Thursday, May 17, 2012

బాలగేయాలు - 8 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*************************************

గొబ్బిపాట


సుబ్బీ గొబ్బెమ్మా మొగలిపువ్వంటి మొగుడినియ్యావే
సుబ్బీ గొబ్బెమ్మా  చామంతిపువ్వంటి చెల్లెలినియ్యవే
సుబ్బీ గొబ్బెమ్మా  తామరపువ్వంటి తమ్ముడినియ్యావే
సుబ్బీ గొబ్బెమ్మా గుమ్మడిపండంటి కూతురునియ్యవే
సుబ్బీ గొబ్బెమ్మా  పనసపండంటి పణతినియ్యావే
సుబ్బీ గొబ్బెమ్మా  మామిడిపువ్వంటి మగువనియ్యావే
సుబ్బీ గొబ్బెమ్మా  మల్లీపువ్వంటి మరిదినియ్యావే
సుబ్బీ గొబ్బెమ్మా  అరటిమువ్వంటి అల్లుణ్ణియ్యావే
సుబ్బీ గొబ్బెమ్మా  తాటీపండంటి తరుణినియ్యావే
ఇందరూ గూడియో ఇంటి కెళేరీ
అందరూ గూడియో ఆ వ్రతమూ చేసీరి

***********************************

No comments:

Post a Comment