Monday, November 7, 2011

దొరికేసిందయ్యోయ్...దొరికేసింది.....!!

దొరికేసిందయ్యోయ్...దొరికేసింది.....

తెన్నేటి సూరి గారి "ఒరిజినల్" చెంఘిజ్ ఖాన్, ఆన్లైనులో దొరికేసింది...  1950, సెప్టెంబరు 24వ రోజున వెలువడిన ఆంధ్ర పత్రికలో సారస్వతానుబంధం సెక్షన్లో మొదటి భాగం కనపడింది......

ఆన్లైను అన్నావు....ఎక్కడో చెప్పు బాబూ...ఇంతకీ ఎక్కడ కనపడింది?

యెహా...విసిగించకు....చెబుతున్నాగా ....ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులోనయ్యా....

అది సరే కానీ ఎన్నిసార్లు చదివానో గుర్తుకూడా లేని, అన్నిసార్లు చదివినా , చదివిన ప్రతిసారీ రోమాలు నిక్కబొడుచుకునిపోయి, పుస్తకం ఏకబిగిన పూర్తి చేసేదాక వదలనివ్వని శ్రీ తెన్నేటి సూరిగారి “చెంఘిజ్ ఖాన్” ఒరిజినల్ ప్రింటు బుక్కు నావద్ద ఉన్నదోయి....నీలాటి అర్భకులకు, ఆపైన వివరాలు తెలియని కొంతమంది  అమాయకులకు ఉపయోగపడుతుందేమోనని (ఆ ఆన్లైను వివరాలు ) ఇక్కడ చెబుతున్నా....

ఆ సెప్టెంబరు 24 తారీకు నుండి 7 రోజులు లెక్కేసుకుని ఆ తర్వాత వచ్చే ప్రతి ఆదివారం వెలువడిన "ఆంధ్ర పత్రిక" ఎడిషన్లు తెరుచుకుని, అన్నీ కలుపుకుని ఓ పుస్తకం కింద చేసుకో - చేసుకో - చేసుకో - చేసుకో!!! ఏం?

చేసుకుని ఊరుకోకు....చదువు.....బాగుపడతావు....

అదేదో - ఆ పుస్తకమేదో నువ్వే చేసియ్యకూడదూ?

అన్నీ నేన్జేసిస్తే నువ్వేం చేస్తా? ఎత్తుకెళ్ళి ఎక్కడో పెట్టి నా పెతాపమేనని ఊగుతావా? లేకపోతే అక్కడెక్కడో పెట్టి - ఆ పైన నామమాత్రంగా ఏదో చెప్పాలి కాబట్టి - అజ్ఞాతలిచ్చారని సోది చెబుతావా?

తెలియకడుగుతా కానీ - అజ్ఞాతలు ఇల్లాటివి, ఇవి కాకపోతే అపురూపమైనవి ఆడెవడొ ఊరు పేరు లేనోడు నీకివ్వటమేమిటీ? ఎవడో ఊరు పేరు తెలియనోడు/లేనోడు నీకెందుకిస్తారు?.......

పోనీలే - నీ ఆనందం నీది....అల్లా అజ్ఞాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండు! ...అల్లాగైనా నా వెబ్సైటు నుండి ఎత్తుకెళ్ళినదానికి నేనూ ఓ అజ్ఞాతగా చరిత్రలో మిగిలిపోతానేమో చూసుకుంటా....

చరిత్ర బాబూ చరిత్ర - అది ఎక్కడినుంచి చూస్తా నువ్వు?

అనుమానం వచ్చిందా? శుభం....

భవదీయుడు
మాగంటి వంశీ

6 comments:

  1. sir link చెప్పండీ..

    ReplyDelete
  2. @ అడ్మిన్ - మీరు ఎవరికి అడ్మిన్నో, దేనికి అడ్మిన్నో తెలియదు కానీ - ఊరు పేరు చెప్పుకోగలిగితేనే ఈ బ్లాగులో కామెంట్లు రాయండి. అనామకులకు సమాధానాలిచ్చే సంప్రదాయాన్ని వదిలేసి చాలా రోజులయ్యింది, కానీ మీరెవరో కొత్త అనామకుల్లా ఉన్నారని సమాధానమిస్తున్నా.....

    @శుభ - గూగుల్ లో Andhra Pradesh Press Academy అని సెర్చి చెయ్యండి...లంకెలు ప్రత్యక్షమవుతవి, దానితో పాటు లంకెబిందెలు కూడా....

    ReplyDelete
  3. సారీ అండి. హడావుడిలో మీ మొదటి లైనే చదవలేదు. అందుకని సంవత్సరం చెప్పమని అడిగా. థాంక్స్ ఎ టన్.
    W/R-Saikiran

    ReplyDelete
  4. link dorakatam ledu mahaprabhoo..first part link copy cheyyochugada..!!

    ReplyDelete