Friday, May 18, 2012

బాలగేయాలు - 15 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతాదీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

***********************************************   



చెఱువుకట్ట దున్నించి ఉయ్యాలో
చెఱుకులే నాటించి ఉయ్యాలో
చెఱుకదిన్న పిప్పి ఉయ్యాలో
మంచెలే కాయించి ఉయ్యాలో
మంచెమీదా మంచె ఉయ్యాలో
మంచినీళ్ళా చెలమ ఉయ్యాలో
వెండిదే గుండమ్మ ఉయ్యాలో
పయిడిదే గుండమ్మ ఉయ్యాలో
కూర్చున్న పిట్టలకి ఉయ్యాలో
గుండెలకు తగిలేసే ఉయ్యాలో
లేచిపోవి పిట్టలకి ఉయ్యాలో
ఱెక్కలకె తగిలెసె ఉయ్యాలో
పండుకున్న పిట్టలకి ఉయ్యాలో
ప్రక్కలకి తగిలేసె ఉయ్యాలో
ఆపిట్ట ఈపిట్ట ఉయ్యాలో
కట్టబడ గట్టెనమ్మ ఉయ్యాలో
రెండు పిట్టలి గలిసి ఉయ్యాలో
ఇంటికి కొండుబోయె ఉయ్యాలో




*******************************************




డేగబోయె డేగబోయె
వెన్నెలాయిలో
డేగకడ మూగబోయె
వెన్నెలాయిలో
డేగలైతె ఏడవాలె
వెన్నెలాయిలో
తర్తూరు మానిమీద
వెన్నెలాయిలో
తర్తూరు రంగసామి
వెన్నెలాయిలో
డేగలేడ బడ్తాడమ్మ
వెన్నెలాయిలో




*************************




చిక్కుడు చిక్కుడు నరికిందీ
చిక్కుడు పందిలి పెట్టిందీ
చిక్కుళ్ళో దేవర
మనకెంత దూరం

2 comments:

  1. మీరు రచి౦చిన బాల గేయాలు బాగున్నాయి,

    http://bhamidipatibalatripurasundari.blogspot.in/

    ReplyDelete
  2. ఈ గేయాలు నేను రచించడమేమిటి బాలాత్రిపురసుందరి గారూ? - ఓ సారి పోష్టు చదవండి బాబోయి ... :)

    అవి ప్రముఖ సాహితీవేత్త - సాహితీ శిరోమణి , గురువుగారు శ్రీ చింతాదీక్షితులు గారు సేకరించిన పాటలు....1948 లోవి.....

    ReplyDelete