Wednesday, November 2, 2011

"స్థానం వారి స్థానం" - "మాయాబజార్" శాస్త్రి గారి వ్యాసం !

వంగర వెంకట సుబ్బయ్య గారంటే ఈనాటి ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాటివారికి మాయాబజారు సినిమాలో శర్మ శాస్త్రి ద్వయాన్ని గుర్తుచేస్తే చప్పున కళ్ళ ముందుకొచ్చేస్తారు.......ఆయన - నేను విపరీతంగా అభిమానించే "అభిమాన నటుల్లో" ఒకరు...

వారి మీద 2008లో శాక్రమెంటో రేడియో స్టేషన్లో ఒక కార్యక్రమం సమర్పించాను కూడా.....ఆ ప్రోగ్రాము ఇక్కడ వినవచ్చు.....

ఆయన "స్థానం వారి స్థానం" అని ఒక పుస్తకం రాసారని ఈరోజు తెలిసింది.

ఎలా తెలిసిందా?

దానికో కథ చెప్పాలి...ఇంతకుముందు అప్పుడెప్పుడో పిల్లలకథలు సైటులో పెడుతున్నప్పుడు వేసిన టపాల్లో, ఒక టపాలో ఒక సంగతి చెప్పడం జరిగింది.....తమిళనాడు గవర్నమెంటు వారు పిల్లల పాఠ్య పుస్తకాలు ఆన్ లైనులో పెట్టిపారేసి సుళువుగానూ, అందుబాటులోనూ పెట్టేసారు....ఎల్.కె.జి నుంచి 12వ తరగతి దాకా....అందులో తెలుగుకు సంబంధించిన పుస్తకాలు, తెలుగులో బోధించే పుస్తకాలు - పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఉండేవి...

అవి , అనగా ఆ పి.డి.ఎఫ్ లు 2007-2008 ప్రాంతాలనుంచి అనుకుంటా, ప్రతి సంవత్సరం హార్డ్ డ్రైవులో సేవ్ చేసుకోటం మొదలుపెట్టా...

ఈవేళ ఎందుకో ఆ పుస్తకాలు తిరగేస్తూ ఉంటే 12వ తరగతి పిల్లలకోసం ప్రచురించిన పాఠ్యపుస్తకంలో వంగర గారి ఈ క్రింది వ్యాసం కనపడింది....కనపడింది కదాని, బొమ్మలు చేసి ఇక్కడ పెడుతున్నా !!


అవును బాబూ మీకోసమే, లేపోతే నా కోసమా! ఎదవ ప్రశ్నలు తమరూనూ ! ...





ఆ పి.డి.ఎఫ్ లో గద్య భాగానికి సంబంధించిన విషయ సూచిక ఇక్కడ చూడవచ్చు...

1 comment:

  1. ‘వంగర’ నేను అభిమానించిన నటులలో ఒకరు. ‘కన్యాశుల్కం’లో ఆయన నటన మరుపురానిది. కాని మన చిత్ర్రపరిశ్రమ వారిని సరిగా గుర్తుంచలేదనిపిస్తుంది. దొంగరాముడులో బడిపంతులు, జగదేకవీరుడులో పాతమంత్రి పాత్రలను (ఇంకా చాలా ఉన్నాయి. వయసుతో పాటు మతిమరుపూ పెరుగుతోంది) మరచిపోలేము. వారిని రచయితగా పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete