Wednesday, April 25, 2012

స్త్రీలు రవికలు, పైట ధరించుట ....ప్రారంభమయ్యింది ??????

స్త్రీలు రవికలు, పైట ధరించుట మన ఆంధ్రదేశపు ప్రాచీన రాజధానియగు ప్రతిష్ఠానపురము (పైఠాను) నుండి ప్రారంభమైనది. పైఠాను శబ్దము యొక్క వికృతే పైట. పైఠానీ నుండి బయలుదేరిన రవికే పైఠణీ రవిక

ఈ మాటలు చెప్పిందెవరో కాదండీ - గోల్కొండ పత్రికాధిపతులైన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు

1949 ఫిబ్రవరి 9వ తేదీన వెలువడిన ఆంధ్ర పత్రికలో ఉన్న వార్త

2 comments:

  1. స్త్రీలు రవిక పైటల గురించి ఇంతకన్నా ఎక్కువ డీటైల్స్ దొరుకుతాయనుకున్నాను. చాలా తక్కవ సమాచారం వుండటంతో డిసప్పాయింట్ అయ్యాను. అవునూ నాకో డౌటు మీది రాయలసీమా? కామెంట్ రాసేవాళ్లను ఇంతలా భయపెడుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ఈనాడు తిరుమల, శభరిమలలు డెవలెప్ అవడానికి కారణం అక్కడెలాంటి స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడమే. జనాలకు రూల్స్ ఎక్కువైతే భయం ఎక్కువవుతుంది. భయం ఎక్కువైతే ఎందుకొచ్చిన గొడవలేని రియాక్షన్ ఇవ్వకుండా వూరుకుంటారు. దాంతో ప్రయోజనం శూన్యం. కనుక జానతెలుగు గమనించగలరు.

    ReplyDelete
  2. కామెంటు డబ్బా మీదున్న హెచ్చరికలకీ , రాయలసీమకూ ఏమి సంబంధం? అడిగారు కాబట్టి చెబుతున్నా - మాది రాయలసీమ కాదు....కృష్ణా జిల్లా.....

    రియాక్షనిస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి? ఒకరి రియాక్షను కోసం రాయట్లా ఇవన్నీ.....ఈ నా బ్లాగు, [నా వెబ్సైటు కాదు, దాని సంగతి వేరు ] - ప్రయోజనం కోసం రాస్తున్నాననుకుంటే పిచ్చితనం.....

    ఎందుకొచ్చింది అని భయపడేవాడు అక్కడే శూన్యంలో ఉంటే మంచిది....ఈ బ్లాగు చదవటం అనవసరం, ఎందుకొచ్చింది అనుకోటం మరింత అనవసరం, ఇక్కడ మీలా కామెంటు రాయటం అత్యంత అనవసరం......

    తిరుమల రాయలసీమలోనే ఉన్నది.... :)

    ప్రొఫైలు లేకపోయినా నిర్దాక్షిణ్యాయుధం ఉపయోగించకుండా మీ ఈ కామెంటు ఇప్పటికి అట్టిపెడుతున్నా.....

    ReplyDelete