Thursday, May 17, 2012

బాలగేయాలు - 13 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*************************************

చింతపూ చింతపూ రాలంగ
చిన్న కుప్పలు పెట్టంగ
దండు పోయె దండు పోయె నా మరది
దండలు తెచ్చె నా మరది



*****************************


కట్ట మీద పోయేదెవరంటే
గోగుల చెన్నయ్య కొడుకంటె
అరకట్టాకులు తెమ్మటె
చూచిన పేట పొమ్మంటె
చూచిన గజ్జెలు తెమ్మంటె
అక్కా కాడికి సొమ్మంటె
లక్కా పెట్టె తెమ్మంటె
చెల్లెలి వద్దకు పొమ్మంటె
చామంతి పువ్వులు తెమ్మంటె
వదినా వద్దకు పొమ్మంటె
వంగ పూలు తెమ్మంటె



****************************





సీతమ్మ నీ చిన్న ప్రాయమునాడు
రావోయి రత్నాల పేరంపినాడు
పేరుకు పెట్టెల్ల సొమ్మంపినాడు
సొమ్ములూ శోభిల్లు పసుపంపినాడు
పసుపుకూ పాలేటి నీళ్ళంపినాడు
నీళ్ళకు నిమ్మల వావంపినాడు
బావికి బంగారు మెట్లంపినాడు
మెట్లాకు మేదారి చెట్లంపినాడు
పూలూ గంధము తీయకురా
సాంబ్రాణి కడ్డీలు వేయకురా
తుంగభద్రా వద్ద దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దండ కడియాలు


***************************

No comments:

Post a Comment