Sunday, November 6, 2011

దేవులపల్లి - గుహుడు - బాబోయి, నాయనోయి !!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి "గుహుడి కథ" చదివటం మొదలుపెడదామని పి.డి.ఎఫ్ ప్రింటు ముందేసుకుని కూర్చుని మొదటి పేజీ నాలుగు పేరాలు చదవగానే, లాభం లేదురా నాయనా - ఈయన పాటలు, కవితలు రాస్తేనే చదవగలం కానీ - ఇల్లాటివి రాస్తే చదవలేం అనిపించింది......పక్కనపడేసా....

మళ్ళీ సాయంత్రం ఎందుకో అలా కుర్చీ మీద పడేసున్న ఆ కాయితాలు దీనంగా నా వంక చూస్తుంటే సరే మొత్తం చదివేస్తే ఓ పనైపోతుంది, ఈ కథనం సాగిన చిరాకుతో నిద్ర పట్టడానికి బోల్డంత సమయం తీసుకుంటుందేమో అని బుర్రలో ఉన్న బ్రెయిను షంటుతూ ఉన్నా, ఏకబిగిన ఎనిమిది నిముషాల్లో ఆ ఐదు పేజీలు పూర్తిగా చదివి పక్కన పెట్టా....

ఆతర్వాత ఏమయ్యింది బాబూ?

ఇంతకీ నిద్ర పట్టిందా లేదా? మాకు ఇక్కడ రక్తపోటు పెరుగుతోంది...చెప్పు !!

అది తర్వాత చెబుతా....

ముందు - మీరు ఇది చదివి మీ అభిప్రాయం చెప్పండి

ఆలిండియా రేడియో వారి సౌజన్యంతో అని ఉన్నది.....మరి ఆయన 1950లో చదివిన ప్రసంగ పాఠమో ఏమో తెలియరాలేదు....ఒకవేళ ఎవరివద్దైనా ఆ ఆడియో ఉంటే పంచుకోండి...ముందస్తు ధన్యవాదాలతో

భవదీయుడు
మాగంటి వంశి

PS:
Source: Press Academy Website, Kinnera Patrika April 1950

No comments:

Post a Comment