Thursday, May 17, 2012

బాలగేయాలు - 5 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*******************************************

ఆయినవారింటికీ పోయి వద్దాము
అరటిపళ్ళ అత్తాలు అడిగి వత్తాము


*******************************************

చందామామా చీరే కట్టి
సన్నా బియ్యం ఒళ్ళో పోసి
అమ్మా నేను చిన్నదాన్ని
అల్లుడు వస్తే అంపాబోకు
మమా వస్తే మళ్ళీ రమ్మను
చద్దీ కట్టా గుడ్డా లేదు
సాగనంపా పొద్దూ లేదు
ఇరుగు పొరుగు అక్కల్లారా
ఒకటే తుమ్ము ఆ....చ్


*******************************************

వడ్డాది కొండమీద వడ్లెండ బోసి
రా చిలుక పో చిలుక వడ్లు దంచుదాము
అల్లవారి కుక్క వచ్చి కూడు ముట్టంగ
కూడు ముట్టినచోట కలికమ్ము రాలు
మనము తిన్న కూడు మల్లెల్లు రాలు
రా చిలుక పో చిలుక వడ్లు దంచుదాము
పోదాము మన మింక ప్రొద్దు పోయింది


*******************************************

ఎద్దెద్దు పట్టెడ
ఎద్దుకాయ పట్టెడ
మోగన్న మోగదే
మాయదారి కిన్నెర


*******************************************


జోలలకు పాడంగ బాలలకు నిద్ర
నాగస్వరం పట్టంగ నాగులకు నిద్ర
రాజసం పండింది రాజు కొరిగింది
బూతులసి పండింది బూమికొరిగింది
చిలుకల్లు చెలరేగి మామభుజమెక్కు
మామ భుజమెక్కుతూనే మామనేమడుగు
పాలడుగు, గిన్నడుగు పాలావునడుగు
ఊరులేని పాటిమీద ఉయ్యాల గట్టి
ఊపమని మీమామ కుత్తరాల పంపు


*******************************************


గోపమ్మ నీళ్ళాడె
గొల్లోడు దడికట్టె
ఒడ్డోడు చెలమసేదె
పసలోడు పారదీసె
నిన్నొక్క దూడ చచ్చె
మొన్నొక్క దూడ చచ్చె
పోయే పున్నమనాడు
పొయిమీడ రొట్టాలు
బుడకోడి గిట్టాలు
గుజ్జుకోని తినవోయి
బుల్లి నాసరయ్య

*******************************************

ఒక్కంద
బికిరీలు
ముక్కు...మల్లె
నక్క నాంచి
ఐదు రెండ్ల
అస్తవాళి
ఇస్తివేళ్ళు

*******************************************

No comments:

Post a Comment