Thursday, April 19, 2012

చిత్రసేనుడు - గంధర్వ రాజు - ఘోష యాత్ర

చిత్రసేనుడు - గంధర్వ రాజు - ఘోష యాత్రలో దుర్యోధనాదులను బంధించిన మాయలమరాఠీ

2 comments:

  1. వంశీగారూ,
    ఘోషయాత్రలో దుర్యోధనుని బంధించిన గంధర్వరాజు పేరు చిత్రరధుడు. అతడు కథలో కొత్త పాత్ర కాదు.

    పాండవులు లక్కయింటి నుండి తప్పించుకొని అటవీమధ్యం చేరుకున్నారు. వారికి దాహం వేస్తే అర్జునుడు నీటికై సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళాడు. కాని ఆ సరస్సులో సపత్నీకంగా రాత్రివేళలో విహరిస్తున్న అంగారపర్ణుడనే ఇంద్రుని సేనానులలో ఒకడైన గంధర్వరాజు అర్జునుని నిరోధించటమే కాకుండా బాణాలు వేసి తరమాలని చూస్తాడు. అర్జునుడు దీటుగా స్పందించి అంగారపర్ణుని ఓడించి బంధిస్తాడు. అనంతరం అంగారపర్ణుడు అర్జునుని అబినందించి స్నేహం చేసుకుంటాడు. ధర్మరాజుతో ధౌమ్యుని పురోహితునిగా యెన్నుకోమని సలహాకూడా యిస్తాడు.

    యుధ్దంలో ఓడిపోయిన తాను తమ ఆచారం ప్రకారం పేరు మార్చుకోవాలనీ, అందుచేత అంగారపర్ణుడు అనే పేరును విసర్జించి చిత్రరధుడనే పేరు పెట్టుకుంటున్నాననీ చెబుతాడు. అన్నట్లు, యుద్ధంలో అర్జునుడు అంగారపర్ణుడి రధాన్ని ఆగ్నేయాస్త్రంతో బూడిద చేసాడు మరి. అందు చేత తన గంధర్వమాయతో చిత్రవిచెత్రములైన రధాలు కల్పించుకుంటానని అతడు చెబుతాడు.

    ఈ చిత్రరధునే ఇంద్రుడు దుర్యోధనుడికి బుద్ధి చెప్పమని పంపుతాడు. అతడి ముందు ఆట్టెసేపు ఆగలేక కర్ణుడు అక్షరాలా పారిపోయి రెండున్నర రోజుల తర్వార దుర్యోధనుడు బ్రతికాడా చచ్చాడా అని చూడబోతాడు.

    పేద్దసైన్యంతో చిత్రరధుని యెదుర్కొని కూడా పారిపోవలసి వచ్చిన కర్ణునికీ, యే సైన్యాదికాలూ లేకుండానే మరల చిత్రరధుని సులభంగా ఓడించిన అర్జునునికీ పరాక్రమంలో తారమమ్యం గమనించండి.

    ReplyDelete
  2. Correction. His name is chitrasena not chitraratha. Vamsi is right.

    ReplyDelete