Thursday, May 17, 2012

బాలగేయాలు - 4 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు బాలగేయాలు (1948 ప్రతి నుండి)
***************************************


ఒక్కమ్మ నెత్తికి గోరంకి
చెప్పకు చెప్పకు చినపాపి
చెర్లో నక్కను పిలిపించి
చెపితే నీ ముక్కు చెక్కిస్తా
చింతలు మలవలు దాటిస్తా

***************************************


బోడి బోడి బొమ్మ
నీ మొగుడు మంచోడమ్మా
పట్ణం పోయేడమ్మా
పట్టెడ తెచ్చాడమ్మా
నీ మెడను కట్టాడమ్మా
కొత్తకోక కట్టింది నా కూతురు
కొన్నేడు సుబ్బయ్య నా అల్లుడు

***************************************


రాకురాకుల బండి రామల్ల బండి
వచ్చీదీ పోయీదీ ఓ రామచిలుక
నిప్పుమీద రానా
నీళ్ళ మీద రానా


***************************************

చింతాకు తోరణం కట్టుకొని
మామిడాకు మద్దెల కట్టుకొని
నిన్ను నే పెళ్ళాడుతాను
చిన్న గుంటోడా


***************************************


ఉసిరిక చెట్టుకింద
పసిడిపామున్నాది లేలే

***************************************


పులిగిరి అమ్మా పులిగిరో
పులిసిందంతా నీ పాలో

***************************************


ఓసోసి మద్దాలెంకె
నీ కొడుకు చందరయ్య
కోనేటి గట్టుమీద
కోలాట మెయ్యబోతే
దిగింది గడ్డపలుగు
కారింది రక్తగొల్లు
చూచింది ఎర్రపిల్ల
గోడుబిళ్ళ జాయిరే
జోరుబిళ్ళ జాయిరే

No comments:

Post a Comment