Thursday, May 17, 2012

బాలగేయాలు - 11 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*************************************

గట్టంట వెళ్ళేవు పొట్టి కోమటి
మాయవ్వ బాలింత పసుపిచ్చి వెళ్ళు
మాయన్న పూజారి పూలిచ్చి వెళ్ళు
మా వదిన పునిస్త్రీ పుస్తెలిచ్చి వెళ్ళు



*****************************



గట్టంట వెళ్ళేవు ఓ బాపనయ్య
ఆకులక్కడ పెట్టి కడవెత్తవయ్య
కడవెత్తినందుకు ఏమి లంచమ్ము
కర్ణపువ్వులు లంచమ్ము, కడవ లంచమ్ము




****************************




కాళ్ళకు మెట్టెల్ బుడిగీలో
మోకాళ్ళ చిప్పల్ బుడిగీలో
నడుముకు డాపు బుడిగీలో
చంకల్ రామచిలుక బుడిగీలో
పూలరైక బుడిగీలో
పండ్లకు దాశన బుడిగీలో
కండ్లకు కాటుక బుడిగీలో
నొషకి కుంకుమ బుడిగీలో



***************************




వాన వచ్చెనే
వాగు వచ్చెనే
చెఱువులోని చేపలాకు
చేటు వచ్చేనే



*************************




చింతపూత చింతపూత రాలంగ
చిలుకలు మేకలు మేయంగ




*************************




దండుపోయె దండుపోయె నామఱది
దండెల్లొచ్చె నా మఱది




***********************





కట్ట మీద పోయేదెవరమ్మ
రెడ్డిబిడ్డా పకీరమ్మ
తేనెగాజులు తొడిగింది
పెంకెర ముక్కర పెట్టింది
బావికి నీళ్ళకు పోయింది
బాలింతకట్లూ కట్టిందీ
మూలా మంచం వేసిందీ
ముద్దు కొడుకుని కనిందీ


**************************

No comments:

Post a Comment