Friday, May 18, 2012

బాలగేయాలు -17 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతాదీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

***********************************************   

తరుణి తరుణి
తా పెళ్ళికొడుకు
సుబ్బక్క పెండ్లి
సూదిలో దారం



*************************




ఇసుకలో చెండు
దానిమ్మ పండు
పత్తిచేలో పగడం
మీకూ మాకూ జగడం





************************




కుతకుత గుజ్జన్న
వండీ వంకార
పారేసే బచ్చలి
తినీ కారం




*************************




మొండిచెయ్యి పేరక్క
మొగుడెక్కడి కెళ్ళేడు
కందులూ రెళ్ళాడు
కందులు తెచ్చాడు
పక్కలో పోశాడు
పరపరా నవిలేడు
కడుపునొప్పొచ్చింది

1 comment:

  1. మీ దగ్గర గురు పూజ మీద ్పాటలూ వున్నాయా

    ReplyDelete