Tuesday, April 17, 2012

ఈయన కృష్ణదేవరాయలు అని తెలుసా మీకు?

నాన్న డ్రాయింగు సెషన్లో ఉన్నప్పుడు పక్కనే కూర్చుని నేను కూడా ఓ పెన్ను పుచ్చుకుని పేపరు మీద గీసేసా....ఈయన కృష్ణదేవరాయలు అని తెలుసా మీకు?

పెద్దోళ్ళు ఎట్లా వేస్తే మేము కూడా అలాగే వేస్తామన్నమాట.........




నాన్నేమో నేను ఒక్క బొమ్మ వేసేలోపల ఈ కింద నాలుగు బొమ్మలేసేసాడు....ఆహ్! 





4 comments:

  1. వంశీ గారూ, ఈ క్రింది ఉత్తరం అమ్మాయికి అందించండి.
    । చిట్టితల్లీ వైష్ణవీ,
    । మనుషులంతా భయంకరంగానే ఉండాలని రూలేమీ లేదమ్మా.
    । కావాలంటే అద్దంలో ఒకసారి నిన్ను నువ్వు చూసుకో.
    । కొంచెం ఓపిగ్గా ప్రయత్నిస్తే మీ నాన్నారి కన్నా బాగానే గీయగలవు.
    । బోలెడు లక్షల ఆశీర్వాదాలతో
    । తాడిగడప శ్యామలరావు

    ReplyDelete
  2. శ్యామలీయంగారు - నమస్కారం

    ఆశీర్వాదాలు అందచేసినందుకు ధన్యవాదాలు....

    ReplyDelete
  3. రాయల వారి ప్రఖ్యాత కుచ్చు టోపీ తలపాగా గురించి మీ అమ్మాయికి చెప్పలేదా సార్

    ReplyDelete
  4. ఎన్‌టీఆర్ రాయలవారి వేషం చూపించి ఉండాల్సిందండీ ;)
    మిగితా విషయాలేమో కానీ, ఘటోత్కచుడి కొడుకు, జరాసంధుడి తండ్రి - ఊరికే బొమ్మలు గీసి పేర్రాసి వదిలేయకుండా వాళ్ళెవరో కూడా చెబుతున్నందుకు థాంక్స్.

    ReplyDelete