Friday, May 18, 2012

బాలగేయాలు - 14 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతాదీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)

***********************************************   



(అయిదు వ్రేళ్ళు)

విడియాల విత్తు
కొండెముల కొరివి
పుట్టు సన్యాసి
ఉంగరాల భోగి
పెండ్లికి పెద్ద



**********************



చిన్నన్న గుంట్లో
జింకలు మెయ్యా
పెద్దన్న గుంట్లో
పెయ్యలు మెయ్యా
కట్టిరారా పెద్దెంక
తోలుకురారా చిన్నెంక
పాలుపిండరా పాపయ్య
పొయి మీద పెట్టవే లింగమ్మ
దేవుకు తినవే ఎర్ర పిల్ల
తంటాలు చెప్పే బుడ్డపిల్ల




***********************





సందెకాడ ఎవరు మా
సందుకొచ్చినారు
గోపాలకృష్ణుడైతె
కోలాట మేసిపోరా
ఇల్లు మీద ఇల్లు
జాజి పూల పాంపు
పాంపు లోనె రాడా
పేరు తెల్ప్ పోడా




************************




కొట్టు కొట్టు పేలాపిండి
కొట్టలేను పేలాపిండి
విస్రు విసురు పేలాపిండి
విసర లేను పేలాపిండి
బొక్కు బొక్కు పేలాపిండి
బొక్క లేను పేలాపిండి




***********************



కొంగా కొంగా
నా గోళ్ళుచ్చుకు
నీ గోళ్ళియ్యి



*******************

No comments:

Post a Comment