Thursday, February 23, 2012

ఆ సౌందర్యవతిని - ఈ పాతికేళ్ళూ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తిని!!

1976లో పావలా అంటే యమహో నీ యమా యమా అన్నమాట.....

నెలవారీ నాన్నగారిచ్చే రూపాయి - పాకెట్ మనీ కోసం ఇరవై తొమ్మిది రోజులు వెయిట్ చేసీ చేసీ చేసీ, చేతిలో ఉన్న నాలుగు పావలాలు, వారానికొక్కటి చొప్పున చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ యమా యమాగా గడుపుతున్న కాలంలో "గురుపూజ" / "గురుపూజోత్సవ దినము" వచ్చెను....

దానికి ("గురుపూజ" / "గురుపూజోత్సవ దినము") - హైదరాబాదు అశోక్ నగరులోని లక్ష్మీ చిల్డ్రెన్స్ స్కూల్ - నాకు విద్యాబుద్ధులు నేర్పిన, నాకు బాగా ఇష్టమైన స్కూలు వారు పావలా అడిగితిరి....

దానకర్ణుని వలె ఉన్న నాలుగు "పావలా" కుండలాల్లో ఒకటి దానమిచ్చితిని....

అప్పుడు వారు ఈ రసీదు లాటి అపురూప సౌందర్యవతిని చేతిలో పెట్టితిరి.....

ఆ సౌందర్యవతిని  ఈ పాతికేళ్ళూ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తిని.....(పైసకు ఒక సంవత్సరము చొప్పున ఋణానుబంధము విపరీతముగా బలపడినది)...

ఇప్పుడు అవకాశము వచ్చెను కదాయని కెమెరాలో బంధించితిని....

ఇక్కడ వేస్తిని....

9 comments:

 1. అద్భుతం!
  మేము స్కూల్లో చదివేటపుడు మాత్రం ఒక పంచె కట్టుకున్న మేష్టారు టెబుల్ దగ్గర నిల్చుని ఉన్న అట్ట ముక్క లాంటిది ఇచ్చే వారు.దాని ధర 3 రూపాలయని గుర్తుంది

  ReplyDelete
 2. మీ సౌందర్యవతి వయస్సు, నా వయస్సు ఒక్కటే. నేను పుట్టిన రోజే అన్నమాట,

  ReplyDelete
 3. ఇంత కాలం ఎంత బద్రంగా దాచారు...

  ReplyDelete
 4. @సుభ, మధురవాణి - :)

  @అన్నోన్ - వయసు పలికింది, కానీ తప్పు పలికింది....పాతికేళ్ళు అని....అసలైతే 35 యేళ్ళు...నిన్న పోష్టేసే సమయానికి ఆనందం కొద్దిగా ఎక్కువపాళ్ళలోనే ఉన్నది....మీ వ్యాఖ్య ఇప్పటికి అట్టిపెడుతున్నాను.....కామెంటు బాక్సు మీద హెచ్చరిక చూసారుగా! అయినా మొదటిసారి కాబట్టి.... :)

  @సుజాత - మాష్టారు, అట్టముక్క, మూడు రూపాయలు సంగతి నాకేమాత్రం తెలియదు, గుర్తుకు లేదు.....ఎక్కడైనా దాచిపెట్టారేమో కాస్త చూసి దొరికితే పంచుకోండి.......

  @జ్యోతిర్మయి - నా దగ్గరన్నీ భద్రంగానే ఉంటాయి....మచ్చుకి - మీకు తెలియడం కోసం - ఎల్.కే.జీ నుంచి పదో తరగతి దాకా ఇచ్చిన ప్రతి ప్రోగ్రెస్ రిపోర్టు, చిన్నప్పుడు నేను తొడుక్కున్న స్వెట్టర్లు, స్కిట్స్ లో వేసినప్పడు ప్రాక్టీసు కోసం ఇచ్చిన స్క్రిప్టులు - ఇలాగన్నమాట !

  ReplyDelete
 5. గురుపూజదినోత్సవ మెమరీ. చక్కని సగర్వంగా చెప్పుకునే విషయాల్లో ఒకటి కదా! నిజమేనండి అప్పట్లో "చారణాకి చటాక్" కొనటానికి చాలా దొరికేవి. మా నాన్నగారు నెలకి రూ.10/- నా పాకెట్ మని ఇస్తే, నేను ఘోటక పిసినారిలా దాచి కిడ్డీ బ్యాంక్లో నొక్కి, అపుడపుడూ ఇలాంటి వాటికి, పేద విద్యార్థులకి పుస్తకాలకని మాత్రం విడదీసేదాన్ని. అలానే '77 దివిసీమ ఉప్పెన బాధితుల సహాయనిధి పోగేసిన వారిగా మాకు కొందరికి ఇలాంటి పత్రాలు ఇచ్చారు. నా సంచయిక బాంక్ అక్కౌంట్ లో అత్యధిక 750/- దాచిన ఖాతాదారుగా నాకు 1980 లో ఒక పొదుపరి సర్టిఫికేట్/ప్రశంసా పత్రం కూడా దక్కింది. ఆ 2 పోయాయి కానీ మీ పోస్ట్ వలన ఆ మాటలు తలుచుకున్నాను. ఇది ఖచ్చితంగా నా 'సొంత డబ్బా' కనుక తీసివేయబడినా ఫర్వాలేదు. :)

  ReplyDelete
 6. @ Usha gaaru - This post is intended for "DabbA" / "sonta DabbA" - so pls feel free to post any DabbA you want...It will stay here... 750 Rs - vow! That would have been a dream for many..You are lucky indeed....Since YOUR comment raised another memory, few minutes ago I have posted the "42 years Andhra Bank Kiddy Bank" pics...So for that post I would say - your words are the inspiration... :)

  ReplyDelete
 7. ఆహా! మీ పావలాకు ఇచ్చిన రసీదును చూస్తే ఎంత ముచ్చటేస్తోందో, అసలు "పావలా" అన్న పదాన్ని వింటే కూడా అలానే ఉంది. ఎక్కడ "పావలాలు" ఇంకెక్కడి "గురుపూజలు?"

  ReplyDelete