Friday, May 18, 2012

బాలగేయాలు - 16 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతాదీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

***********************************************   
అన్నల బాడితివి తమ్ముల బాడితివి
నన్నేల బాడవె శ్రీలక్ష్మిదేవి
ఏమని పాడుదు వెర్రినాస్వామి
పూలబాణము తొడిగి పుష్పరథమెక్కి
పుణ్యుడు భూలోక మేలెనని పాడు



******************************





సిరి సిరి వానలు కురియంగా
సీతాదేవి పుట్టంగా
రావణాసురుని తల గొట్టంగ

(అరటిచెట్టు)




*****************************





కోడిగుడ్డు కాలె
కోష్టం కాలె
కోమటి కొండయ్య
తక్కెడ కాలె




**********************





దిబ్బగుంటలో తిరణాలంట
డబ్బుకి మానెడు శనగాలంట
ఆడపిల్లకు అద్దాలంట
మగపిల్లోడికి మొలత్రాడంట
చంకపిల్లకు టెంకాయంట
కడుపులోని పిల్లకు కరక్కాయంట



***********************



ఏటి అవతల యర్రజొన్న కర్ర
వచ్చేపొయ్యే పసియావు మేసె
పసియావు కడుపున చార్ల పెయ్య
చార్లపెయ్యకు పండ్లే లేవు
అల్లారల్లారే



*************************




చినచెంబుతో నీళ్ళు
సీకాయ ఉదకంబు
అల్లంబు బెల్లంబు అరటిపండు
తేనెతో మాగిన
తియ్యమామిడిపండు
అచ్చెన్నవరదాళ్ళు బుచ్చికెశవులు



No comments:

Post a Comment