా చక్కని
గోపిక స్త్రీలమ్మా
పదహారువేల స్త్రీలూ చక్కని
పడుచు కన్యలమ్మా
చామంతి వనమందూ భామలు
చల్వ తోడినారూ
మామిడివనమందూ భామలు
చల్వ తోడినారూ
మల్లెల వనమందూ భామలు
చల్వ తోడినారూ
ఊరికి ఉత్రాన భామలు
దారికొచ్చినారూ
టేకు ఆకుతోనూ భామలు
తెరలు కట్టినారూ
మోదుగాకుతోనూ భామలు
మొలలు చుట్టినారూ
బాదమాకుతోనూ భామలు
పమిటలు వేసినారూ
యమునానదిలోనూ భామలు
జలక్రీడలాడినారూ
చిలకంచు చీర యేదే అక్కా
అంసంచురైక యేదే
అంసంచు చీర యేదే అక్కా
చిలకల రైక యేదే
సుడిగాలి వచ్చెనేమో అక్కా
చుట్టుకుపోయెనేమో
వానగాలి వచ్చెనేమో అక్కా
వరదను పోయెనేమో
కొంటెకృష్ణుడు వచ్చెనేమో అక్కా
యెత్తుకుపోయెనేమో
చీరలు మాకీయరా కృష్ణ
నిలచి నీకి మ్రొక్కేమూ

గోవులను కాసేటి నేను
గోపాలుడిని కానా
పశువులను కాసేటి నేను
బాలుణ్ణి కానా


పాలువెన్న తాగే కృష్ణా
బలిసియుంటువి కదరా
మా వీధికి రారా కృష్ణా
మర్దన చేసేమూ


No comments:

Post a Comment