Saturday, April 28, 2012

కంకాళ రాక్షసులు ఇలాగుండొచ్చా?

కంకాళ రాక్షసులు , యక్షులు ఇలాగుండొచ్చా?

ఏమో?

చూసి చెప్పు.....

Stages of the painting

Total Time - 1 hr and15 mins

Canvas - 11 * 14

Colors: Bright Yellow, Black, Pthalo Green, Ultra Marine Blue, Golden, Orange, Brown and Titanium White






Friday, April 27, 2012

Per The Challenge of Sri J K Mohana Rao gaaru....!!

A Thinking Yaksha On The Cloud?

Yeah - May be! Could have turned little better, well - way better!!....But this is the first full scale person painting for me...So I am happy with the way it came out....

Came out per the Challenge of Sri J K Mohana Rao gaaru - A person who I adore and highly respect...

On 11 by 14 Canvas - Pthalo Green, Bright Yellow, Black, Bright Red, Pool Blue, Titanium White, Purple...




Wednesday, April 25, 2012

Acrylic Cow - What?

Acrylic Cow Turned Into This Abstract Cow....

Black, Pthalo Green, Brown, Crimson, White and Yellow on 11 by 14 Canvas

Get up from your chair, keeping the screen in your sight, well lit up that is, walk 20 feet backwards and then take a look....:)





స్త్రీలు రవికలు, పైట ధరించుట ....ప్రారంభమయ్యింది ??????

స్త్రీలు రవికలు, పైట ధరించుట మన ఆంధ్రదేశపు ప్రాచీన రాజధానియగు ప్రతిష్ఠానపురము (పైఠాను) నుండి ప్రారంభమైనది. పైఠాను శబ్దము యొక్క వికృతే పైట. పైఠానీ నుండి బయలుదేరిన రవికే పైఠణీ రవిక

ఈ మాటలు చెప్పిందెవరో కాదండీ - గోల్కొండ పత్రికాధిపతులైన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు

1949 ఫిబ్రవరి 9వ తేదీన వెలువడిన ఆంధ్ర పత్రికలో ఉన్న వార్త

ఆహా! ఓహో! అబ్బా! ధన్యం...ధన్యోస్మి....PART 2

ఆహా! ఓహో! అబ్బా! ధన్యం...ధన్యోస్మి....PART 2



అదే పేపరు - అదే పాత బొమ్మ - చిన్న మార్పులు - తేడా!!

 శ్రీ సుధామ గారు, మా డాట్రారు ఇస్మాయిల్ చేసిన సూచనల ఆధారంగా అదే పేపరు మీద బొమ్మ - అదే పాత బొమ్మ - చిన్న మార్పులు -  తేడా.

కొత్త సొబగులతో మాద్రి గారు


పాత మాద్రి గారిక్కడ 

 


Tuesday, April 24, 2012

విజయమోహన్ గారు మొన్న నందీశ్వరుల వారిని కళ్ళారా చూపించినప్పటినుంచి....

విజయమోహన్ గారు మొన్న నందీశ్వరుల వారిని కళ్ళారా చూపించినప్పటినుంచి మనసంతా, చెయ్యంతా ఆయనే మెదులుతున్నాడు........

అరగంట క్రితం ఈ నా ఆలస్యానికి కోపం వచ్చి ఓ పోటు పొడిచేప్పటికి ఇహ తట్టుకోలేక ఆయన్ని కాన్వసుకెక్కించా......

అలంకరణ చెయ్యాలి ఇంకా వారికి....

రేపు ముగిస్తా! నమో నందీశ్వరా.....

11 * 14 Canvas

For now - Black, Pthalo Green and Yellow


పింగళి వారి వెబ్సైటు www.pingali.info ఈ రోజు నుండి శాశ్వతంగా మూసివేయడమైనది!!

పింగళి వారి వెబ్సైటు www.pingali.info అనివార్య కారణాల వల్ల ఈ రోజు నుండి శాశ్వతంగా మూసివేయడమైనది.

ప్రధాన కారణం ఏటా వెబ్సైటు హోస్టింగుకు చెల్లించవలసిన ధనం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటం వల్లైతే,  ఇంకొక కారణం వారి గురించి కొత్త మెటీరియల్ దొరకకపోవటం.

ఇక్కడో మాట చెప్పాలి -  వారి బంధువుల దగ్గరినుంచి కూడా సరైన సమాధానం రాకపోవడం వల్ల , వారి వద్దనున్న పింగళివారి సమాచారం పంచుకోవాలన్న ఆసక్తి లేకపోటం వల్ల- ఇలా తదితర కారణాల వల్ల నాలుగైదేళ్ళ నుంచి నేను నడుపుతున్న ఈ వెబ్సైటు మూసివెయ్యవలసి రావటం బాధాకరమే అయినా - నాలాటి వీరాభిమానులు, పింగళి వారంటే అభిమానం ఉన్నవారికి క్షోభ కలగకూడదన్న ఉద్దేశంతో ఆ మహానుభావుడికి సంబంధించిన సమాచారం,  పింగళివారి వెబ్సైటులో నేను పొందుపరచినది - ఈ రోజు నుంచి మాగంటి.ఆర్గ్ వెబ్సైటులోనే వీక్షించవచ్చు....

భవదీయుడు
మాగంటి వంశీ....

ఆహా! ఓహో! అబ్బా! ధన్యం...ధన్యోస్మి....1949 భారతి!

ఆహా! ఓహో! అబ్బా! ధన్యం...ధన్యోస్మి....

1949, జనవరి 12న వెలువడిన ఆంధ్ర పత్రికలో భారతి రజతోత్సవ విశేషాలు, ఫోటోలు వేసారు.....అందులోవి ఈ ఫోటోలు....

ఒక్కసారి పై ఫొటో చూడండి.....

సాక్షాత్ సరస్వతీ మాత తన పుత్రులందరితో కలిసి వేంచేసిందా అని అనిపించట్లా...?


శ్రీ వేపా రామేశం గారి గురించి తెలుసుకోవాలంటే ఓ సారి ఈ లంకె నొక్కి చదవండి.....

Credits: Press Academy website




మగంగులకు తుమ్మెదల్లాటి కనురెప్పలు, వాలుజడలు !!

నిన్న ఆడంగుల్ని వేసాక , వాళ్ళకేసినట్టే మగంగులకు తుమ్మెదల్లాటి కనురెప్పలేద్దామని ప్రయోగం చేస్తే ఇట్లాగొచ్చిందయ్యా!...హరహర మహాదేవా!

Art indeed is fascinating.One day, one final day, I need to get a grip on it!




సరే రెప్పలు ఇలాగొచ్చినై, వాలుజడలేస్తే ఎట్టాగుంటారో అని ఇంకొన్ని వేస్తే అవి ఇలాగ దర్శనమిచ్చినై....

హరహర మహాదేవా!

Yes - One more time - Art indeed is fascinating. And One day, one final day, I need to get a grip on it!

ఇది దేనికి ప్రాక్టీసో అర్థమయ్యిందనుకుంటా - శిఖండి, బృహన్నల రూపాలకు

మట్టి బుర్రల్రా బాబూ మట్టి బుర్రలు .. :)




విరాటరాజు - పాండవులు అజ్ఞాతవాసం

విరాటరాజు - పాండవులు అజ్ఞాతవాసం చేసింది ఈయన కొలువులోనే


Monday, April 23, 2012

బుజ్జాయి - కార్టూన్ ఒకటి - 1958

బుజ్జాయి - కార్టూన్ ఒకటి - 1958



బాలప్రభ - రథోత్సవం - రచన: మధురవాణి

బాలప్రభ - రథోత్సవం
రచన: మధురవాణి 
1958 ఆంధ్రప్రభ పత్రిక నుండి

బ్లాగరు మధురవాణనుకున్నారా?
అనుకున్నా! నేననుకున్నా.....ఆవిడకు 54 ఏళ్ళైతే - ఆవిడే ఈవిడ... :)



****************

గణ గణ గణ మని గంటలు మ్రోగగ
ధణ ధణ ధణ మని ఢంకా మ్రోగగ
రథమాదారిని సాగిందీ
కడు శీఘ్రముగా కదిలిందీ
రంగుల రంగుల దీపాలెన్నో
హంగులు మీరగ వెలిగాయి
పిన్నల పెద్దల మొగాలపై, బల్
సంతోషాల్ చెలరేగాయి
పిన్న, పెద్దా భేదాల్ మాని,
అంతా, అక్కడ చేరారు

ఇంతటి యుత్సవ మెన్నడు లేదని
యెంతగనో కొనియాడారు
ప్రభువులు సైతం వేడుక చూడగ
పరివారముతో సాగారు
వింతల జూచుచు కొంత వడికి వా
రెందుకో, వొకచో నాగారు

చేరువలోనే పనిలో మునిగిన
చెంగని గని, ప్రభువన్నాడు

పండుగనాడును పాపం చెంగడు
పనితీరిక లేకున్నాడే?

అన విని, వేగమె అమాత్యుడంతట
చెంగనితో, నిటు జెప్పాడు

ప్రజలెల్లరు నటు దేవుని జూడగ
పరుగులు దీయుచు నున్నారే?
పని, యెప్పుడునూ వుండేదే గద
పోవక యిచటనె యున్నావేం?

అనగా చెంగడు మంత్రిగారితో
అన్నడెంతో వినయముగా

ఱెక్కాడనిచో డొక్కాడదు గద
దిక్కు, అదే గద మాకూ?
దేవుని జూడగ బోవుట యెట్టులు?
వారె వత్తురిటు బాబూ!

మంత్రిగారెంతో అబ్బురమొంది
మళ్ళీ యిటు లడిగారు

ప్రభువులు సైతం భక్తి ప్రపత్తుల,
దేవుని జూడగ బోవగను
నీ కొఱకై ఆ దేవుండే, యిటు
వచ్చు ననెదవే అది యెట్లు?

అని యడిగిన యా మంత్రిగారితో
అనెనా చెంగడు నమ్రతతో

అన్నిటి దెలిసిన మీరే యిట్టులు
అడిగితిరే యిది యేమీ
పేదల యిండ్లకు దేవుడు రాక
యింకెవ రొత్తురు స్వామీ?

చిత్రాంగద - చిత్రవాహనుని పుత్రిక - అర్జునుని పత్ని - బభ్రువాహనుని తల్లి

చిత్రాంగద - మణిపుర రాజ్యాధినేత చిత్రవాహనుని పుత్రిక - అర్జునుని పత్ని - బభ్రువాహనుని  తల్లి




కాళింది - సూర్యుని పుత్రిక - శ్రీకృష్ణుని భార్య - పెన్సిలు బొమ్మ

కాళింది - సూర్యుని పుత్రిక - శ్రీకృష్ణుని భార్య

కొంతమందికి "కాలింది" లాగా వినపడనూవచ్చు...కానీ నాకు ఈ పేరంటే ఎందుకో ఇష్టం - కాలు, అందియలు గుర్తుకొస్తయ్ 

మహాభారతంలో స్త్రీల పాత్రల గురించి డాక్టర్ ఎస్.శాంతమ్మ గారు రాసిన "మహాభారత మహిళాదర్శనం" పుస్తకంలో ఉన్న స్త్రీ పాత్రల పేర్లు అల్లుప్పుడెప్పుడో నాలుగైదేళ్ళ క్రితం ఇక్కడ పబ్లిష్ చేసాను.....

*To be specific published on Saturday, June 30, 2007.....

ఆయా మహిళల గురించి బోల్డన్ని వివరాలు సేకరించి రాసారు ఆవిడ. వీలుంటే ఆ పుస్తకం కొనుక్కుని చదువుకోండి....

Sunday, April 22, 2012

15 More Warriors Come Out During The Day!












ఫైర్ వస్తే ఏం చెయ్యాలో చెప్పిన ఫైర్ మన్ ఇట్టాగున్నాడంట!

మొన్న శుక్రోరం క్లాసు ఫీల్డు ట్రిప్పుంటే "సేఫ్టీవిల్" కెళ్ళారయ్యా.....

అక్కడ వీళ్ళకి - ఫైర్ వస్తే ఏం చెయ్యాలో చెప్పిన ఫైర్ మన్ ఇట్టాగున్నాడంట!

Saturday, April 21, 2012

ఘటోత్కచుడు - హిడింబ / భీమసేనుల పుత్రుడు

Ghatotkacha - Hidimba, Bhimasena's son. A legendary warrior.

In the movie world - Role played by one of the best actors the world has ever seen or will ever see - Sri SVR....

ఘటోత్కచుడు - హిడింబ / భీమసేనుల పుత్రుడు

అతిరథుడు - కర్ణుని పెంపుడు తండ్రి

అతిరథుడు - కర్ణుని పెంపుడు తండ్రి 
What a bummer - why is blogger posting some of the pics this way ?....
 
 
 

ఓఘవంతుడు - దుర్యోధనుని ముని మనుమడు

ఓఘవంతుడు - అగ్ని / సుదర్శనల మనుమడు - సుదర్శనుడి కొడుకు - దుర్యోధనుని ముని మనుమడు (ఈ దుర్యోధనుడు వేరు - భీష్మాచార్యుల వారు అనుశాసనిక పర్వంలో ధర్మజుడికి వివరించిన కథలో వస్తాడు)

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం - ఇల్వలుడు - వాతాపి

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం - ఇల్వలుడు - వాతాపి


వాతాపి


 ఇల్వలుడు

(Donot know why blogger uploads the pic  this way! Hmm...interesting....very interesting)

ఊహకు, ప్రాక్టీసు చేసినదానికి సహస్రం తేడా!

ఏదైనా  కొత్త ఫోజు రావడానికి. అలవాటు లేని గీతలు గియ్యడానికి నేను ప్రాక్టీసు చేసుకునే విధానం ఈ బొమ్మలో చూడొచ్చు....

ఇలా కొన్ని బొమ్మలు ఓ పిచ్చి కాయితం మీద ప్రాక్టీసు చేసుకుని ఆ తర్వాత ఊహలోకొచ్చిన వారిని అసలు పేపరెక్కించటమే....

ఊహకు, ప్రాక్టీసు చేసినదానికి సహస్రం తేడా ఉంటుంది అనుకోండి... :)

ద్యుమత్సేనుడు - సత్యవంతుని తండ్రి - సతీసావిత్రికి మామగారు

సాళ్వ భూపతి ద్యుమత్సేనుడు - సత్యవంతుని తండ్రి - సతీసావిత్రికి మామగారు

శ్రీ ఏల్చూరి వారు నిన్న చేసిన కామెంటు ఆధారంగా




Friday, April 20, 2012

మాద్రి - పాండు పత్ని- బొమ్మ

మాద్రి - పాండు పత్ని

ఫుల్ స్కేల్ ఆడవారి బొమ్మల్లో మొట్టమొదటిది కాబట్టి ఇది ఇట్లానే వచ్చిందనిన్నూ, ముక్కుదగ్గర హరహరమహాదేవ అయ్యిందనిన్నూ - ఆ ముక్కుకు మార్పులు చేస్తే మొత్తానికే మోసం వచ్చేట్టుంది అని అనిపించటంతో విరమించుకున్నానని తెలియచేసుకుంటూ......

మాద్రినే ఎందుకు గీయాలనిపించింది అని అడిగితే, నిన్న సోదరుడు శల్యుణ్ణి గీసినందుకు అని.... :)