Monday, January 30, 2012

ఇదేంటి ఈ అమ్మాయి ఇలాగుంది?

Sunday, January 29, 2012

ఇలాక్కూడా చెయ్యొచ్చన్నమాట!!

ఇలాక్కూడా చెయ్యొచ్చన్నమాట

అదేంటి ? "ఇలాక్కూడా చెయ్యొచ్చన్న" మాటేమిటి? "ఇలాక్కూడా వెయ్యొచ్చన్న" మాట కదా పడాల్సింది అక్కడ !

అవును సుబ్బారావ్...అదే! అదే! అదే!

Acrylics on 11 by 14 canvas!! 


Inspiration : 
Bapu and Jamini Roy's paintings / 
Artist Anwar gaari suggestions

Saturday, January 28, 2012

ఆర్టిస్ట్ అన్వర్ గారి ప్రోత్సాహంతో........The three musketeers eh? - Awesome!

The three musketeers,eh?

Happy with this one! At one point I thought I would ruin it...But turned out good!

Acrylics on 11 by 14

Bright Yellow
Bright Red
Gold
Black
Burnt Umber and Titanium White

PS: BTW - this painting is inspired by Artist Anwar gaari words.....He said, after Sri KRP gaaru has fwd'd him couple of my paintings - "I love these two - I want to see more faces from you! Draw and Draw until you....." you know..:)

ఇహ పొద్దెరగట్లా....బాగున్నా, బాలేకపోయినా వేసి"పారేస్తూ" ఉండటమే, ఏదో ఓ రోజుకి అన్నీ "ఇరగ" ! :)

Tuesday, January 24, 2012

హ్మ్మ్......

ఇంకో రోజు  ఇంకో పెయింటింగు, ఇంకో మనిషి, ఇంకో పోష్టు!....హ్మ్మ్...

Acrylics on Canvas

11 By 14, 1 hr 10 mins.....Moderately happy....Nose / Lips should have, could have turned better!

Oh well...It's in for tomorrow ? may be? Yeah! మొత్తానికి సాధించానయ్యా!

మొత్తానికి సాధించానయ్యా!

మొన్నేసిన బొమ్మ చె.బు లొ పడేసి, కసి కొద్దీ నిన్న మళ్ళీ కూర్చున్నా....గంటన్నర పట్టింది కానీ దీని సిగ తరగ, బాగా వచ్చిందయ్యా!....శెభాషో!....

నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు సంబంధం లేదు, నాకు నచ్చింది కాబట్టి....

నచ్చకపోతే అటునించి అటే పోవచ్చు...

నచ్చితే ఓ కామెంటేసి పోవచ్చు....

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Canvas: 11 * 14
Colors: Crimson / Yellow / Black / Pthalo Green / White..

Just 5 colors? Yes - Just 5

Time: 1hr .40 mins


Sunday, January 22, 2012

హతవిధీ...అప్పటిదాకా ఇంతే గతి!

ఆయనెవరు ? ఆవిడెవరు? ఏమో నీకు తెలిస్తే చెప్పు!

ఈ మొహాలతో కుస్తీ చాలా కష్టంగా ఉన్నదయ్యా!

నిన్న ప్రకృతి అంత బ్రహ్మాండంగా వచ్చిందా? ఈవేళ మొహం వేస్తే ఇదీ కథా!

పెయింటింగు క్లాసులెప్పుడు మొదలవుతాయో ఏంటో? పోయి తొందరగా టెక్నిక్కులు నేర్చుకుందామంటే ఆ ఫాల్సం పార్క్స్ అండ్ రిక్రియేషన్ డిపార్టుమెంటు వాళ్ళు డబ్బులైతే పుచ్చుకున్నారు కానీ,  ఆ పోర్ట్రెయిట్ డ్రాయింగు క్లాసులు ఇంకో నెలకు కానీ మొదలవ్వవు అంటున్నారు..... హతవిధీ...అప్పటిదాకా ఇంతే గతి!

శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి డ్రాయింగ్స్ కొన్ని!!

శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి  డ్రాయింగ్స్

తనకు 13 - 15 ఏళ్ల వయసున్నప్పుడు, అనగా 1960ల్లో గీసిన వాటిల్లోంచి కొన్ని చిత్రాలు అందచేసిన శ్రీ కే.ఆర్.పి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలతో

ఎక్కడ చూడవచ్చా?

వెబ్సైటుకు వెళ్ళి, ఎడమ పక్కనున్న లంకెల్లో చిత్రలేఖనం లంకె నొక్కి చూడటమే....

భవదీయుడు

మాగంటి వంశీ మోహన్


PS: మీరు ఆర్టిష్టులైతే, లేదా మీకు తెలిసిన వారి డ్రాయింగులు మరింత మందికి చేరాలని, చేర్చాలనీ కోరిక ఉంటే - దయచేసి వివరాలు, ఆయా చిత్రాలు కాంటాక్ట్ @ మాగంటి.ఆర్గ్ ఈమెయిలుకు పంపించండి

Saturday, January 21, 2012

ఆ మందిరంలోకెళ్ళా.....నిజం మళ్ళీ నిరూపితమయ్యింది!!

ఈరోజు పెద్దరాణి గారు - అదేనండీ "అక్రిలిక్స్" రాణిగారు ఏడుస్తున్నారని ఆవిడని బుజ్జగించటానికి ఆ మందిరంలోకెళ్ళా.....

ఓ రెండు గంటలు గడిపాక ఇదొచ్చింది.....

ఫరవాలా!! పెయింటింగు టచ్చి పోలేదన్నమాట... పెన్సిల్ రాణిని కట్టుకొచ్చినా, పెద్దరాణి గారు పెద్దరాణీగారనే నిజం మళ్ళీ నిరూపితమయ్యింది....

Canvas used: 24 by 36 stretched
(BTW - Michaels has great deal on these ones! Got it for 7.99....Cool price)

Colors Used: Burnt Umber, Raw Sienna, Orange, Crimson, Christmas Green, Titanium White, Spring Green, Lime Green, Cobalt Blue and Black!

Time: 1 hr 52 mins

Friday, January 20, 2012

దానికి ఇంత ఇదైపోతావేమిటీ? నిన్ను తగలెయ్య!

ఈవేళ ఖాతాలో నాలుగు పడ్డాయి....

వీళ్లంతా ఎవరెవరో ఏమిటో? అసలు నువ్వెలా గీస్తున్నావో చెప్పు!

పెన్సిలుతో పేపరు మీద

యెహ్హా! ప్రొసీజరు చెప్పు ప్రొసీజరు

ఓ ! అదా....ఏముందీ - మా అమ్మాయి దాచిపెట్టుకున్న పెనసిల్లు ముక్కల్లోంచి ఓ రెండు పెన్సిలు ముక్కలు దొంగిలించా! పేపర్లు అప్పనంగా వచ్చాయ్....ఇహ నా సామిరంగా! పెన్సిలు చెక్కుకోనూ, పేపరు తియ్యనూ, గీతలు గియ్యనూ.....

అది సరేరా మగడా! ఎలా గీస్తున్నావ్?
  • ఊహించా? 
  • బొమ్మలు చూసా?
  • ట్రేసు కొట్టా? 
  • అవుట్లైనేసుకునా? 
ఎలా రా నాయనా?

ఓహో! అదడుగుతున్నావా? ఊహించీ, అవుట్లైనేసుకోని, ఓ షేపుకొచ్చాకా ముల్లు చెక్కని పెన్సిల్లు తీసుకుని గట్టిగా నొక్కుతూ వేసెయ్యటమే ఆ ఫైనల్ అవుట్ లైను మీద....ట్రేసు అనీ, బొమ్మలు చూసావా అనీ - గుండెలో బాకులు దించేసావు గదరా! దించేసావు గదరా! ఇంకా ఆ ఖర్మ కాలలా! కాలలా....లా...లా...

ఆపెయ్, ఆపెయ్....ఊరకే అన్నారా నాయనా! దానికి ఇంత ఇదైపోతావేమిటీ? నిన్ను తగలెయ్య!

అంతేనంటావా? సరే ఐతే పోయి మళ్ళీ ఏస్కొనొస్తా!

అది సరే కానీ - ఆ మూడో ఆయన ఎవరు ? నాగేశ్వరరావులా ఉన్నాడే?

కాదురా! విద్వాన్ విశ్వం గారని ఒహాయన ఉన్నారు....ఆయన బొమ్మ వేద్దామని కూర్చుంటే ఇలాగొచ్చింది.....హేమిటి చెబుతాం? అంతా మాయ!

మరి ఆ నాలుగో బొమ్మేంటి? అలాగుంది.....నిన్న చెంఘిజ్ బొమ్మ  చించేసావు, అదరగొట్టేసావు....ఇవ్వాళ్ళ కుదరలేదే?

ఏమో పెన్సిలును కనుక్కుని చెబుతా! ఉండు....

పైగా ఆ కత్తేంటి అలా భుజం మీద ఇటేపుకుంది?

ఏమో ఆయన అలాగే చేస్తాడేమో కత్తి యుద్ధం!

ఆ ఈకేంటి నెత్తి మీద...

మరి పీకలు కొయ్యాలిగా అందుకు ఈకలు పెట్టుకు తిరుగుతున్నాడు.....

ఈకలతో పీకలు కోస్తే మరి ఆ కత్తెందుకు ఇహ?

నీకోసమేమో !


ఎవరో ఈ గడ్డపాయన?ఎవరో ఈ గడ్డపాయన?

ఈయన గురించి ఓ టపాలో ప్రస్తావించా!!మా ఆఫ్రికన్ అమెరికన్ మిత్రుడు మైక్ జాన్సన్

ఈయన గురించి ఓ టపాలో ప్రస్తావించా... ఆ టపా ఇక్కడ చదవొచ్చు

ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారి కారికేచర్!

ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారి కారికేచర్!

కామేశ్వర రావుగారి బొమ్మ లా, వేలూరి వారి బొమ్మలా - గీసే ముందు వారు ఎలా ఉంటారో అన్న సంశయం లేకుండా, గాల్లో దీపం పెట్టినట్టు పేపరు మీద పెన్సిల్లు పెట్టకుండా ఉండటానికి ఈసారి, వెల్చేరు ఎలా ఉంటారన్న సందేహానికి సమాధానం కోసం గూగులమ్మను అడిగా.....

ఓ మూడు బొమ్మలు చూపించింది...

అందులో ఒకటి పట్టుకుని ఇలా గీసా....కొద్దిగా తన్నింది అనిపించింది కానీ, మన చెయ్యి ఇంకా తిరగలేదు కదా అనిన్నూ- కారికేచరు కదా అనిన్నూ సరిపెట్టేసుకున్నా!

మీకు నచ్చితే మీరే ఆనందోబ్రహ్మ!

మీకు నచ్చకపోతే మీరు గీసి చూపిచ్చండి నేర్చుకుంటా!....

ఎవరు ఒకసారి కామెంటు రాస్తే కామేశ్వరరావు గారు కూడా కొద్దిగా తడుముకుంటారో ఆయనే!!!

కామేశ్వర రావుగారి సూచన బుర్రలో  నేనిక్కడే ఉన్నానంటూ పెన్సిలుతో నరాల మీద తడుతూ ఉంటే, ఆ పెన్సిలు బుర్రలోంచి బయటకు తీసి చేతిలో పట్టుకున్నా....

నేను చదివే బ్లాగుల్లో నాకు నచ్చిన ఇంకో వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూంటే - ప్రత్యక్షమయ్యారు.....

ఎవరు ఆయన చెప్పు బాబూ....

ఎవరు ఒకసారి కామెంటు రాస్తే కామేశ్వరరావు గారు కూడా కొద్దిగా తడుముకుంటారో ఆయనే ఆ ప్రత్యక్షమైనాయన....

ఈయనతో కూడా నాకు "ముఖ పరిచయం" కానీ, "ముఖ" పరిచయం కానీ లేదు...కానీ ఆయన రాసే కామెంట్లు బాగా నచ్చుతాయి నాకు....

ఎవరు బాబూ, ఇక్కడ రక్తపోటు పెరిగిపోతోంది చెప్పు , చెప్పు త్వరగా!

చూస్తావుగా! తొందరెందుకు? చూస్తావు, ఆ తర్వాత తెలుసుకుంటావు....చూసావా? ఆయన ఇలా ఉంటారని నా ఊహ....ఊహ మాత్రమే!

ఆయన్ని చూసినవారు, ఆయన ఎవరో తెలిసినవారు - ఆయన ఇలా ఉండకపోతే చెప్పండి....ఏం?

ఇంతకీ ఎవరు నాయనా ఈయన - బాంచను, నీ పెన్సిలు కాళ్ళు మొక్కుతా చెప్పు....

అదీ అలా రా దారికి

ఆయనే - బ్లాగాడిస్తా రవి......బ్లాగాడిస్తా రవి.....బ్లాగాడిస్తా రవి.....

హమ్మయ్య , ఇప్పుడు కుదుటపడ్డా.....బాగుంది బాగుంది....

రవి గారూ, రవి గారూ - - మీరు ఇలా ఉండకపోతే ఓ సారి ఫోటో ఒకటి పంపించండి...మీరెలా ఉంటారో తెలుసుకోవాలి అని నిజంగానే ఉన్నది...అలాగే కొచ్చెన్లు ఏమన్నా ఉంటే, అంటే ఇలాగే ఎందుకు వెయ్యాలనిపించింది గట్రా గట్రా ఎవన్నా ఉంటే కూడా అడగండి.... :)

Note: Remember that this is caricature

Thursday, January 19, 2012

చెంఘిజ్ ఖాన్ అనేవాడు ఉంటే, బస్తీ మే సవాల్!

చెంఘిజ్ ఖాన్ అనేవాడు ఉంటే, బస్తీ మే సవాల్!

నా ప్రపంచంలో చెంఘిజ్ ఖాన్ ఇలాగుంటాడయ్యా!! బస్తీ మే సవాల్, పెన్సిల్ తో సవాల్.....

ఈ సవాల్ ఏంటి బాబూ ? ఎందుకు చెయ్యాలి? నువ్వు చేస్తావా? మమ్మల్ని చెయ్యమంటావా?

మళ్ళీ నేనే ఎప్పుడైనా ఇంతకన్నా బాగా గీసి చూపిస్తే నువ్వు నన్ను సవాల్ చెయ్యొచ్చు సుబ్బారావ్ ! - అదీ లెక్క


This is a absolute killer! To me - that is!

Woo hoo! - Can't believe that I did this....Thank you Vamsi! Thank you....

అంత లేదంటావా?

ఎవడు చరచకపోయినా సరే , నాకు నేనే , నన్ను నేనే చరుచుకుంటా!

వస్తా! వెళ్ళొస్తా! పెన్సిల్తో తిరిగొస్తా!

కోతిని గీయబోగా కొండముచ్చాయెన్!

కోతిని గీయబోగా కొండముచ్చాయెన్!

దక్షిణ ఆఫ్రికాగా పిలవబడే ఓ దేశంలో అలాన్ డోనాల్డ్ అని ఒక బవులర్ ఉండేవాడు గుర్తుందా? అరివీర భయంకర వేగంతో బంతులు విసిరి అంతులు చూస్తాడనీ, పైపెచ్చు తెల్ల మెరుపు (వైట్ లైట్నింగ్) అన్న బిరుదం కలవాడనీ డప్పులు దిగంతాల దాకా మోగిపోయేవి....అప్పుడెప్పుడో లెండి.....సరే ఆ కాండిడేటుని పెన్సిలుతో ఓ పోటు పోడుద్దామని కూర్చుంటే ఈయనెవరో వచ్చి పోటుని అడ్డుకున్నాడు....హేమిటో ఈ మాయ!

ఇవాళ్టికి సద్దుకుపోండేం?

భవదీయుడు
మాగంటి వంశీ

బాపు గారిని గీయబోగా?

బాపు గారిని గీయబోగా?

ఏదో చెయ్యబోతే అదేదో అయ్యిందని....బాపు గారికి క్షమాపణలతో....

అయినా ఇది కారికేచర్ కాబట్టి సరిపెట్టేసుకోటమే.....

PS: Keep in mind that this is a caricature.....

Wednesday, January 18, 2012

ఈమాట సంపాదకులు శ్రీ వేలూరి గారు - ఊహాజనిత కారికేచర్

పొద్దున్న కామేశ్వర రావు గారి ఊహాజనిత కారికేచర్ వేసానుగా....సాయంత్రం ఇంటికొచ్చాక ఈమాట సంపాదకులు శ్రీ వేలూరి వారు గుర్తుకొచ్చారు....ఈమాటలో నాకు నచ్చేవాటిలో, నేను చదివే వాటిలో ఆయన ఆర్టికల్స్కు పెద్దస్థానమే ఉన్నది....

ఆయనతో కూడా ముఖపరిచయం కానీ "ముఖ" పరిచయం కానీ లేదు....ఒకవేళ ఉంటే ఇలా ఉండి ఉండవచ్చునని ఊహ.....

నెత్తిమీద టోపీ పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ (ఇప్పుడు చలికాలమని టోపీ వేసాలెండి),  కళ్ళజోడు మటుకు ఉండి ఉండవచ్చునని అనుకుంటున్నాను.....

అడగకుండా, అనుమతి తీసుకోకుండా వారి చిత్రాన్ని గీసినందుకు పెద్దాయనకు క్షమాపణలతో!

మీలో ఎవరికన్నా ఆయనతో పరిచయం ఉండి ఉంటే , ఆయన ఇలాగుంటారేమో ఓ సారి చెప్పండి...లేకపోతే ఎలాగుంటారో చెప్పండి....

భవదీయుడు
మాగంటి వంశీ

PS: Remember that, this is a caricature

దొరికిపోయిన భైరవభట్ల కామేశ్వరరావు గారు!!

దొరికిపోయిన భైరవభట్ల కామేశ్వరరావు గారు

ఏమిటి బాబూ ఆ హెడ్డింగు?

ఆయన చిక్కడు దొరకడు టైపు....నీకు ఎలా దొరికారన్నది ఆశ్చర్యం!

ఎలా? ఎక్కడ? ఎందుమూలాన? వివరాలు కావాలి....చెప్పుకో

వినుకో! ఈమధ్య కొత్తగా నన్నావరించిన బేతాళ భూతం, పెనసిల్లు పిశాచ మహిమల వల్ల నేనేసిన బొమ్మల గురించి ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ఆయనో చిలిపి సలహా నామీద మెత్తగా పూలచెండులా విసిరారు ...

ఏమిటా సలహా?

"మీకు ముఖపరిచయం లేని బ్లాగర్లని, వాళ్ళ రాతలబట్టి, ఎలా ఉంటారో ఊహించి స్కెచ్చులు వేస్తే ఎలా ఉంటుందీ అని!"

ఆయన ఆలోచన నచ్చింది...అయితే నేను చదివే బ్లాగులు చాలా తక్కువ.....ఆ చదివే బ్లాగుల వారందరితో "ముఖపరిచయం" లేకపోయినా కొద్దిమందితో మాత్రం "ముఖ" పరిచయం ఉన్నది...అనగా ఫోటోల్లో చూడటం వల్ల అని అర్ధం.....

కామేశ్వరరావు గారితో నాకు "ముఖ" పరిచయమూ లేదు, "ముఖపరిచయమూ" లేదు....ఒక్క బ్లాగ్ పరిచయం తప్ప....సరే సలహా ఇచ్చారు కదాని, జమ్మిచెట్టు మీదనుంచి గాండీవం దించి ఆయన మీదకే ఓ పెన్సిలు ఎక్కుపెట్టా.....

ఇహ ఉపోద్ఘాతం అయ్యిందిగా.....ఆయన ఎలా దొరికిపోయారో ఈ కింద చూడండి.....

ఆయనిలా ఉండకపోతే ఎలాగుండొచ్చో తెలిసినవారో, ఆయనే స్వయంగానో చెప్పొచ్చు.....

PS: Remember that, this is a caricature!! 

కొంపేమన్నా మునిగిందా?

కొంపేమన్నా మునిగిందా?

అలా చూస్తున్నావేమిరా? ఆ మొహమేంటి? ఆ దీనత్వమేంటి?

అదీ కాదు ఇదీ కాదు, నా వాలకమే ఇంత అంటున్నావా? ఓ సరేలే ఐతే!


Tuesday, January 17, 2012

సూది ముక్కు సుందరు!

Here comes a sharp nose!

Could have done a little better....

But oh well! May be - Next time..... You know? It's all learning process!....

One drawing turns ugly, while the other surprises me! But let me tell you this - the more you draw, the more merrier you are!....

BTW - the post from this afternoon - Yeah that caricature one - was SOLD OUT!

Personally - Of all the recent ones, killer drawing was on Jan 15th - The "Sharpener" one.....It took just 6 mins and turned out awesome! As was the "pocahontas" and as was the old man earl !!....

So far I am loving what I am into! Lov'in it! Lov'in! And ONE more time, Lov'in it!

What about your website and stuff mister?

Ah! Good question!...That can wait and it will wait!.....


ఇహ ఇది కూడా మొదలయిందా నాయనా?

ఇహ ఇది కూడా మొదలయిందా నాయనా?

నీకి, నీ పెన్సిలుకీ పట్టపగ్గాల్లేకుండా ఉందిగా?

అవును బాబూ! అవును! నీ తలరాతలో ఇవన్నీ చూడాలని ఉంటే నేను మటుకు ఏం చేస్తా?

అసలైనా చిన్నప్పుడెప్పుడో చూపించాల్సిన కళ, ఇలా ఇప్పుడు చూపిస్తున్నా!   సంతోషించు.....


నాకు తెలిసిన ఒకే ఒక్క కొరియన్!

Here is the sole korean I know - Scott Wang!

Always with a striped jacket and a checks shirt...

And yes, with that Goatee too...

Well... I touched up his moustache....

For - he did not have any!

If he sees this, he would have a hearty laugh! That assured, I am happy... :)Monday, January 16, 2012

ఈవిడ, ఆవిడే!

ఈవిడ, ఆవిడే!

ఎవరావిడ?

ఆవిడే నాయానా! ఆవిడే! సరిగ్గా చూడు....

నోరు ఎందుకు వెళ్ళబెట్టాల్సి వచ్చిందో?

Why is he in a Jaw Drop mode?...

Sorry... I donot know....

And what is that on his neck and shoulders...Eww!

Not right buddy...Not right!

Did it ruin the pic?

Well - May be .....I guess it did!

One more lesson learned....Thanks


Sunday, January 15, 2012

షార్ప్నర్ నారాయుడి సేవ చేస్కోకపోతే, పెన్సిలు బొమ్మకు విలువెక్కడుంటాది? డిక్కీలో తొంగోదూ?

ఈవేళ మొద్దుబారిందని పెన్సిలు చెక్కా!

యమా షార్పుగా వచ్చింది బొమ్మ!

అందుకనీ, పెన్సిలు అప్పుడప్పుడూ చెక్కుతూ ఉండాలిరా అబ్బాయి...

కత్తి ఒంటి మీద పడగానే బిహేవియరు మారిపోలా? అదీ సంగతి...

అలా షార్ప్నర్ నారాయుడి సేవ చేస్కోకపోతే, పెన్సిలు బొమ్మకు విలువెక్కడుంటాది? డిక్కీలో తొంగోదూ?

ఎవరైతేనేమిలే - అలా దిష్టి కొట్టమాక.....

ఎవరు బాబూ ఈయన?

సెంటు కొట్టిన బిహారీ బాబుగారా?

"దొర" గారా?

ఎవరైతేనేమిలే - అలా దిష్టి కొట్టమాక.....

పైన కటకటాల రుద్రయ్య కండువా ఏసావా?

ఓ! నీక్కనపడిందా? మాంచి చూపుందయ్యా! 

Saturday, January 14, 2012

There he is!! - His TRIBE Song is a beauty!....I love it.....

There he is - a character from "pocahontas!"....

FYI - I put in MY shades into the drawing...so he is a bit different ......

My daughter absolutely loves the "Hiya, Hiya, Hiya" TRIBE song from this movie....

I like it too! Wonderful lyrics the song has....


Here are the lyrics....

Oh mother of the earth
Of whom we all are born
We call upon your daughter
The spirit of the corn
Oh let us send her blessings
And lest our field go dry

Send raindrops mighty spirits
That thunder in the sky
Oh spirit of the rain
The thunderbird above
We see you as you fly
With the rainbow that you love
Oh send the cooling rain
That our corn and beans may grow
And climb upto the sun
Like the arrow from your bow

Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya

Oh sun oh mighty sun
you drive away the night
As you warm us with your light
Oh shine upon our field
And send us corn of gold
To help our hungry people
Survive the winter's cold

Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya
Hi ya Hi ya Hi ya

Friday, January 13, 2012

బాగు చెయ్యాలా?....ఏంటి బాగుచేసేది?

మొహం ఫరవాలేదయ్యా! బాడీ అలా గొట్టాం లాగ వేసావేమిటీ? మార్చు, మార్చు....బొమ్మంతా పాడైపోయింది ఆ బాడీ మూలాన! ఏమిటి,  చెప్పింది అర్థమయ్యిందా?

ఆ...అయ్యింది... అర్థం అయ్యింది.....బాగు చెయ్యాలా?....ఏంటి బాగుచేసేది? ఒకసారి పెన్సిల్ , పేపర్ మీద నుంచి తీసేసాక నా మాట నేనే వినను....ఇహ పెన్సిలు, పేపరు ఏం వింటాయి? కాబట్టి పోయి పని జూస్కో!

అంతేనా?

అంతే!!

ఇంతకీ ఎవులీయన? లాయరా? డాకటేరా? ఎవులు?

నువ్వు జెప్పు!! నాకు తెలిస్తే  ......తెలిస్తే ఇక్కడెందుకు పెడతా?


మీ బట్టలు - అవీ , జాగ్రత్తగా చేత్తో పట్టుకుని తలకిందులుగా నిలబడండి!!

తిరగేస్తే అది ఇదయ్యిందిట.....

ఓ ప్రయోగం చేసా.....పూర్తిగా నా స్వంత తెలివితేటలు కావు కానీ, ప్రయత్నించా - చాలా కొద్దిగా సఫలమయ్యా....

ముందు, మొదటిది చూడండి

ఆ తర్వాత రెండోది చూడండి

ఆ తర్వాత మీ బట్టలు అవీ జాగ్రత్తగా చేత్తో పట్టుకుని తలకిందులుగా నిలబడండి....

నిలబడ్డారా?

ఇప్పుడు మొదటి బొమ్మ కాకుండా, రెండో బొమ్మను చూడండి....ఏం కనపడుతుందో తెలుసుకోండి....ఆనందో బ్రహ్మ!!
కొద్దిగా తెలివున్నవారికైతే తలకిందులుగా నిలబడకపోయినా "తిరగ"మూత కనపడుతుంది 

ఇది ఆ పెద్దాయనకు అంకితం!

పెద్దాయనకు, ఆ గోడవతల  ఏం కనపడిందో?

Inspiration: Earl, Our 86 year YOUNG neighbor....(who at heart is much younger than me!) And he's going for a complex heart surgery in few weeks.

This pencil drawing  - I dedicate to him....

Best Wishes Earl....

Vamsi


Thursday, January 12, 2012

ఈ అమాయకపు ప్రాణి ఎవరో తెలుసా?

Ah! Do you know who this is?

No clue?

Don't ask me - I have no clue either...

Sorry buddy!  :) :)


wait....what? what did you say?

Despite my lack of focus, this drawing sucked......Am I getting good or what?

err!

wait....what? what did you say?

Never mind....Oh well! Such is life... :)Wednesday, January 11, 2012

పిచ్చివాడి పెళ్ళి - గల్పిక

పిచ్చివాడి పెళ్ళి - గల్పిక

రచన: పన్యాల (రంగనాథ రావు?)
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1954 ఏప్రిల్
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Tuesday, January 10, 2012

You have to eat it or starve! Choice is yours.....

Ah great! What's missing in this?

Something is off!

Oh well - Now this is on your plate...You have to eat it or starve!

Choice is yours..Good Luck

వీడెవడో ఏమిటో? వీడి నెత్తి మీద ఉన్నది ఏమిటో ఏమిటో?

వీడెవడో ఏమిటో?

వీడి నెత్తి మీద ఉన్నది ఏమిటో ఏమిటో?

నెత్తి మీదున్నది తెలిసి పీడా విరగడైతే కింద ఉన్న ఈకల సంత ఏమిటో ఏమిటో? 

Monday, January 9, 2012

sexagenarian woman? hmm!! ......well dressed for her age ...eh?

Sexagenarian european woman? hmm!! 

Well dressed for her age..Eh? May be!!

శృంగేరీ భారతీ తీర్థ స్వామివారి అపురూప చిత్రం!!

శృంగేరీ భారతీ తీర్థ స్వామివారి అపురూప చిత్రం - పెద్దాయనతో

అందచేసిన మిత్రులు శ్రీరాంకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ...

ఫోటొల వద్దకెళ్లేముందు ఓ రెండు మాటలు విని పోండి

మా నాన్నగారికి కంచి పెద్దాయన చంద్రశేఖర స్వామివారంటే మహా ఇది....అంటే వీరాభిమాని...కానీ అదే పీఠం - జయేంద్ర వారంటే ఓ రకమైన అయిష్టం....అంటే ఈమధ్యా, ఆ మధ్యా జరిగిన సంఘటనల కారణంగా కాదు...నాకు ఊహ తెలిసినప్పటినుంచి మా నాన్న నోట్లో - ఈ జయేంద్రలో ఏదో తేడా ఉందిరా! చూడగానే ఆ "ఇది" రావట్లా....అని తరచుగా వింటూ వుండేవాడిని...ఇక సంఘటనలు జరిగాక ఏమయ్యింది అనేది మీరు అడగనక్ఖరలా, నేను చెప్పనక్ఖరలా....

అయితే కంచి చిన్నాయన విజయేంద్రవారిని చూస్తే మళ్ళీ ఆ పెద్దాయనను చూసినట్టే ఉందిరా అని అంటూ ఉండడం కూడా కద్దు...

అదలా ఉంచితే నాకు నల్లకుంట శంకరమఠంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా, అంటే ఇంటికి దగ్గరలో ఉండటం, ప్రతిదినం గుళ్ళోకి వెళ్ళిరావటం, అదే శంకర మఠానికి భారతీ తీర్థ స్వాముల వారు తరచుగా వస్తూండటంతో ఆయనంటేనూ, ఆయన స్పీచిలంటేనూ చాలా ఇష్టం ఏర్పడిపోయింది....

ఆయన్ని చూస్తే మానాన్నగారికి చంద్రశేఖరేంద్రుల పట్ల ఉన్నంత వీరాభిమానం కాకపోయినా, అక్కడికి దగ్గరలోనే నా మనఃస్థితి ఉందని చెప్పవచ్చు....

అదీ కప్తంగా సంగతి శిశువా!

పాహిమాం శంకరా! పాహిమాం!Sunday, January 8, 2012

పరమానందయ్య శిష్యులే నయం - మధురాంతకం రాజారాం!!

(పోష్టులోకొచ్చావు బానే ఉంది...ఆ తా.క లు కూడా చదివి ఫో! ఏం?)

పరమానందయ్య శిష్యులే నయం

రచన: మధురాంతకం రాజారాం
పత్రిక: ఆంధ్ర పత్రిక - సచిత్ర వారపత్రిక, మార్చ్ 1951
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

తా.క 1 : దీన్నే ఇంకొంచెం "పట్టులో", "రసపట్టులో" పడెయ్యాలంటేనూ  , రెండవ పేజీలో గుర్రాలు సొంత ఇంటికి దారిపట్టటం తీసేసో, సొంతఊరు లైన్లు తీసేసో, చిమ్మచీకట్లో కుర్రాళ్ళిద్దరూ తాగేసి వచ్చీ పెళ్ళాలని గుర్తుపట్టలేదనో చిన్న చిన్న కటింగులిచ్చి మన "శ్రీమన్మహా కాపీరాయ" రచయితలెవరన్నా రాసేసుకుంటే బోల్డు పేరొస్తుంది....  ఇహ తమరు ఆ దిశగా పయనించొచ్చు...


తా.క 2 : తెలియనివారికి గమనిక - కామెంటు చేసే భాగ్యం ఎత్తి వెయ్యడం జరిగింది....

ఎందుకా?

శకునపక్షుల గోల లేకుండా ఉండడానికిన్నూ, వాళ్ళని తిడుతూనూ, హెచ్చరిస్తూనూ నేను తిరుగు కామెంటు రాయకుండా ఉండేందుకునిన్నీ, నాకు వాడితో పరిచయం లేకపోయినా ఎవడెవడో పరమ చిరాగ్గా "నువ్వు" అనీ, "కేక" అని రాయకుండా ఉండేందుకునిన్నీ, మరికొంతమందికి అదలాగండీ, ఇదిలాగండీ, ఆ వివరాలు అవండీ, ఈ వివరాలు ఇవండీ అంటూ సమాధానం ఇచ్చే వెధవగోల లేకుండా ఉండేందుకుగానిన్నీ, ఆ విలువైన సమయం వెబ్సైటు మీద వెచ్చించుకోటానికినిన్నీ ......గట్రా, గట్రా, గట్రా - కారణాలకినిన్నీ.....అదీ సంగతన్నమాట!

కామెంటు మోడరేషన్ పెట్టుకోవచ్చుగా అని తమరి తళ తళలాడే, నిగనిగలాడే గుండులో మెరిసిన విద్యుల్లతకు సమాధానం ఇదీ - "ఆయన ఉన్నా మంగలి బాధ తప్పలేదా" అని, అసలు కామెంట్లు చూడ్డమే చిరాగ్గా ఉందిరా నాయనా అంటే మోడరేషన్ పేట్టుకో అంటావు? ఓ సారి ఇలా రా! రామకీర్తన తయారుగా ఉన్నది....

తెలిసినవారికి గమనిక - నా ఈమెయిలు తెలుసు కాబట్టి ఈమెయిలివ్వండి ... వీలుంటే అక్కడ మాట్లాడుకుందాం!

పాలెంలో బొమ్మలాట

పాలెంలో బొమ్మలాట

రచన: మా. గోఖలే
పత్రిక: ఆంధ్ర సచిత్ర వారపత్రిక, మార్చ్ 1951
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

లలిత పిన్ని - నండూరి రామ్మోహన రావు

లలిత పిన్ని

రచన: నండూరి రామ్మోహన రావు
పత్రిక: ఆంధ్ర సచిత్ర వారపత్రిక, మార్చ్ 1951
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

దిబ్బరాజుగారి అభ్యర్ధిత్వం - కొడవటిగంటి కుటుంబరావు!

దిబ్బరాజుగారి అభ్యర్ధిత్వం

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: తెలుగు స్వతంత్ర, ఫిబ్రవరి 1952
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Saturday, January 7, 2012

"అట్ట బొంగరం" ఎలా తయారు చెయ్యాలో ??

విజ్ఞానం - వికాసం

గుడిపూడి శ్రీహరిగారంటే చాలామందికి సినిమా రివ్యూలే గుర్తుకొస్తాయి. అంత ప్రసిద్ధులు ఆయన....అయితే ఆయన సినిమా రివ్యూలకన్నా ముందు, మాంచి జర్నలిష్టుగా పనిచేస్తూనూ, వారపత్రికల్లో విజ్ఞానం - వికాసం శీర్షిక నిర్వహిస్తూనూ ఉండేవారని ఈవేళ ప్రగతి సచిత్ర వారపత్రిక తిరగేస్తుంటే నా అనుభవానికి వచ్చింది.....

మచ్చుకి ఒక వికాస వ్యాసం -  "అట్ట బొంగరం" ఎలా తయారు చెయ్యాలో ఈ క్రింద వివరిస్తున్నారు చూడండి.....
ప్రగతి సచిత్ర వారపత్రిక, 1970 మార్చ్ 27 వ తారీకున వెలువడిన ప్రతి నుండి....

వీరి పరిచయ కార్యక్రమం, ఆకాశవాణి నుండి ప్రసారమయ్యింది - వెబ్సైటులో , ఆకాశవాణి కార్యక్రమాలు పేజీలో, పరిచయాలు సెక్షన్లో ఉన్నది....వినాలనుకున్నవారు అక్కడికి వెళ్ళిపోయి లంకెలు నొక్కెయ్యటమే.....ఆ ఆడియో అందించిన రంజని గారికి మరోసారి కృతజ్ఞతలతో

భవదీయుడు
మాగంటి వంశీ

ఇంకో పది చేర్చడమైనది!!

అపూర్వ సాహిత్యం సెక్షన్లో ఇంకో పది రచనలు చేర్చడమైనది.....

ఆసక్తి ఉన్నవారు చూసుకోవచ్చు....

ఏమిటెక్కించాను అని అడగొద్దు.....సమయం ఉన్నప్పుడు ఆ వివరాలు నేనే ఇస్తా! సమయం లేనప్పుడు ఎన్ని ఎక్కించానో చెబుతా!

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Friday, January 6, 2012

వెనకాల నిలబడి ఏం చూస్తున్నా?

He's the "CORNER GUY"....

Always Watching My Back... :)
Thursday, January 5, 2012

అవునా! భలే చెప్పావురా అబ్బాయ్ .....సంతోషం....!!

కొత్త సంవత్సరం వచ్చిందయ్యా....బాగుంది....మరి బ్లాగులోకొచ్చి నాలుగు రోజులయ్యింది.....ఎందుకో?

వెబ్సైటు పనుల్లో బిజీగా ఉన్నానయ్యా.....తవరు తాగి తందనాలాడో - ఊగిపోతోనో ఆంగ్ల సంవత్సరాది పండగ చేసుకుంటే, నా పండగ వెబ్సైటు మీద గడిచింది.....

సరే కానీ ఈ నాలుగు రోజుల్లో వెబ్సైటులోకెక్కించినవి ఏమిటో చెప్పు!

50 చిన్న పిల్లల కథలు - పిల్లల కథలు సాహిత్యము సెక్షన్లో

90 రచనలు - అపూర్వ సాహిత్యము సెక్షన్లో

ఇదేమిటీ ? ఇంతకు ముందు ఈ సెక్షను (అపూర్వ సాహిత్యము)  నీ వెబ్సైటులో చూడలేదే?

అవును - కొత్త సంవత్సరం కదాని కొత్త సెక్షను ప్రారంభించా! ఈ సెక్షన్లో చేర్చాల్సినవి ఇంకా బోలెడు ఉన్నాయి....ఒక్కడిని ఎంత పని చేసుకోవాలి? నీలాగా పనీ పాటా లేకుండా......

ఆపెయ్...ఆపెయ్....అక్కడికి ఆపెయ్ ....

అవునూ - ఇంతకీ ఇవన్నీ నువ్వు చదివావా?

భలే ప్రశ్నేసావురా అబ్బాయ్ - చదవకుండా అక్కడికెక్కడానికి , అనగా వెబ్సైటులోకెక్కడానికి నా రూల్స్ అనుమతించవురా! చక్కగా చదివా.....బుర్రలోకింకిపోయేలా అర్థం చేసుకున్నా.......

నువ్వేమో ఇట్లా అంటున్నావు - మరి అక్కడ  బ్లాగుల్లో ,  సైట్లల్లో నేను 10 కథలో / పుస్తకాలో చదివాను, 20 కథలో/పుస్తకాలో చదివాను.....కొన్నాను కానీ చదవలేదు......చదివాను కానీ నాకెక్కలేదు.....ఎక్కింది కానీ అర్థం కాలేదు....అర్థమయ్యింది కానీ అర్థమయ్యిందేమిటన్నది అర్థం కాలేదు.....అర్థమయ్యిందాన్ని పరిచయం చెయ్యాలంటే ఎలా ప్రొసీడవ్వాలో తెలీట్లేదు - ఇల్లాగ ఓ ఇదైపోతున్నారేమిటీ?  

ఏమో నువ్వే చెప్పు....అయినా అగ్నిలో ఆజ్యం పోస్తున్నావా? మసైపోతావు! అర్భకుడివని వదిలెస్తున్నా...ఫో!

సరే, ఇవి అంటే నువ్వు చదివి ఎక్కించినవి చిన్నవి, ఓ పదినిముషాలు కూర్చుంటే అయిపోతాయి.....మరి వాళ్ళనేదేమో పేద్ద పేద్ద పుస్తకాలనుకుంటాగా?

అవునురా! నేన్నీకు పుస్తకాలు చదవలేదు అని చెప్పానా?

లేదు....

మరి?

చదివావా? అయితే ఎన్ని చదివావు, ఏమిటి చదివావు - కథా కమామీషు వివరించి పుణ్యం కట్టుకో....

ఈ పోష్టు అందుకు తగదురా!

సరేలే దాటేస్తున్నావ్!

అవునా! మంచిది - నువ్వేమనుకున్నా నాకు "దాంతో" సమానమేరా అబ్బాయ్.....కానీ వచ్చే పోష్టుల్లో నీకు సమాధానం దక్కుతుంది....అప్పుడొచ్చి మళ్ళీ ప్రశ్నలెయ్యి...అందాకా.....

సరే! బాగుంది.....అలా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండు.....

అవునా! .భలే చెప్పావురా అబ్బాయ్ .....సంతోషం....

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్