Thursday, May 17, 2012

బాలగేయాలు -12 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*************************************

చిన్నయ్య పంచెలకు తొగరు
పిన్నికి పట్టింది పొగరు
జానమల్లె తీసుకొని జవురు, జవురు

(జానమల్లె - జానచెట్టు జువ్వ, జవురు = కొట్టు)******************************వదిన వదిన వంకాయ
వదిన మొగుడు టెంకాయ*****************************శనగలు జోడించె నెమలి
శనగ కెళ్ళెనయ్య నెమలి
గుప్పున పర్వతాలు నెమలి
గుప్పున పడదుమికె నెమలి
******************************
జీరు జీరు బండ కింద్
జింకపిల్లలాడుతున్నై
పట్టుకురా లచ్చమన్న
పచ్చరాళ్ళు కప్పుదాము
*************************
జల్లిళ్ళమ్మా జల్లిళ్ళు
డబ్బుకు రెండు జల్లీళ్ళి***************************
కొండమీద బీరపువ్వులూ
కొయ్యనా - వద్దా
మామ తెచ్చిన మల్లెపువ్వులు
ముడవనా వద్దా
అత్తగారి పట్టుచీర
కట్టనా వద్దా
మొగుడిచేత మొట్టికాయలూ
తిన్నా వద్దా

No comments:

Post a Comment