Thursday, May 17, 2012

బాలగేయాలు - 3 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*********************************

తోడు పాయసం తోడు
అత్తల్ల బంతికే తోడు
మామల్ల బంతికే తోడు
ముద్దు మాణిక్యమా తోడు
ముత్యాల హారమా తోడు
జుర్రు పాయసం జుర్రు
జుర్రంగ నీ చెయ్యి చుర్రు


*********************************


గట్టు మీదా కోడి
గవ్వల్లా కోడి
తొక్కితే తొంభై పిల్లల్లా కోడి
పిల్లల్లా కోడి
అప్పల్లారా
డిప్పలు ముయ్యండి

*********************************


తోడు పాయసం తోడు
తోడితే నా చెయ్యి వేడి
వేడి పాయసం జుర్రు
జుర్రోయమ్మ జుర్రు
జుర్రితే నా నోరు చుర్రు

*********************************


ఒక్క ఓ చెలియా
రెండూ లోగిల్లూ
మూడూ ముచ్చిలక
నాలుగు నందన్న
అయిదుం చిటి  గొలుసు
ఆరుం బేటీలు
ఏడుమ్మ్ జవ్వాజు
ఎనమన ఎనమంద
తొంబా తోగుచ్చు
పదికి పట్టెడా


*********************************

చీలా బండి చిక్కుడుకాయ
పాళా బండి పల్లేరుకాయ


*********************************

దమ్మిడీ పోయింది
దేవుళ్ళాడుకో
కాలు విరిగిపోయింది
కంకణం కట్టుకో


*********************************
గూటీబిళ్ళ ఆట

కాళ్ళకండు రోలబండ
మూళ్ళ ముడ్డి
నాళ్ళ నరం
అయిదు రొంటి
ఆరు గిరిగిరి
ఏటికి ఒకడు


*********************************


సిర సిర బండి
సిరాయి బండి


*********************************


అరటిపండరటిపం డమ్మన్న ముద్ద
పేపే రామన్న పెండలం ముద్ద
ఆవు పేరేమి గోవు పేరేమి
చంద్రకాంతా నీ మొగుడు పేరేమి


*********************************


ఒదినా ఒదినా ఒల్లంకి పిట్ట
గదిలో పెట్ట గంజినీళ్ళు పొయ్య
నీ కొడుకు పుట్ట నా పేరెట్ట
మా అన్న కొట్ట నీవు పారిపోను
నే బతిమాల నువ్వు యేడవ నే నవ్వ




No comments:

Post a Comment