Thursday, May 17, 2012

బాలగేయాలు - 2 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు బాలగేయాలు (1948 ప్రతి నుండి)

*****************************

చదువుకుని అబ్బాయి వచ్చె కాబోలు
సరస్వతీ చప్పుడు సావిళ్ళలోను
ఆడుకుని అబ్బాయి వచ్చె కాబోలు
అందెళ్ళ చప్పుళ్ళు పందిళ్ళలోను
సానివీధుల వెంట అబ్బాయి వస్తే
సాను లడ్డూకొనిరి చందమామంచు
అబ్బాయి నెవ్వరే కొట్టిన్నవారు
కొట్టొ కొబ్బరి బెల్లం కొనిపెట్టినారు


*****************************

భుజ మూచమ్మ భుజమూచు
పూవులు తెత్తము భుజమూచు
సరులను గుత్తము భుజమూచు
స్వామికి నిత్తము భుజమూచు

*****************************


ఊగాడమ్మా ఊగాడు
ఊగే చిలుకా ఊగాడు
బంగరు బొమ్మా ఊగాడు
తంగెడు పువ్వా ఊగాడు
కులదీపంబా ఊగాడు
గుడిపావురమా ఊగాడు
చిన్నెల యమ్మా ఊగాడు
కన్నుల వెలుగా ఊగాడు
సొగసుల గువ్వా ఊగాడు
శుకమా పికమా ఊగాడు
చక్కని నెమలీ ఊగాడు
చక్కెర బొమ్మా ఊగాడు

*****************************


చేతటమ్మ చేతట్టు
శిరమున నేమి చేతట్టు
నీళ్ళ బిందెయే చేతట్టు
నిలుపును దాహము చేతట్టు


*****************************


దాదం దక్కచ్చి
అయ్యవా రక్కచ్చి
పూస్తే పువ్వొచ్చి
కాస్తే కాయొచ్చి
పండితే పండొచ్చి

*****************************


జోలపాట


జోలలకు జొన్నబువ్వ
నాకు వరిబువ్వ
ఏడ్చేటి అబ్బాయికి వెల్లావు పాలు
ఊళళ....హాయీ

హాయి వారమ్మాయి నీళ్ళకెళ్ళింది
పాలైన యివ్వవే ఓ కుక్కపిల్లా
ఊళళ....పిల్లీ

పిల్లెమ్మ వెళ్ళింది పల్లెల్లు దాటి
అబ్బాయి వెళ్ళాడు రచ్చల్లు దాటి
ఊళళ .......పిల్లీ

పిల్లి, రావే తల్లి పిల్లలమర్రీ
మర్రిక్రిందావాడు తొర్రినాగన్నా
తొర్రి నాగన్నకూ తోడెవ్వరమ్మా
గుఱ్ఱాలు కాసేటి గురవడే తోడు
ఊళళ ...హాయీ

*****************************

No comments:

Post a Comment