Thursday, May 17, 2012

బాలగేయాలు - 7 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

చింతకాయ బొంతకాయ
చిగురు మామిడికాయ
కొల్లేటి వంకాయ
కొమ్మ నిమ్మపండు
వాలికిలి గుంటలో
వేలిగిలు మెయ్యగా
ఒక్కటే రాలగా
ఒంటి పువ్వు పుయ్యగా
తాటాకు చప్పుడే
కోట వెలుగు



*********************




గోడ మీది రూపాయి
నీ మొగుడు సీపాయి
తురకాళ్ళింట్లో ఉల్లిపువ్వు
మావాళ్ళింట్లో మల్లిపువ్వు




***********************



అప్ప్టి తిప్పటి తాండ్ర
అయ్యవారి తాండ్ర
అల్లీ బిల్లీ తాండ్ర
అయ్యవారి కొప్పులో తాచుపాము




*************************




ఓయి ఓయి నాయుడా
వంగపండు నాయుడా
గుడ్డి గుర్రమెక్కినావు
నక్కపాలు పితికినావు
చిక్కాన్ని పోసినావు
బేవని మండ బరిణింక తుప్ప
తుప్ప కాదురా తుమ్మెదమాను
మానుకాదురా మామిడి కొమ్మ
కొమ్మకాదురా కొడవలి గిద్ద
గిద్ద కాదురా గిద్దెడు చల్ల
చల్ల కాదురా బెల్లాపచ్చు




************************





గట్టుమీదా కోడి గవ్వల్లా కోడి
తొక్కితే తొంభై పిల్లల్లా కోడి
అడుక్కో బుడుక్కో సంబారు బుడ్డి




***************************





అట మాణిక్యమే పాటమాణిక్యం
నట్టింట అమ్మాయి రత్నమాణిక్యం
అమ్మాయిమామలు ఎటువంటివారు
చెవిచెవికి బారెడేసి కమలాలవారు
అడ్డపాగాల అంగీలవారు
ఆడంగ ముద్దు పాడంగ ముద్దు
నట్టింట అమ్మాయి నవ్వంగ ముద్దు




***************************




గోనుగోను గొలమంద
పాలుపోసి పండబెట్టు అల్లల్లలా





***********************



మా అప్ప సవరమూ మాకు తే
మా దేముడి గిన్నీ మాకు తే




*********************

No comments:

Post a Comment