Tuesday, April 24, 2012

పింగళి వారి వెబ్సైటు www.pingali.info ఈ రోజు నుండి శాశ్వతంగా మూసివేయడమైనది!!

పింగళి వారి వెబ్సైటు www.pingali.info అనివార్య కారణాల వల్ల ఈ రోజు నుండి శాశ్వతంగా మూసివేయడమైనది.

ప్రధాన కారణం ఏటా వెబ్సైటు హోస్టింగుకు చెల్లించవలసిన ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం వల్లైతే,  ఇంకొక కారణం వారి గురించి కొత్త మెటీరియల్ దొరకకపోవటం.

ఇక్కడో మాట చెప్పాలి -  వారి బంధువుల దగ్గరినుంచి కూడా సరైన సమాధానం రాకపోవడం వల్ల , వారి వద్దనున్న పింగళివారి సమాచారం పంచుకోవాలన్న ఆసక్తి లేకపోటం వల్ల- ఇలా తదితర కారణాల వల్ల నాలుగైదేళ్ళ నుంచి నేను నడుపుతున్న ఈ వెబ్సైటు మూసివెయ్యవలసి రావటం బాధాకరమే అయినా - నాలాటి వీరాభిమానులు, పింగళి వారంటే అభిమానం ఉన్నవారికి క్షోభ కలగకూడదన్న ఉద్దేశంతో ఆ మహానుభావుడికి సంబంధించిన సమాచారం,  పింగళివారి వెబ్సైటులో నేను పొందుపరచినది - ఈ రోజు నుంచి మాగంటి.ఆర్గ్ వెబ్సైటులోనే వీక్షించవచ్చు....

భవదీయుడు
మాగంటి వంశీ....

3 comments:

  1. చాన్నాళ్ల బట్టి ఊహిస్తున్న దుర్దినం వచ్చేసిందన్నమాట,కానివ్వండి.
    కన్నుపోయేంత కాటుక ఎవరైనా ఎన్నాళ్ళు భరించలరు?
    ఇక స్పందించని బంధువుల గురించి,గతంలో పండిత పుత్రులారా అంటూ ఒకటపా కట్టాను.వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు చేసినవారమవుతాము.

    ReplyDelete
  2. why dont you keep that info in a new blog named pingali

    ReplyDelete
  3. రాజేంద్ర దేవరా! అవునవును.....ఖచ్చితంగా అవును....

    వినోద్ - Did you read the post?. All the material is moved and is available at http://www.maganti.org/

    ReplyDelete