Wednesday, May 9, 2012

దాదాపు 3000 కీర్తనలు, కృతులు

దాదాపు 3000 కీర్తనలు, కృతులు

2000 అన్నమయ్య కీర్తనలు, 750 త్యాగరాజులవారి కృతులు, 150 రామదాసు కీర్తనలు మొన్న ఆదివారం వెబ్సైటులోకి ఎక్కించటం జరిగింది.....కావాలనుకున్నవారు చూసుకోవచ్చు....

గత ఐదారేళ్ళుగా నాకు పరిచయం ఉన్న గురుతుల్యులు శ్రీ శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి గారు - ఎన్నో సంవత్సరాలు, ఎంతో శ్రమకోర్చి ఒక అద్భుతమైన సంగీత భాండాగారాన్ని - కీర్తనలతో, కృతులతో మరెన్నో ఆణిముత్యాలతో తయారు చేసారు....

వాటిలో కొన్ని ఆణిముత్యాలు మరింత మందికి చేరువ కావాలన్న వారి కోరికతో, వారి ఆశీర్వాదం తీసుకుని ఇక్కడ  ప్రచురించటం జరిగింది.


(Note: ఎడమ వైపున ఉన్న కీర్తనలు - కృతులు లంకె నొక్కి ఆ 3000 కీర్తనలు, కృతులు చూడవచ్చు)

శ్రీ శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తిగారి వెబ్సైటును ఇక్కడ చూడవచ్చు....

భవదీయుడు
మాగంటి వంశీ

7 comments:

  1. తితిదే వారి పుణ్యమా అంటూ అన్నమాచార్య సాహిత్యం విరివిగానే లభిస్తున్నా త్యాగరాజ, రామదాసులవారి కీర్తనలు, కృతులు దొరకకుండా ఉన్నాయి. ఇది చూశాక మిక్కిలి సంతోషముగా ఉంది. మేధోచౌర్యం సమస్యలు లేకుంటే వీటిని నేను దించుకోవచ్చేమో తెలియజేయగలరు.

    ReplyDelete
  2. చక్కగా - అభ్యంతరం లేకుండా దించుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు.....అయితే ఒకవేళ ఇంటర్నెట్లో ఇంకెక్కడన్నా పెట్టదలిస్తే వారి పేరు, వెబ్సైటు లంకె ఇస్తే మంచిది / బాగుంటుంది...అంతకన్నా చెప్పేదేమీ లేదు...

    ReplyDelete
  3. మాగంటివారూ, చాలా చాలా మంచి పని చేసారు. మీ సత్కృషికి మనఃపూర్వకమైన అభినందనలు.

    ReplyDelete
  4. ref: http://www.maganti.org/chatuvulu/ajnata/ajnata12.html
    శివు డద్రిని శయనించుట....
    ఈ పద్యం చిలకమర్తివారిదండి

    ReplyDelete
  5. శ్రీ శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తిగారి భాండాగారాన్ని అందించినందుకు ఎన్నెన్నో నెనర్లు.

    ReplyDelete
  6. అద్భుతమే! ఇన్ని కీర్తనలు, కృతులు ఒక్కచోట జేర్చిన శిష్ట్లా వారికి, బహుజనావళికి చేరువ చేస్తున్న మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. "....అన్నమాచార్య సాహిత్యం విరివిగానే లభిస్తున్నా..."


    అన్నమాచార్య సాహిత్యం 60 శాతం పోయింది.

    ReplyDelete