Friday, November 18, 2011

తెనుగు తల్లి - తెనుగు తండ్రి - తెనుగు పాప!!

 నేటికి

-- శివరామం

(1938, ప్రతిభ  పత్రిక నుండి)


మృడాని కంఠో
ద్ధృత హూంకారం
తెనుగు తల్లి తీ
యని యెలుగులకా!

హరు ఫాలాక్షి
స్ఫుర దగ్ని కణం
తెనుగు తండ్రి చ
ల్లని చూపులకా!

భూత పిశాచ
ప్రేత తాండవం
తెనుగు పాప చ
క్కని నడకలకా!

కళలు కవితలూ
కలకల్లాడే
తెలుగు నాటికా
ప్రళయం నేటికి!



nETiki

-- SivarAmam

(1938, pratibha  patrika nunDi)


mRDAni kanThO
dDHRta hUnkAram
tenugu talli tI
yani yelugulakA!

haru phAlAkshi
spHura dagni kaNam
tenugu tanDri ca
llani cUpulakA!

bhUta piSAca
prEta tAndavam
tenugu pApa ca
kkani naDakalakA!

kaLalu kavitalU
kalakallADE
telugu nATikA
praLayam nETiki!

No comments:

Post a Comment