Friday, April 20, 2012

మాద్రి - పాండు పత్ని- బొమ్మ

మాద్రి - పాండు పత్ని

ఫుల్ స్కేల్ ఆడవారి బొమ్మల్లో మొట్టమొదటిది కాబట్టి ఇది ఇట్లానే వచ్చిందనిన్నూ, ముక్కుదగ్గర హరహరమహాదేవ అయ్యిందనిన్నూ - ఆ ముక్కుకు మార్పులు చేస్తే మొత్తానికే మోసం వచ్చేట్టుంది అని అనిపించటంతో విరమించుకున్నానని తెలియచేసుకుంటూ......

మాద్రినే ఎందుకు గీయాలనిపించింది అని అడిగితే, నిన్న సోదరుడు శల్యుణ్ణి గీసినందుకు అని.... :)


2 comments:

  1. ప్రపంచం లోని ఏ వ్యక్తికైనా పోలిక ఉన్న పాత్ర భారతం లో కనపడుతుంది. అందులో లేని పాత్ర మరెక్కడా ఉండదు. నా చిన్నప్పడు ఈ అర్థం వచ్చేలా పెద్దలొకరు చెప్పగా విన్నాను. వారన్నది రూపురేఖల విషయం కాదు, పోకడల బట్టి అనైనా, మీ బొమ్మల వలన ప్రధాన పాత్రలు, ఔచిత్యం తెలుసుకుంటూ చదివేసిన గ్రంథాన్ని మరొక కోణంలో చూడగలుతున్నాను. తర్వాత ఈ బొమ్మ రావచ్చు అని చూడ్డం బావుంది. ఇప్పటికి నేను అనుకున్నవారు ఐదుగురు వచ్చిపడ్డారిక్కడ. విపులంగా ఏల్చూరి గారన్న మాటే నాదీను. అపుడపుడూ సంభవిస్తున్న వివరణలూ బావునై.

    బాలభారతం లో మాద్రి గా చంద్రకళ ని చూసాక, ఊహకి ఎప్పుడూ ఆమె రూపమే పడుతుంది. మీ బొమ్మ ముఖకట్టు వరకు అలానే ఉంది. తీరికలు తర్వాత తర్వాత బొమ్మల్లో తేలతాయి ఎలానూ. ( ఉలూచి వస్తుందా? సుధేష్ణ వచ్చేస్తుందా ముందుగా అని నా లెక్కలు నాకున్నాయి. ;)) మగవారి బొమ్మల్లో అశ్వస్థామ భలే ఉంది. సాళ్వుడు ఇంకాస్త అందగాడు అనుకునేదాన్ని.

    ReplyDelete
  2. అశ్వత్థామ నచ్చినందుకు సంతోషం....సాళ్వుడికి అంబను తిప్పి పంపించేసాక వచ్చిన దిగులుతో అలాగున్నాడులెండి....కొన్ని బొమ్మలు అనుకోడం తరువాయి బ్రహ్మాండంగా వస్తయ్.....కొన్ని శంకరిగిరి మాన్యాలే.....మరికొన్ని ఖాండవదహనంలో పాలుపంచుకోవాల్సినవి....ఇలాగుంటాయి బొమ్మల తిప్పలు....అయితే ఇన్నిరోజుల నుంచి గీకి పెడుతున్నా, ఒక కుదురు రాలా ఇంకా - దానికి వేగంగా గీయడానికి చేసే ప్రయత్నం ఒక కారణం.....వేగంగా ఎందుకు గీయాలి, నెమ్మదిగా ఎందుకు గీయలేవు అనడిగితే అది ఆ బొమ్మలు నిశ్చయించుకోవాలన్నది నా సమాధానం...

    ReplyDelete