Thursday, May 17, 2012

బాలగేయాలు - 6 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు బాలగేయాలు (1948 ప్రతి నుండి)

అచ్చక్క బుచ్చక్క తౌడు
తౌడులో రాగింజ దారం
దారం తీసుకుపోయి సాలెయ్యకిస్తే
సాలెయ్య బొంతా నేసిచ్చె
బొంత కట్టుకోని సంతకు బోతె
సంతలో మారాజు నప్పీర కుట్టె


****************************


అమ్మాడమ్మా గుమ్మాడీ
మార్చుకోంది పేర్చుకోండి
ఈనీని గుమ్మడీ
ఈ పిల్ల ఎవ్వరు



****************************



ఏమే ఓ చిట్టీ
ఏడవ్వే గుక్కెట్టి




***************************




అమ్మడి గుమ్మడి గూనీవారా
అమ్మా అమ్మా వీరెవరు?



**************************




చింతచెట్టు మీద చిగురు
వాలుగొమ్మ మీద వగరు
అన్నయ్య బట్టలకు తొగరు
ఒదినకు వచ్చినది పొగరు




***************************




(గాజులు తొడిగేటప్పుడు)


నిత్యగాజులసెట్టి నీలాలసెట్టి
పచ్చగాజులసెట్టి పగడాలసెట్టి
తొడుగోయి అమ్మాయికీ తేనెగాజుల్లు




*************************





గాగం గర్కచ్చి
ఊటో రమ్మన్న
ఏడుస్తే వెలక్కాయ
ఊరుకుంటే ఊరగాయ
తోటకు నీల్లొస్తే
ఎన్ని పండ్లు పెడతావు
ఏతాం తోడతాను





*****************************





చిట్టీ చిట్టీ మిరియాలు
చెట్తూ కింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిళ్ళు కట్టి
బొమ్మరింట్లో బిడ్డను గంటె
బిడ్డ తలకు చమురు లేదు
నా తలకు నూని లేదు


**********************

No comments:

Post a Comment