Thursday, May 17, 2012

బాలగేయాలు -10 (1948 ప్రతి నుండి)

శ్రీ చింతా దీక్షితులు - బాలగేయాలు (1948 ప్రతి నుండి)
*************************************

విసురురాతి పదం


ఈ వూరి కుమ్మరి యిల్లు నే నెఱుగ
చెయ్యాల కుమ్మరి గజ్జల్ల కడవ
గజ్జల్ల కడవాకి ఏ బావి నీళ్ళు
పేరైన ఉసుకాల పెదబావి నీళ్ళు
బుడుగు బుడుగున ముంచి మోకాట పెట్టు
అక్కడిక్కడ చూచి కట్టపై చూచి
కట్టమీద పొయ్యేది ఎవరమ్మా మీరు

కట్టమీద పొయ్యేది గాజుల్లా సెట్టి
నేనొచ్చి తడవాయె కడవెత్తనయ్య

కడవపేరు ఏం పేరు, నీ పేరు ఏమి?
కడవ పేరు గంగమ్మ, నా పేరు సీత
అయిపోయె గౌరమ్మ అయిపోయెనమ్మ
అయిపయిన గిరిమీద ఆడిరావమ్మ
మా జొన్నలయిపోయె మేము పోతాము
మళ్ళొచ్చి నీపాట లెల్ల పాడేము   

No comments:

Post a Comment