Tuesday, November 15, 2011

జెండా! జెండా! జెండా! జెండా! - అంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి

జెండా

- దేవులపల్లి కృష్ణశాస్త్రి
(ప్రతిభ, 1936 నవంబరు సంచిక)

పరువంపు మా జెండా!
భారతీయుల జెండా!
గరువంపు గగనమే
ఒరసి యాడెడు జెండా!

నిదురపోయిన జెండా!
నీలి నీడల జెండా!
కొదమ చుక్కల దండ
కొసల మఱచిన జెండా!

సగము సోలిన జెండా!
స్వప్నసీమల జెండా!
సందె వన్నెల నిండ
సాగి ప్రాకిన జెండా!

మేలుకొనిన జెండా!
గాలి దారుల జెండా!
వెలుఁగు పొడుపుకొండ
నిలిచి పిలిచెడు జెండా!

మెరసి పోయెడు జెండా!
మింటి నడిమి జెండా!
తరుణ తరణి కిరణా
భరణము మా జెండా!

No comments:

Post a Comment