Saturday, December 31, 2011

శ్రీశ్రీ గారి సాయంతో రా.నా లను కుమ్మేసిన ఆరుద్ర !!

అసలు సంగతికెళ్ళేముందు ఓ మాట  -

శ్రీ శ్రీ గారి ఈ క్రింది రచన బుర్రలో పదిలం చేసుకుని ఉన్నవారు ఉత్తమోత్తములు, చేసుకోవాలనుకున్నవారు మధ్యమోత్తములు, తెలిసి మర్చిపోయినవారు అధమోత్తములు, తెలియనివారు మూర్ఖనీచాధమోత్తములు అని ఒకాయన నాతో అంటూ ఉండేవాడు.....

కరకట్టు మాష్టారూ, ఎంతటి సత్యం చెప్పారు అని అనకుండా ఇంకేమన్నా అంటే ఎటుపోయి ఎటు వస్తుందో అని , ఆ చివరి ఉత్తముల మీద జాలి కలిగినా - "అవునని" నేనూ అంటుండేవాడిని.....

ఇప్పుడు అవకాశం దొరికింది కదాని ఆ చివరాఖరి "ఉత్తముల" కోసం పాఠం ఇస్తున్నా..చదువుకుని తరించండి....

**********************

Snows Of Yesteryear

-- Sri Sri

చక్రవర్తి అశోకుడెక్కడ?
జగద్గురు శంకరుండెక్కడ?
ఏవితల్లీ నిరుడు కురిసిన
హిమసమూహములు?

కాళిదాస మహా కవీంద్రుని
గాన వాహినిలో కరంగిన
ఉజ్జయిని నేడెక్కడమ్మా
ఉంది చూపించు

షాజహాన్ అంతఃపురంలో
షట్పదీ శింజానమెక్కడ
ఝాన్సిలక్ష్మీదేవి ఎక్కిన
సైంధవం నేడేది తల్లీ

రుద్రమాంబా భద్రకాళీ
రోచనోజ్జ్వల రోచులేవీ
ఖడ్గ తిక్కన కదనకాహళ
కహకహధ్వను లెక్కడమ్మా

ఎక్కడమ్మా కృష్ణరాయని
బాహుజాగ్రద్బాడబాగ్నులు
బాలచంద్రుని బ్రహ్మనాయని
ప్రాణవాయువు లేవితల్లీ

చక్రవర్తులు జగద్గురువులు
సత్కవీశులు సైన్యనాధులు
మానవతులగు మహారాజ్ఞులు
కాన రారేమీ?

పసిడిరెక్కలు విసిరికాలం
పారిపోయిన జాడలేవీ
ఏవితల్లీ నిరుడుకురిసిన
హిమ సమూహములు?

**********************

సరే అక్కడికాపేస్తే, ఇప్పుడు శ్రీ శ్రీ గారి అదే రచనను వాడుకుని, అనగా పేరడీ చేస్తూ  ఆరుద్ర గారు రాసిన  విరుపు చూడండి....... ఇది 1955 ఎన్నికల్లో ఓడిపోయి తప్పుకున్నవాళ్ళని ఎద్దేవా చేస్తూ రాసిందని సాహితీ రంగంలో మాట...

**********************

గతజల సేతు బంధనం

ప్రదేశపతి సంజీవుడెక్కడ?
కళా వేంకట రాయడెక్కడ?
ఏవి తల్లీ నిరుడు మండిన
ఎండు తాటాకుల్?

మంత్రివర్యుని బంధువర్గపు
యంత్రశాల తయారుచేసే
నూనెడబ్బా లేవి తల్లీ
నువ్వు చూపించు

అసెంబ్లీ దర్బారులో మన
ఆకు పచ్చని సీటులేవీ?
అల్లూరి సత్యం బొమ్మరింట్లో
ఆడి విడిచిన పిడతలేవీ?

దుర్గబాయీ భర్గురాణీ
భీకరానన స్పీకరేదీ?
లోకైక లీడరు రైతు రంగా
బూకరింపుల బాకులెక్కడ?

ఎక్కడమ్మా ఆంధ్ర కేసరి
జూలుజాగ్రద్ధూళీ దుమ్ములు
చంద్రమౌళీ సాంబమూర్తీ
కేంద్రి తిరుమల రాయలేరీ?

కరోడా కాకాని, అగ్గి
బరాటా మరుపిళ్ళ చిట్టి
కాలు గాలిన పిల్లు లిప్పుడు
కానరారేమీ?

ఎన్నికల నోరును తెరచికాలం
ఎందరిని కబళించెనమ్మా?
ఏడతల్లీ నిరుడుకురిసిన
వడగళ్ళ గడబిడలు?
**********************


భవదీయుడు
మాగంటి వంశీ మోహన్  


PS: 1952 February - తెలుగు స్వతంత్ర పత్రిక నుండి 

Friday, December 30, 2011

రేడియోలో లలిత సంగీతమంటే ? - బాలాంత్రపు రజనీకాంతరావు

రేడియోలో లలిత సంగీతమంటే ఇదీ అని....

లలిత సంగీతం - రేడియో
రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
పత్రిక: తెలుగు స్వతంత్ర (1954, అక్టోబరు)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

కుంటి - బిచ్చ - కుర్ర - పాండవులు !!

ఒకే ఒక్క పేజీలో కుంటి బిచ్చ కుర్రవాడు - కుర్ర బిచ్చ కుంటివాడు - బిచ్చ కుంటి కుర్రవాడు - కుర్ర కుంటి బిచ్చగాడు - బిచ్చ కుర్ర కుంటివాడు - ఇంతమందిని ఇరికించి వీడు ఒకడేనా, పంచ పాండవుల్లా ఐదుగురా అన్న అనుమానం పుట్టించిన మహానుభావుడికి సాష్టాంగ నమస్కారాలతో.....

 • కుంటి బిచ్చ కుర్రవాడు సాయంకాలం వీపుమీద సవారి చేస్తూ వచ్చాట్ట
 • కుర్ర బిచ్చ కుంటివాడు మొర్రో అని అరిచిన అరుపు కుర్చీలకు వినపడిందిట
 • బిచ్చ కుంటి కుర్రవాడి మొగంలో సాయంకాలపు జేగురు రంగు పిచికగూళ్ళు కడుతోందిట
 • కుర్ర కుంటి బిచ్చగాడి కడుపులోని రంపాలు కళ్ళలో భూకంపాలు పుట్టిస్తున్నాయిట
 • బిచ్చ కుర్ర కుంటివాడి పిడచకట్టిపోయిన నాలిక ఓడిపోయిన రాజ్యం తాలూకు వెలిసిపోయిన పతాకంలా వేలాడుతోందిట..

చివరాఖరికి కథ ఎక్కడ అంతమవుతుందో - చదివి మీరే తెలుసుకోండి

ఎక్కడ?

ఇక్కడ

ఐశ్వర్యం ఎదుట దారిద్ర్యం

రచన - శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర (1954, అక్టోబరు)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

 భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

బ్రోకరు శేఖరు చేత పెన్నమ్మించిన నిడదవోలు మాలతి గారు!

బ్రోకరు శేఖరు చేత పెన్నమ్మించిన నిడదవోలు మాలతి గారు

July 9th 1954 - తెలుగు స్వతంత్ర పత్రిక

క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

 

Thursday, December 29, 2011

రాద్ధాంతం చేసిన బ్లాగ్లోకపు పెద్దావిడ !!

రాద్ధాంతం

రచన: నిడదవోలు మాలతి
పత్రిక: తెలుగు స్వతంత్ర (1954, Aug)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు


ఓ మాట చెప్పాలనిపించి - ఈ గల్పిక, కొద్దిగా దోరగా మిగిలిపోయింది...అనగా అపరిపక్వంగా ఉన్నది....ఇది చదివాక రాద్ధాంతాలు అవీ చెయ్యడం ఆవిడకు రాదని, సుతిమెత్తనైన బుష్షు కోట్లు అవీ మాత్రమే వేసుకోగలరనీ - ఒక వేళ ఆవిడ వ్యక్తిత్వానికి దూరంగా రాధ్ధాంతం చేసినా సుతారంగానే ఎవరికీ హత్తుకోకుండా చెయ్యగలరనీ అర్ధమైపోయింది.... :)

బ్రోకరు శేఖరు , ఆవారా బుష్షు కోటూ అదే సంవత్సరంలో రాసినా అవి ఖచ్చితంగా ఓ మెట్టు పైనున్నాయి....తెలుగు స్వతంత్ర పత్రిక వారు మిగిలిన రెండూ (బ్రోకరు శేఖరు , ఆవారా బుష్షు కోటూ) బా రాసారు కాబట్టిన్నూ, మొహమాటం కొద్దిన్నూ - దీనికి కొద్దిగా మినహాయింపు ఇచ్చి పత్రికలో ప్రచురించారేమో అనిపించింది....

ఇంకో విశేషమేమంటే ఈ గల్పిక ప్రచురించిన పత్రికలోనే శ్రీ శ్రీ గారి వ్యాసం - గురజాడ వారి మీద - (It is a memorable piece. You MUST read that Sri Sri's essay. Period! ) ఉన్నది...

ఇప్పటి ఈ పెద్దావిడను అప్పటి శ్రీ శ్రీ గారి సరసన చేర్చిన తెలుగు స్వతంత్ర పత్రిక వారికి జేజేలతో! 

ఇంతకీ ఈ గల్పిక ఎక్కడ చదవాలి అని అడుగుతున్నారా?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: బ్రోకరు శేఖరు ఎక్కడ చదవచ్చా? ఇక్కడే - ఈ బ్లాగులోనే రేప్పొద్దున్న...

మన అదృష్టమో, ఆయన దురదృష్టమో!

ఏదో ఫరవాలేదు

రచన: శ్రీశ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర (1954, జూన్)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: Is "he" something? Or Is he "something"?.

Sri Sri amazes me, rather blows me away - one way or the other, each and every time I read one of his writings!....Though, some are as bad as his good ones - I say - He is a genius to the power of "x" and his mastery over the language is unparallelled.

ఆయన తెలుగు దేశాన పుట్టటం మన అదృష్టమో, ఆయన దురదృష్టమో తెలియదు కానీ, సరస్వతీ పుత్రుడికి నమోన్నమహలతో!

తెలంగాణ దుమారం !!

తెలంగాణ... - దుమారం లేపిన దాశరధిగారు

టైటిలేమిటా అనో, కథా కమామీషేమిటీ అనో వచ్చారా?

మీ జీవితం ధన్యం....

దాశరధి గారు కవి సమ్మేళణాల గురించి ఓ వ్యాసం రాస్తే - అందులో తెలంగాణాలో కవులెవరన్నా ఉంటే వారిలో ముగ్గురే ఘనాపాటీలనీ - వారే సర్వశ్రీ వానమామలై, సినారె, కాళోజీ గార్లనిన్నీ, వారినే నెత్తిమీద పెట్టుకున్నారనీన్నీ వెల్దండ వారు అగ్గిమీద గుగ్గిలం తీరుగా ప్రతివిమర్శ విసిరారు....

అది ఉత్త కువిమర్శేనని దాశరధి గారు దుమ్ము దులిపేసారు....

పూర్తి వ్యాక్యా(కా)ట్లాట ఎక్కడ చూడొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: ఇది చూసి అఫ్సర్ గారు అదేదో పుస్తకానికి (అధూరె అనుకుంటా- పుస్తకం పేరు !) రాసిన ఓ ముందు మాట గుర్తుకొచ్చింది....

అఫ్సర్ గారూ - ఇప్పుడే కాదండీ, మీ స్నేహితులు బాబా / బాబు ల మధ్య సాహిత్య - "అస్తిత్వ, రాజకీయ, అధిపత్య" పోరు లాటివి ఆంధ్ర సాహితీరంగంలో, తెలంగాణా - సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే భేదాలు లేకుండా -  ఎప్పటినుంచో ఉండటం సాహితీమాత చేసుకున్న అదృష్టం.... - ఈ పైనిద్దరూ దాశరధి గారి సమీపానికి కూడా రాలేరనుకోండి...అది వేరే సంగతి.... :) :)....

గుడ్డిలో మెల్ల ఏంటంటే నేనన్నదాన్ని సరైన అర్థంలో తీసుకునేవారిలో మీరొకరు....అదీ ఉపశమనం....స్వస్తి....

Wednesday, December 28, 2011

బుష్ కోటు వేసిన తెలుగు బ్లాగరు నిడదవోలు మాలతి గారు - 1954 !!

తెలుగు స్వతంత్ర పత్రికలు తిరగేస్తుంటే మన తెలుగు బ్లాగరైన (నేననుకుంటున్న!) నిడదవోలు మాలతి గారు రాసిన "బుష్ కోటు" గల్పిక కనపడింది....ఇక్కడ చూడొచ్చు....

1954, జూన్ 18 న వెలువడిన పత్రికలో ప్రచురితం....


తెలంగాణా కవులు, రచయితలు!!

తెలంగాణా కవులు, రచయితలు

రచన: దాశరథి
పత్రిక: తెలుగు స్వతంత్ర ( ఏప్రిల్ 1954 )
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Tuesday, December 27, 2011

కాలాతీత వ్యక్తులు - శ్రవ్య నాటిక - ఆల్ ఇండియా రేడియో ప్రసారితం! - 1954

కాలాతీత వ్యక్తులు - శ్రవ్య నాటిక - ఆల్ ఇండియా రేడియో ప్రసారితం


రచన: గోరా శాస్త్రి

పత్రిక: తెలుగు స్వతంత్ర (March 1954)

క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు


ఎక్కడ?


ఇక్కడ


భవదీయుడు

మాగంటి వంశీ మోహన్


PS: ఎప్పటిలానే , ఆడియో ఉంటే పంచుకోమని విన్నపం...

దానమ్మకడుపు బంగారంగానూ, స్వరం లేకపోతే యేం పోయింది?

దానమ్మకడుపు బంగారంగానూ, స్వరం లేకపోతే యేం పోయింది?

కర్ణాట సంగీత విద్వాంసుల్ని ఓ రకంగా చీల్చి చెండాడిన అంగర వేంకట కృష్ణారావు గారు

పత్రిక: తెలుగు స్వతంత్ర , మార్చ్ 1954
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS:
 • అంగర వారు ఇప్పటి విద్వాంసులని చూస్తే ఏమంటారో ఏమో? 
 • ఇదే ప్రతిలో ఏప్రిల్ తెలుగు స్వతంత్ర పత్రికలోని సంచికలో అంగర వారి వ్యాసానికి - రావు బాబు గారి సమాధాన వ్యాసం కూడా చూడవచ్చు

అట్టశూలములు - హోటళ్లు!!

నేటి హోటళ్లు - నాటి అట్టశూలములు

రచన: కోట వేంకటేశ్వర శాస్త్రి
పత్రిక: తెలుగు స్వతంత్ర (April 1954)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Monday, December 26, 2011

వ్రాతబల్ల వద్ద - కొడవటిగంటి కుటుంబరావు - ఆల్ ఇండియా రేడియో (1957)

వ్రాతబల్ల వద్ద - కొడవటిగంటి కుటుంబరావు - ఆల్ ఇండియా రేడియో (1957)

పత్రిక: తెలుగు స్వతంత్ర (ఫిబ్రవరి 1957)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: Pls do share the audio from your treasures. Shame on us - if we hear - I DON'T HAVE IT!

Friday, December 23, 2011

పుస్తకాల్లో విటమిన్లేమిట్రా పిచ్చోడా?

రకరకాల పుస్తకాలు, రకరకాల సంగతులు, రకరకాల పాఠకులు, రకరకాల రచయితలు....ఇంకా రకరకాల.........అదీ సంగతి అబ్బాయ్ :) ఆ పైన ఈ రకాల్లో ఇజాలు, జాన్రాలు, వాదాలు...గట్రా గట్రా.....

సరే ఈ గోలంతా ఎందుకు మొదలయ్యిందంటే ఈ రోజు పొద్దున్నే ఏడింటికి మీటింగుందని అల్పాహారం తీసుకోకుండా  మైనస్ మూడు డిగ్రీల సెంటిగ్రేడులో హీటరేసుకుని వెచ్చగా ఆఫీసుకు రాగానే ఆకలమ్మ వారు పందికొక్కు సైజులో ఉన్న మూషికాల్ని సదరు పొట్ట మీద, లోపలా పరిగెత్తించటంతో, మీటింగు అవ్వటమేమిటి - పక్కనున్న మెక్ డోనాల్డ్సుకు వెళ్ళటమేమిటి, ఫ్రూట్ ఎండ్ మేపుల్ ఓట్ మీల్ తీసుకోటమేమిటీ, వేడివేడిగా నోరు కాలిపోతున్నా పట్టించుకోకుండా గుటకాయస్వాహా చెయ్యటమేమిటీ - అన్నీ వాయువేగ మనోవేగాలతో, కన్నుమూసి కన్ను తెరిచేంతలో అయిపోయాయి......

సరే అయిపోయింది...ఇహ తిన్న స్పూను ఓట్ మీల్ డబ్బాలో పడేసి, దాన్ని చెత్తబుట్టలోకి పారదొబ్బుదామని చూస్తే చెత్తడబ్బా పూర్తిగా నిండిపోయుంది...సర్లే అని మూతేసి, ఆఫీసులో చెత్తడబ్బాలో పడేద్దాంలే అని వెంట తెచ్చా.....ఆఫీసుకు తిరిగు రావటమయ్యింది... చెత్తడబ్బాలో పారెయ్యటం అనే బృహత్తర కార్యక్రమం నిర్వర్తించబోతూండగా, డబ్బా మీద ఎరుపు రంగులో ఒక చిన్న కాయితం రెపరెప.....ఈ రెపరెప ఇప్పటిదాకా ఎందుకు కనపడలేదు అంటే - ఆకలమ్మ ఆవహించి ఉండటంతో అన్నమాట...

సరే ఈ రెపరెప సంగతేంటో చూద్దామని డబ్బా మీంచి ఊడపెరికి చూద్దును కదా, You are a winner అని దానికింద ఓ బొమ్మేసి ఆ వచ్చిన బహుమతి ఎలా తెచ్చుకోవాలి అని ఉన్న ఇన్స్ట్రక్షన్లు ఫాలో అయిపోయి అక్కడికి కథ సమాప్తం చేసా....

సరే ఈ పరిణామక్రమంలో ఆ డబ్బా మీద ఉన్న "న్యూట్రిషన్" సమాచారం నా దృష్టిని ఆకర్షించింది.....తినటమే కానీ, ఇలాటి దిక్కుమాలిన బలాబలాల సంగతి ఎప్పుడు చూసుకుంది లేదు....అంటే ఏది తింటే ఎంత బలం, ఏది తింటే ఎంత అబలం అన్న సంగతన్నమాట.....సరే - ఆ న్యూట్రిషన్ సమాచారాన్ని మన పుస్తకాలకు బదలాయిస్తే ఎలాగుంటుంది అని వచ్చిన ఓ చిలిపి ఊహ ఈ టపాకు ఊతం నాయనా....అదీ సంగతి......

ఉపోద్ఘాతం సమాప్తం....

సరాసరి పుస్తకల్లోకి దూకేస్తూ, జాన్రాల్లోకి విడగొట్టి న్యూట్రిషన్ సమాచారం లెక్కేసా - తేలిన లెక్క ఇదీ......నీ లెక్కలేవన్నా ఉంటే అల్లా ఓ కామెంటేసి చెప్పుకో.....


బాల సాహిత్యం సంగతికొస్తే -
 • విటమినులు = 20
 • మాంసకృత్తులు = 20
 • కొవ్వు పదార్ధం = 20
 • పిండి పదార్ధం = 10
 • ఉత్తేజం = 10
 • ఉల్లాసం = 10
 • ఆనందం = 10

ఆత్మకథలు, వీటికొస్తే
 • విటమినులు = 0
 • మాంసకృత్తులు = 0
 • కొవ్వు పదార్ధం = 5
 • పిండి పదార్ధం = 10
 • రక్తపోటు = 10
 • ఉత్తేజం = 5
 • ఉల్లాసం = 5
 • ఆందోళన = 35
 • ఆనందం = 5
 • ఏడుపు = 15
 • కోపం = 10

డిటెక్టివ్ సాహిత్యం - అనగా షాడో, గంగారాం, పెడ్రో వగైరా వగైరా
 • విటమినులు = 1
 • మాంసకృత్తులు = 2
 • కొవ్వు పదార్ధం = 2
 • పిండి పదార్ధం = 7
 • రక్తపోటు = 20
 • ఉత్తేజం = 10
 • ఉల్లాసం = 5
 • ఆందోళన = 25
 • ఆనందం = 10
 • కసి = 10
 • కోపం = 10

పురాణాలు, ఐతిహాసికాలు
 • విటమినులు = 10
 • మాంసకృత్తులు = 20
 • కొవ్వు పదార్ధం = 0
 • పిండి పదార్ధం = 10
 • రక్తపోటు = 0
 • ఉత్తేజం = 15
 • ఉల్లాసం = 20
 • ఆందోళన = 0
 • ఆనందం = 25
 • ఏడుపు = 0
 • కోపం = 0


చారిత్రకాలు
 • విటమినులు = 10
 • మాంసకృత్తులు = 10
 • కొవ్వు పదార్ధం = 0
 • పిండి పదార్ధం = 10
 • రక్తపోటు = 15
 • ఉత్తేజం = 10
 • ఉల్లాసం = 0
 • ఆందోళన = 10
 • ఆనందం = 15
 • ఏడుపు = 10
 • కోపం = 10


స్త్రీవాద సాహిత్యం

 • విటమినులు = 0
 • మాంసకృత్తులు = 0
 • కొవ్వు పదార్ధం = 0
 • పిండి పదార్ధం = 20
 • రక్తపోటు = 25
 • ఉత్తేజం = 0
 • ఉల్లాసం = 0
 • ఆందోళన = 25
 • ఆనందం = 0
 • ఏడుపు = 29
 • కోపం = 1 


ఆధునిక కవితా సాహిత్యం

 • విటమినులు = 0
 • మాంసకృత్తులు = 0
 • కొవ్వు పదార్ధం = 10
 • పిండి పదార్ధం = 10
 • రక్తపోటు = 40
 • ఉత్తేజం = 0
 • ఉల్లాసం = 0
 • ఆందోళన = 20
 • ఆనందం = 0
 • ఏడుపు = 0
 • కోపం = 20 


ప్రేమ సాహిత్యం

 • విటమినులు = 0
 • మాంసకృత్తులు = 0
 • కొవ్వు పదార్ధం = 0
 • పిండి పదార్ధం = 10
 • రక్తపోటు = 10
 • ఉత్తేజం = 0
 • ఉల్లాసం = 0
 • ఆందోళన = 50
 • ఆనందం = 0
 • ఏడుపు = 20
 • కోపం = 10  వేదాంత (ఫిలాసఫీ) సాహిత్యం

 • విటమినులు = 0
 • మాంసకృత్తులు = 0
 • కొవ్వు పదార్ధం = 0
 • పిండి పదార్ధం = 10
 • రక్తపోటు = 10
 • ఉత్తేజం = 0
 • ఉల్లాసం = 0
 • ఆందోళన = 0
 • ఆనందం = 0
 • ఏడుపు = 80
 • కోపం = 0


మైనారిటీ, దళిత, ముస్లిం, హాస్య ......వగైరా వగైరా సాహిత్యం...ఇలాటి వాటి మీద ఉజ్జాయింపుగా

 •     విటమినులు = 0
 •     మాంసకృత్తులు = 0
 •     కొవ్వు పదార్ధం = 0
 •     పిండి పదార్ధం = 0
 •     రక్తపోటు = 60
 •     ఉత్తేజం = 0
 •     ఉల్లాసం = 0
 •     ఆందోళన = 0
 •     ఆనందం = 0
 •     ఏడుపు = 10
 •     కోపం = 30

అయ్యా - ప్రస్తుతానికి ఇంతటితో సరిపెడుతున్నా...

ఇవన్నీ నాకు ఎదురైన అనుభవాలు....మీ అనుభవం వేరైతే ఆ రోట్లో తలపెట్టి తెచ్చుకున్న నొప్పులు ఇక్కడ కక్కు కొట్టండి

ఈ మోడల్ పుచ్చుకుని మీరు తెలుగు బ్లాగుల న్యూట్రిషన్ సమాచారానికి సిద్ధపడితే సెలవియ్యండి.....అలాటి ఉద్దేశమెవరికీ లేకుంటే నేనే వచ్చే వారం ఇంకో పోష్టేస్తా....

 భవదీయుడు

మాగంటి వంశీ మోహన్

Thursday, December 22, 2011

ఇప్పటికి ముస్తాబయ్యింది......!! ఇదేంటిది ఇలాగుంది ?

మొన్నేసిన సగం బొమ్మ ఇప్పటికి ముస్తాబయ్యింది......
ఇదేంటిది ఇలాగుంది ? మొహం పెద్దదైపోయి బాడీ చిన్నదైపోయిందనిపించట్లా? 
ఓ అవునా! భలే కనిపెట్టారు తవరు! అది అంతే!

రంగులద్దాలా? ఇలానే వదిలెయ్యాలా అని ఆలోచనలో పడ్డా!
చూద్దాం రేప్పొద్దుటికి ఏం మూడొస్తుందోఓ పెన్సిల్లుతో గీకేసావు, నా సంగతి ఏంటి బాబాయ్ అని పెయింటు బ్రష్షు  ఏడుపు మొహం పెట్టుకుంటే, పోనీలే అని బ్రష్షు అందుకుని కాన్వాస్ మీద పరిగెత్తించా....

పిలక, మొహంలో కళ అయ్యీ బావున్నాయి కానీ ఆ దవడ మీద సగం నల్లగా ఉన్నది - గడ్డమా? ఐతే అటేపు ఏది?

మంగలాయన "గడ్డంపు గొరుగుడహః" కార్యక్రమం సగంలో ఏదో గుర్తుకొచ్చి వెళ్ళిపోయాడయ్యా.....మళ్ళీ వస్తాడు....

ఎప్పుడా?

ఏమో? నీకు తెలుస్తే చెప్పు

ఇందులో నువ్వు లేవే అని అడిగింది....నా పేరుందిగా అని చెప్పా!

పెద్దయ్యాక ఏం చేస్తావు నువ్వు అని శాంతి అత్త అడిగితే ఇదిగో అని బొమ్మేసి చూపించా!

ఇందులో నువ్వు లేవే అని అడిగింది....నా పేరుందిగా అని చెప్పా! షెఫ్ మాక్స్, షెఫ్ మెలనీ విల్ వర్క్ ఫర్ మి అని కూడా చెప్పా! 
మొన్న నాన్న ఆఫీసునుంచి వస్తూ కాండీ తీసుకొచ్చాడు....ఒక కాండీ రాపర్ తియ్యగానే అమ్మ.....ఇదిగో ఇలా.....

Wednesday, December 21, 2011

అప్పుడు మీకేమనిపిస్తుంది?

ఒక చిన్నకథలో, అంటే ఓ ఇరవయ్యైదు పేజీల కథలో - మీరు పేజీలు తిరగేస్తూ ఉంటే ఒక్కో పేజీలో, అల్లదిగో ఆ కింద చుక్కలు పెట్టి ఇచ్చిన ఒక్కో లైను అలా అలా అదాటుగా తారసపడ్డాయి.... కథ ఇంకా పూర్తిగా చదవలేదు........అప్పుడు మీకేమనిపిస్తుంది?

కథ యొక్క కథ, కమామీషు తర్వాత చెబుతా కానీ......ప్రశ్నలు ముందు, చుక్కల లైన్లు తర్వాత.....

1.ఈ లైన్లు కథకు అవసరమేమోలే, అయినా తీరిగ్గా తర్వాత నెమ్మదిగా చదువుదాంలే అని అనిపిస్తుందా?
2. వెధవ సోది అనిపించి చదవకుండానే పక్కన పడేస్తారా?
3. మాటల గారడీలాగుంది, కథలో సరుకు లేదనుకుంటా - అందుకే వీటితో నింపేసినట్టున్నాడు. ఇహ ఈ గారడీ ఇప్పుడు చదవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోతారా?
4. అరే ఎంత బాగా రాసాడు...ఒక్కో లైనే ఇంత బాగుంటే, కథ ఎంత బాగుంటుందో అని అనిపించి, ఆ కథను పూర్తిగా అప్పటికప్పుడే చదివెయ్యాలన్నంత ఆవేశం వస్తుందా?
5. పై నాలుగు కాక ఇంకేవన్నా అనిపిస్తుందా?

ఇప్పుడు చుక్కల లైన్లు

***********************************

1. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ఇవాళ వెలిసింది. సూర్యుడు లోకానికి అప్పు పడ్డవాడిలాగ దొంగతనంగా తొంగి చూస్తున్నాడు
2. ప్రళయం వచ్చి భూమి కరిగి పారినట్టు వరద గోదావరి పొంగుతోంది.
3. పొయిలో నుండి లేచిన పొగ చెమ్మగా నిమ్మళంగా ఎండలో తీగలు సాగుతోంది
4. దుంగమీద నల్లని మట్టిని, తెల్లని నురుగు ముక్కుతో పొడుస్తూ కాకి ఒకటి ప్రయానం చేస్తున్నది
5. ప్రవాహం చుట్టలు చుట్టుకుంటోంది, మడతలు పడుతోంది. నున్నగా సాగుతోంది.
6. షాహుకారు గ్లాస్గో ధోవతిమీద మట్టిచినుకు గోటితో గీరుతున్నాడు
7. పడవ ఒక్క అదటున ఊగటంతో అలలు నాల్కలు సాగి ఒడ్డున రాతి కట్టడంలో మట్టిని నాకుతున్నాయి
8. వాన సూదిజల్లువగా ధర్మదాతలు బిచ్చం వేసినట్లు సందేహిస్తూ , కురుస్తూ వెలుస్తూ ఉంది
9. విద్యుద్దీపాలు వెలుతురు తాళ్ళతో గోదావరికి వల పన్నుతున్నాయి
10. బెదురుగా నత్తగుల్లలాగు ఈడ్చుకుంటూ పాకుతోంది రైలు
11. సంద్రం పోటులో ఉంది...నీ గుండెలోనూ ఉంది...నీళ్లలోనూ ఉంది
12. వెన్నెల వ్యాపించి, వానచినుకులు బంగారు తీగల్లాగు మెరుస్తున్నాయి
13. ఒక మేఘం సింహంలాగు జూలు విరబోసుకుంటొంది
14. పసిపిల్లలు పలక మీద గీసిన పిచ్చి గీతల్లాగు మెరుపులు దిక్చక్రం వరకూ సాగుతున్నాయి
15. ముళ్లలాగ గుచ్చుకునే చలిలో గోదావరి నీళ్ళు కాళ్ళు కరుస్తున్నాయి
16. ఒళ్ళు విరుచుకుని కొయ్యగుర్రం మీద ఆడే పిల్లవాడిలాగ ఊగుతూ ఆకాశం వంక కేసి చూస్తున్నాడు
17. నల్లని మేఘాలు అంచులు కలిసి గోడకట్టినట్లైనాయి
18. వానతుంపురులు సందేహంగా కురుస్తున్నాయి
19. వెన్నెల మేఘాలలో వ్యాపించి పలచ బారి చినుకులలో కరిగిపోతోంది.
20. అక్కడక్కడ ఉంగరాలు తిరుగుతున్న నురుగు కుప్పలు చెల్లాచెదరై విడిపోతున్నాయి.
21. రెండు వేళ్ళతో నిప్పును తాకినట్టు ఒక్కసారి ఏడ్పు ప్రారంభించాడు
22. గుడ్డిదానివలె గాలిలో తడుముతూ వెళ్ళిపోయింది
23. నిగ్రహం ఏ క్షణాన దుఃఖంతో విరిగిపోతుందో అన్నట్లుంది
24.అఖండ గోదావరిలానే జీవితం నిర్విచారంగా సాగిపోతోంది...


****************************************************


చుక్కలు సమాప్తం

మీకేమనిపించిందో రాస్తే తెలుసుకుని ఆనందిస్తాం.....

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: ఓ సంగతి రాద్దామనుకున్నా గానీ, ఎందుకులే అని ఆగా!....అద్సరే కానీ ముందు మీర్రాయండి మీకేమనిపించిందో...అప్పుడు చెబుతా!

Tuesday, December 20, 2011

జీవితం - సిగిరెట్టు!!

జీవితం - సిగిరెట్టు

రచన -- జి.స.నా.ర


భగవంతుడు విలాసంగా
వెలిగించిన సిగరెట్టు ....మన జీవితం!

ఎగసివచ్చు ఉంగరాల పొగలు
అనుభవాల నిట్టూర్పు సెగలు!

నడుమ నడుమ రాలుతున్న నుసి
గడచిపోవు వయసుపై కసి!

కొసవరకూ ఆరిపోని చితి
బ్రతుకుపైన ఆకర్షణకాకృతి!

పెదవికాలి పారవేసిన పీక
పనికిరాని వార్ధక్యానికి ప్రతీక!

సిగిరెట్టు కాలిపోవడం ఎంత తొందరో
జీవితం రాలిపోవడం అంతే!!

శ్రీ రావూరి సత్యనారాయణరావు - శ్రీ రాయప్రోలు సుబ్బారావు - భాషా కుటీరం!!

శ్రీ రావూరి సత్యనారాయణరావు గారు , శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు - మూడవ వ్యక్తి వంశీ రామరాజు గారేమో అని అనుమానం.....
రావూరి వారి "భాషా కుటీరం" నుంచి అపురూపమైన ఈ ఫోటో అందించిన వారి అమ్మాయి, తెలుగు బ్లాగరు శ్రీమతి జ్ఞానప్రసూన గారికి ధన్యవాదాలతో...

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Monday, December 19, 2011

శివరంజని - శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి

శివరంజని

రచన: శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి
పత్రిక: తెలుగువాణి, 1978
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

PS: ఇట్లాగుండాలయ్యా! ఓ వర్ధమాన రచయితా - మక్కీకి మక్కీగా కాపీ కొట్టి నీ పేరు వేసుకున్నా నీ జీవితం ధన్యమేనని నేనంటా!

నమో సరస్వతీపుత్రా నమో మల్లాది రామకృష్ణ నమోన్నమహః

Sunday, December 18, 2011

Just when you thought it was over!!!! - Here comes....

Just when you thought it was over!!!

Here comes the ....you know!
One in Sketch mode.....!!
This took 50 mins...
Yeah ...partly because of the jewellery and minute details...
Need to finish the sketch tomorrow and see how it comes out!


After the sketch is satisfactory...still have to do the paint work!! :)

Ok....Now....
Yesterday's half toned painting now woke up in full-tone
Camera did not do justice to the painting though!
I am pretty much happy with it....

Saturday, December 17, 2011

Ahh - Woman! Woman!! Woman!! With a HUMP?

Ahh - Woman!! Woman!! Woman!! Woman with a HUMP?
Hump Eh? Really? 
Hmm! May be...May be NOT.....
Time = 14 mins
Medium: Acrylics
Colors: Bright Yellow,Titanium White, Burnt Umber, Crimson, Burnt Siena
Canvas: 8 * 14 Stretched
Level Of Happiness: Ok...!!
 

Yeah, Yeah.....Water and Trees again!

Yeah, Yeah.....Water and Trees again!
Time = 12 mins
Medium: Acrylics
Colors: Lime / Christmas Green, Real Blue, Pool Blue, Titanium White, Burnt Umber, Crimson
Canvas: 8 * 14 Stretched
Happiness: Moderate, considering the time....
Why do you always draw in a hurry? Why NOT take some more time ? 
Yeah....Good point.....May be I should....
Thanks for the tip...
 

Friday, December 16, 2011

పాఠశాలలు హత్యలు చేస్తాయా?

పాఠశాలలు హత్యలు చేస్తాయా?

చేస్తాయిట....ఈ వీడియో చూసి మీరే తెలుసుకోండి...సర్ కెన్ రాబిన్సన్


భవదీయుడు
మాగంటి వంశీ

PS: It was a killer speech! Thank you Sir Robinson........Thank you!

Thursday, December 15, 2011

గతాలు - స్వగతాలు - శంకరమంచి సత్యం (1969)

గతాలు - స్వగతాలు

రచన: శంకరమంచి సత్యం
పత్రిక: ప్రగతి, 1969 డిసెంబరు
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, December 14, 2011

థాంక్యూ బేబీ!! థాంక్యూ - ఆరుద్ర (1969)

థాంక్యూ బేబీ - థాంక్యూ

రచన: ఆరుద్ర
పత్రిక: ప్రగతి, 1969 డిసెంబరు
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

PS: విశ్వనాథ సత్యనారాయణ కట్టలేని సమాసాలుట! - హ హ!

ఆవాహన - శ్రీ శ్రీ

ఆవాహన

రచన: శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 మార్చ్
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

సూరయ్య మామయ్య వైద్యం - కొడవటిగంటి కుటుంబరావు

సూరయ్య మామయ్య వైద్యం

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 మార్చ్
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, December 13, 2011

వేదనా శకలం - ఆరుద్ర

వేదనా శకలం

రచన: ఆరుద్ర
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 మార్చ్
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

చిన్నపిల్లల పాటలు - చింతా దీక్షితులు, దేవులపల్లి

చిన్నపిల్లల పాటలు - చింతా దీక్షితులు, దేవులపల్లి

పత్రిక: అనసూయ (1919)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఆడుకుని అబ్బాయి
వచ్చె కాబోలు
అందిళ్ల చప్పుళ్లూ - పందిళ్లకోన
చదువుకుని అబ్బాయి
వచ్చె కాబోలు
సరస్వతీ చప్పుళ్లు - సావిళ్లలోను

ఆడంగ ముద్దూ
పాడంగా ముద్దూ
నట్టింట అమ్మాయీ
నవ్వంగ ముద్దూ

******************

రావోయి చందమామ!
రావోయి జాబిల్లి
రావోయి, రావోయి
చిన్నిపాపడా
తేవోయి చిన్నిచినుకు
తేవోయి మబ్బు తునక
తేవోయి తేవోయి
చిన్నిపాపడా
తేవోయి నీలాలు
తేవోయి వెన్నెలాలు
తేవోయి, తేవోయి
చిన్నిపాపడా
బొజ్జలోని కాకిపిల్ల
వజ్జనున్న చుక్కపిల్ల
తేవోయి తేవోయి
చిన్నిపాపడా
కొలనిలో అల్లలనెక్కి
చెలగి యుయ్యాలలూగి
కులుకవోయి వెన్నెలాలు
చిలికి పాపడా
అద్దమిదిగొ రావోయి
ముద్దుమో మద్దమందు
దిద్దుకో రారమ్ము
ముద్దుపాపడా
ఎల్లప్పుడు కొండనెక్కి
జల్లగా నాడుచుండు
ఇల్లులేదొ? తల్లిలేదొ?
చిన్నిపాపడా
బిరబిరబిర కొండనెక్కి
పరువిడుదుచు గబగబగబ
వెరపులేదొ? వెరగు లేదొ?
చిన్నిపాపడా
ఎందరెందరో చిన్ని
చందమామనిచట పిలువ
ఎందుకురా ఓయనవో
చిన్నిపాపడా
నిన్ను అమ్మముద్దిడదని
కన్నులలో ఏడ్పు వచ్చె
అన్ని బొమ్మలిత్తురార
చిన్నిపాపడా

- చింతా దీక్షితులు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి

పూర్వపు నగల పేర్లు - మీలో ఎంతమందికి, ఎన్ని పేర్లు తెలుసో తేల్చుకోండి!!

పూర్వపు నగల పేర్లు

పత్రిక: అనసూయ (1917)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఇవండీ "వందేమాతరం" వారు రాసిన నగల పేర్లు:

మీలో ఎంతమందికి, ఎన్ని నగల పేర్లు తెలుసో తేల్చుకోండి....

రాగిడీ
సూర్యుడు
చంద్రుడు
తమలపాకు
మొగిలిరేకు
పాపిడి బింద్రీలు
చామంతి పువ్వు
జడకుచ్చులు
కర్నపువ్వులు
కొప్పుగొలుసులు
పాపట బొట్టు
నాగరాలు
గులాబీపువ్వులు
బాజు బొందులు
తావేదులు
దండ కడియాలు
మురుగులు
మురిడీ గొలుసులు
పట్టీలు
నల్లగాజులు
పటకా వడ్డాణాలు


చెవులకు:

బొగడలు
తమ్మెట్లు
జూకాలు
జల్లీబావిలీలు
ముత్యపు బావిలీలు
నీలపు బావిలీలు
కుంటేళ్లు
దుద్దులు
తాలూకాలు
గూబ బావిలీలు


ముక్కుకు:

ముక్కుపుడక
కమ్మి
నత్తు
అడ్డబాస
హంస


మెడకు:

పట్టెడ
కుత్తిగంటు
కంటె
నానుకోళ్ళు
పగడాల పేరు
కాసుల పేరు
మొహరీల పేరు
చంద్ర హారాలు
బొందులో మంగళసూత్రం
ముత్యాల హారం
పుదుచ్చేరి నాను
దౌరుగళ్లీ
నానుపేట
లక్షీ కాసులు
వందేమాతరం కాసులు
రాణీ ఖాసులు
గుర్రపు కాసులు
కట్టడపు పేర్లు
వరహాల పేర్లు
గడియారపు గొలుసు
పలకసర్లుకాళ్లకు:

కడియాలు
అందెలు
గజ్జెలు
పావడాలు
పాంజేబులు
తుమ్మకాయ గొలుసులు
చుట్లు
పిల్లేళ్లు
మట్టెలు

గాడిద పిల్ల కోమలం - కొడవటిగంటి కుటుంబరావు

గాడిద పిల్ల కోమలం

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 మే
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, December 12, 2011

పాపయ్య తిరిగొచ్చాడు - మా. గోఖలే

పాపయ్య తిరిగొచ్చాడు

రచన: మా. గోఖలే
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 మే
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

One of the Best Reads in recent times! Racchabanda Post...

I unsubscribed out of R.B yahoo group quite a while ago - for various reasons. But I still read the messages in that yahoo group once a week.

99.99% of the time I just read messages from Lyla gaaru, J.K Mohana Rao gaaru, Udaya Rao gaaru, Srinivas Nagulapalli gaaru, Sarada gaaru, Savithri Machiraju gaaru, Sreenivas Paruchuri and Pamarthy Brothers - in the SAME ORDER. They simply are the best! Well - they are the best to me!

Others? - yeah, you guessed it right, not to my interest and I simply don't care what they write!

Not that it matters to them - What a jerk you are! And how rude? And how dare you say that?

Yeah ...Yeah...Yeah....Don't care!

Anyways - Today was one such day when I visited R.B and had one of the best reads in recent times, meaning in few weeks....here is the link

Thank you Lyla gaaru

May God (Who ever it may be!) Bless you with 100 more years of vigor and flair

పీనుగులను పీక్కుతినే రాబందుల రాచవాడ ఈ దెయ్యాల మేడ !!

దెయ్యాల మేడ - గజ్జెల మల్లారెడ్డి 

పత్రిక: ప్రగతి, డిసెంబరు 1969
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు
మక్దుం మొహియుద్దీన్ ఉర్దూ రచన "హవేలీ" కి తెలుగు అనువాదం : గజ్జెల మల్లారెడ్డి

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

ఘాటుగా రాసేవాళ్ళలో ఝకోవ్ తర్వాత ఢకోవ్ నే చెప్పుకోవాలి!!

నేను పేరెందుకు మార్చుకున్నానంటే?

రచన: కే.ఆర్
పత్రిక: విజయవాణి , జులై 1948
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఘాటుగా రాసేవాళ్ళలో ఝకోవ్ తర్వాత ఢకోవ్ నే చెప్పుకోవాలి

అర్థం కావాలంటే కథ చదవాల్సిందే

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, December 11, 2011

బూతు గురించి వివరంగా రాసిన కొడవటిగంటి కుటుంబరావు (1969)

బూతు గురించి వివరంగా రాసిన కొడవటిగంటి కుటుంబరావు (1969) 


పత్రిక: ప్రగతి, డిసెంబరు 1969
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

PS: సాధారణంగా - ఇలాటి నిషేధాల గురించీ, సాంఘికసభ్యత గురించీ - పోచికోలు లెక్చర్లిచ్చే వ్యాసాలను హెడ్డింగు చూసే, అల్లా కాలవల్లోకి గిరాటేస్తూ ఉంటా, కానీ కొ.కు రాసారనేప్పటికి చదివా!  చదివాక - ప్చ్! అని నిట్టుర్చా ...

పోనీ మీరేమన్నా నిటారు ఊర్పులు కాక, అడ్డం ఊర్పులు ఏమన్నా విడుస్తారేమోనని ఇక్కడ పోష్టు చేసా, గిరాటెయ్యకుండా!

ముష్టిపిల్ల ముష్టిపిల్లే, నేను నేనే, ధనికుడు ధనికుడే!

అన్నం మెతుకులు 

రచన: వజ్ఝల రామనరసింహం
పత్రిక: తెలుగు స్వతంత్ర , సెప్టెంబరు 1948
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ముష్టిపిల్ల ముష్టిపిల్లే, నేను నేనే, ధనికుడు ధనికుడే!

అర్థం కావాలంటే కథ చదవాల్సిందే

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Saturday, December 10, 2011

కోనేటి జన్మ - శ్రీ శ్రీ

కోనేటి జన్మ

రచన: శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర (అక్టోబరు 1948)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, December 9, 2011

సర్వశ్రీ వావిళ్ళ, సి.కె.నాయుడు, చల్లా, రాజమన్నారు, పురిపండా, కవికొండల, గూడవల్లి, మోక్షగుండం......ఆహా!

సర్వశ్రీ మోక్షగుండం, వావిళ్ళ, సి.కె.నాయుడు, చల్లా, రాజమన్నారు, పురిపండా, కవికొండల, గూడవల్లి......ఆహా!

(Source: Samadarsini, 1929 - Press Academy Website)టెక్కలి, బొబ్బిలి, మునగాల, చల్లపల్లి, మీర్జాపురం.....జమీందార్లు.... అబ్బో! అబ్బో!

టెక్కలి, బొబ్బిలి, మునగాల, చల్లపల్లి, మీర్జాపురం.....జమీందార్లు.... అబ్బో! అబ్బో!

ఇంతకుముందు - పత్రికా రంగంలో పని చేసే ఒకావిడ , అబ్బో ఇంకేమండీ - టెక్కలి, బొబ్బిలి జమీందార్ల ఫోటోలు, వివరాలు పంపించేస్తాను మీకు, మీదే ఆలస్యం అని ఊదరగొట్టేసి - ఆ తర్వాత చేతులు దులుపుకున్నారండోయ్.......

మన మొహాన రాసి ఉంటే అన్నీ మన దగ్గరికే వస్తాయ్...

ఇప్పుడు రాలా ? ప్రెస్ అకాడెమీ వారి ద్వారా?...

అంతే.... :) :) 

(Source: Samadarsini Patrika 1929, Press Academy Website)చల్లపల్లి జమిందారు గారు, గుర్రం జాషువా, ఉమర్ అలీషా మొదలైన వారు...(1930)

చల్లపల్లి జమిందారు గారు, గుర్రం జాషువా, ఉమర్ అలీషా మొదలైన వారు...
(From: Samadarsini 1930, Press Academy Website)"అసలు సమస్య" - తెలంగాణాకు అన్వయించెయ్యొచ్చు!

అసలు సమస్య - తెలంగాణాకు అన్వయించెయ్యొచ్చు!

రచన: శారద
పత్రిక: తెలుగు స్వతంత్ర (అక్టోబరు 1948)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఈ కథ చదివితే ఏం గుర్తుకు వస్తోంది?

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

కమలమ్మ (కథానిక) - బి.అనూరాధ

కమలమ్మ (కథానిక)

రచన: బి.అనూరాధ
పత్రిక: తెలుగు స్వతంత్ర (నవంబరు 1949)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Thursday, December 8, 2011

గవేషణ - శ్రీ శ్రీ (1948)

గవేషణ

రచన: శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర (అక్టోబరు 1948)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, December 7, 2011

Inspired by the winter, here is one quickie painting....

Winter Bear Is Waking Up..... Spreading it's claws slowly. This morning was 26 Degrees Fahrenheit Or Minus 3 Degrees Celsius!

Inspired by the winter, here is one quickie painting....

Could have come out much better...but oh well....If only I spent more time...lol...

Crimson Killed The Beauty.... Wrong Color.....

Will have to see tomorrow, if I can fix it!.... 

Total Time 8 mins...

Colors: Titanium White, Raw Siena, Burnt Umber, Crimson....
Medium: Acrylics on 11 * 14 Stretched Canvas

డిలన్ థామస్ గీతం - శ్రీ శ్రీ అనువాదం (1948)

గీతం

రచన: డిలన్ థామస్
అనువాదం: శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 ఫిబ్రవరి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

చిన్నపిల్లల సర్కస్ లో
ఫిడేళ్లు ధరించిన నర్తకులు
కష్టాలన్నీ మైమరచిన
కాలం అనేది ఉండేదా?

గ్రంథాల మీద పడి వాళ్లేడ్చే
కాలమ్మ్ ఒకటి ఉండేది
కాలం అయితే వాళ్లమీదకి
కాష్ఠాన్నే ఉసికొల్పింది

ఆకాశపు అర్ధవలయంకింద
ప్రమాదమైన బతుకు వాళ్లది
అజ్ఞేయం మాత్రమే ఈ లోకంలో
అత్యంత సురక్షితమైనది

ఆకాశపు సన్జల కింద
హస్తాలు లేనివాళ్లవే
అతిశుభ్రమైన చేతులు!

గుండెల్లేని శవానికి
గాయాలబాధ లేనట్టు
గుడ్డివాడు మాత్రమే
జాస్తీగా చూస్తాడు

పుష్పాంజలి - రాయప్రోలు - ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం (1948)

పుష్పాంజలి

రచన: రాయప్రోలు సుబ్బారావు
పత్రిక: తెలుగు స్వతంత్ర (సెప్టెంబరు 1948)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

స్వాతంత్ర్య వార్షికోత్సవం నాడు, ఆలిండియా రేడియో మద్రాసు కేంద్రం నుండి ప్రసారితం

ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

స్వతంత్రబారత చరితచ్ఛాయలు
బ్రహ్మాండము నిండా
ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

ఉదయాస్త్రాదుల తలవాకిండ్లను
సేతు శీతనగ శిఖరాగ్రములను

మువ్వన్నియలును పొదిగీ పొందీ
ఏకస్వామిక రేఖ నలందా
ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా

కపటవంచనా నిపుణ తంత్రముల
మారణహింసా మధిత చిత్తమయి

ద్వేషలోభములు తెర్లి జ్వలింపగ
మసలి భ్రమించేమనుకుల మరయగ
ఎత్తవోయి నీజయజెండా

మానవమైత్రీ మంగళతంతువె
మంత్రాంగములకు మూలసూత్రమని

సత్యాగ్రహ ఋషి చాటిన పాఠము
ఎల్లజాతులను పల్లవిపాడా

ఎత్తవోయి నీ జయజెండా
విప్పవోయి నీ ప్రియకాండా


భవదీయుడు
మాగంటి వంశీ

ఉచిత శిక్ష - నాటిక - పురాణం సుబ్రహ్మణ్య శర్మ

ఉచిత శిక్ష - నాటిక - పురాణం సుబ్రహ్మణ్య శర్మ
1948 నవంబరు తెలుగు స్వతంత్ర వారపత్రికలో
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు 

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

శ్రీశ్రీ గారికి స్థిరం లేదని అన్నవారికి కొరడాదెబ్బలతో కృతజ్ఞత తెలుపుతూ .....

ప్రవాహం - శ్రీ శ్రీ
1948 డిసెంబరు తెలుగు స్వతంత్ర వారపత్రికలో
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

శ్రీశ్రీ గారికి స్థిరం లేదని అన్నవారికి కొరడాదెబ్బలతో కృతజ్ఞత తెలుపుతూ జారిన ఆణిముత్యం

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

తరవాణిలో ఆవకాయ ముక్కేసుకుని తింటే ఎల్లాగుంటుంది?

కైంకర్యం - మల్లాది రామకృష్ణ శాస్త్రి
1948 డిసెంబరు తెలుగు స్వతంత్ర వారపత్రికలో
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

తరవాణిలో ఆవకాయ ముక్కేసుకుని తింటే ఎల్లాగుంటుంది? దాని రుచి దేనికన్నా వస్తుందా?

అదే లెక్క మల్లాది వారి కథలక్కూడా....

నమోన్నమహ! సరస్వతీపుత్రా! నమోన్నమహ!

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

టాగోర్ అంటే నాకు అల్లర్జీ - శ్రీ శ్రీ (1948)

టాగోర్ అంటే నాకు అల్లర్జీ - శ్రీ శ్రీ
1948 నవంబరు, డిసెంబరు తెలుగు స్వతంత్ర వారపత్రికలో
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు


చతుర్వేది అనే ఆయన శ్రీశ్రీ గారు అల్లా అనగానే మనసు కష్టపెట్టేసుకుని, ఇంత బారున ఓ వ్యాసం రాసారు....

అది చూసి శ్రీ శ్రీ గారు ఒక్క పేజీలో అన్నీ చించి పారేశారు...

జయహో శ్రీ శ్రీ...జయహో! 

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

కలాలతో కొట్టుకున్నచలం - అడపా రామకృష్ణరావు (1948)

అడపా రామకృష్ణరావు గారు, చలం గారు కలాలతో కొట్టుకున్న దృశ్యం ఆవిష్కరించబడింది నవంబరు / డిసెంబరు 1948, తెలుగు స్వతంత్ర వారపత్రికలో

క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

తెలుగు తల్లి - శ్రీ శ్రీ (విజయవాడ ఆల్ ఇండియా రేడియో కోసం - 1948)

తెలుగు తల్లి

రచన: శ్రీ శ్రీ (ఆల్ ఇండియా రేడియో కోసం)
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1948 డిసెంబరు 17
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు


అదెవో తెలుగుతల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదె నీ తెలుగుతల్లి

పదవోయ్ తెలుగువాడా
అదె నీ తెలుగు మేడ
సంకెళ్లు లేని నేల
సంతోష చంద్రశాల

కనవోయ్ తెనుంగురేడా
అదె నీ అనుంగునేల
అదిగో సుదూరవేల
చనవోయ్ తెలుగువీరా

స్వర్గాల కాంతి స్వప్నాలు
స్వప్నాల శంతి స్వర్గాలు
నిన్నే పిలుస్తున్నాయి
నిన్నే వరిస్తున్నాయి

ఆందోళనాల డోల
సందేహాల హిందోళ
ఎందాక ఊగిసలాట
ఇది నీ గులాబితోట

పదవోయ్ తెలుగుబాట
ఇదిగో తెలుగుకోట
పదవోయ్ నిర్భయంగా
పదవోయ్ దిగ్జయంగా
పదవోయ్ నిశ్చయంగా

(డిసెంబరు ఒకటినాడు విజయవాడ రేడియో కోసం)

భవదీయుడు
మాగంటి వంశీ

ఆరుద్ర గారి త్వమేవాహం మీద శ్రీ శ్రీ గారి లఘుటిప్పణి - చదివినవాడు ధన్యుడు సుమతీ !!

ఆరుద్ర గారి త్వమేవాహం మీద శ్రీ శ్రీ గారి లఘుటిప్పణి
ఫిబ్రవరి 1949, తెలుగు స్వతంత్ర వారపత్రికలో


చదివినవాడు ధన్యుడు సుమతీ !!

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

దాసరి సుబ్రహ్మణ్యం గారి "దేవదూత" - 1949

దాసరి సుబ్రహ్మణ్యం గారి "దేవదూత"
ఫిబ్రవరి 1949, తెలుగు స్వతంత్ర వారపత్రికలో
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

PS:
ఇహ దాసరి వారి బ్లాగాభిమానులు రెచ్చిపోవచ్చు....
కాఫీలు తాగుతూ కాపీలు చేస్కోవచ్చు....
జయహో అభిమాన సంఘాలు .... :) 

ఇంకొన్ని చాక్లెట్లు ఉన్నాయక్కడ....
మీ "పెతాపం" సూపిచ్చుకోడానికి అవకాశం వచ్చిందహో !

Tuesday, December 6, 2011

కలకాలం - శ్రీ శ్రీ (1948)

కలకాలం

రచన: శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర, అక్టోబరు 1948
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఔను, వాహనం మారింది
దూరానికి పూర్వపు టర్థం పోయింది
పూర్వం దూరం పోయింది,
వెనకటి వాహనం మారింది
ఆ సూర్యుడే నేడూ
ఆ చంద్రు డీనాడూ
అవే నక్షత్రాలూ
ఐనా కాలం మారింది

ఔనా, కాలం మారింది మరి
మానవుడా మేలుకో, నేస్తం
ఎద్దుబండితో కొలవకు దూరాన్ని
ఎగరవోయ్ చదలయెద చీలుస్తూ
రేపు బయల్దేరాలనుకున్నావు
నేడే ఇచ్చటికి వచ్చేశావు
విచ్చేసింది నీ తరుణం
పుచ్చుకో ఇది నీ భావి

ఇది నీ భావి గ్రహించు
ఈ భావి నీకు నా ప్రెజెంటు
భూతకాలపు సరీసృపాలని
పాతరాతి యుగంలో పారెయ్
పాతెయ్ నీ సందేహాలని
తోలెయ్ నీ మందాక్షాలని
నిటారుగా నిలబడు నేస్తం
హుటాహుటిగా ముందుకి సాగు

హుషారుగా ముందుకి సాగు
ఊరికే వెనక్కి చూస్తావేం
దుప్పివీ కుక్కవీ కావు
తిర్యగ్దృక్కువి నువ్వు కావు
దూరం కరిగిపోతోంది
కాలం మరిగిపోతోంది
మానవుడిగా మేలుకో నేస్తం
ఏలుకో ఈ విశ్వం సమస్తంభవదీయుడు
మాగంటి వంశీ

నక్షత్ర కాంతి - చలం (1948)

నక్షత్ర కాంతి

రచన: చలం
పత్రిక: తెలుగు స్వతంత్ర (1948, సెప్టెంబరు)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు   

ఎక్కడ?


భవదీయుడు
మాగంటి వంశీ

తీరని సమస్య - కొడవటిగంటి కుటుంబరావు (1948)

తీరని సమస్య?

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: తెలుగు స్వతంత్ర (1948, August)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు   

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

"యీ రాత్రి" ఏమయ్యిందో తిలక్ గారు చెప్పారు...

యీ రాత్రి

రచన: బాలగంగాధర్ తిలక్
పత్రిక: తెలుగు స్వతంత్ర (1948, ఆగష్టు 6)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు   ఈ రాత్రి సామిదగ్ధమయింది
ఈ ధాత్రి నిస్తబ్ధమై ఉంది
హేమగాత్రి! నీ చరణమంజీరం
నిస్వనింపదు!
నా లోపల ఆశామందారం
కిసలయింపదు!

గాలిలేనిప్రకృతి యోగిలాగ రోగిలాగ
మూల్గుతోంది
కాలువిరిగిన ముసలికుక్క దీనంగా
మొరుగుతోంది
తరతరాల నిస్పృహ నన్నావరించుకొంది
చరచరాలు తాకిన నీమూర్తి ముడుచుకొంది

యుద్ధం మీద యుద్ధం వచ్చినా
మనిషి గుండె పగలలేదు
మనిషి మీద మనిషి చచ్చినా
కన్నుతుదల జాలిలేదు
నాగరికత మైలవడిన దుప్పటిలా
నన్నౌ కప్పుకుంది
నాకందని ఏదో రహస్యం నన్ను
వశం చేసుకుంది

పాముకోర డేగరెక్క యీ కాలానికి చిహ్నం
పూలతేనె నెమలిరెక్క ఒక మిధ్యా ప్రమాణం
నా ప్రవృత్తి పసుపువన్నెల పెద్దపులిలా
పరచుకొంది
ఏదో విపత్ దూరంగా మబ్బులలో
దాగి ఉంది!

ఈ రాత్రి సామిదగ్ధమయింది
ఈ ధాత్రి నిస్తబ్ధమై ఉంది
హేమగాత్రి! నీ చరణమంజీరం
నిస్వనింపదు!
నా లోపల ఆశామందారం
కిసలయింపదు!

Monday, December 5, 2011

సోదరీమణులూ - మీరు వల వల వల ఏడ్చెయ్యటానికో కథ దొరికింది....!!

సోదరీమణులూ - మీరు వల వల వల ఏడ్చెయ్యటానికో కథ దొరికింది....

పాపాయి పరుగులు

రచన: బి.అనురాధ
పత్రిక: తెలుగు స్వతంత్ర (1948, ఆగష్టు 6)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

శోకప్రాప్తసిద్ధిరస్తు...వలవలానందమస్తు!

ఎక్కడ?

ఇక్కడ?

భవదీయుడు / సోదరుడు
మాగంటి వంశీ

ఒక్కడే బయలుదేరాలిట.....బాలాంత్రపు రజనీకాంతరావు

ఒక్కడవే

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
పత్రిక: తెలుగు స్వతంత్ర (Aug 6, 1948)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఒకరయినా, నీకేకకు ఓయని రాకున్నా
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే||

ఓరీ, ఓ అభాగ్యుడా,
ఊరంతా భయంచేత
గోడవైపు తిరిగిమాట
లాడకుండ నిలుచున్నా
మనసు విప్పు లోలోపలి
మర్మమేదొ కంఠమెత్తి
నీకు నీవె చెప్పవోయి
ఒక్కడవే, ఒక్కడవే||

ఓరీ, ఓ అభాగ్యుడా,
ఒకరైనా నీ ముంగిట
కారుమబ్బు కాళరాత్రి
దీపమైన చూపకున్న
పిడుగుమంట కాల్పులోన
పడిమండే, నీగుండెల
ఒంటిగానె వెలుగనీయి!
ఒక్కడవే, ఒక్కడవే, ఒక్కడవే||
ఒక్కడవే బయలుదేరు
ఒకరయినా, నీకేకకు ఓయని రాకున్నా
ఒక్కడవే బయలుదేరు
ఒక్కడవే బయలుదేరు

(రవీంద్రుని "ఎక్ లా చలో" కు అనువాదము)

PS: Audio can be heard here

Sunday, December 4, 2011

గ్రంథాలయోద్యమ ప్రముఖుల చిత్రాలు కొన్ని

గ్రంథాలయోద్యమ ప్రముఖులు

క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు, యుగవాణి

 1. శ్రీ అయ్యంకి వేంకట రమణయ్య, 
 2.  శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, 
 3.  శ్రీ కోదాటి నారాయణ రావు