Wednesday, November 30, 2011

నిశ్చూతకము - విశ్వనాధ సత్యనారాయణ (1948)

నిశ్చూతకము

రచన: విశ్వనాధ సత్యనారాయణ
పత్రిక: 1948, ఏప్రిల్ 10 న వెలువడిన విజయవాణి వారపత్రిక
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

పిచ్చి విశాఖపట్నానికి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కట్టమంచి, అయ్యదేవర, రాజాజీ, నెహ్రూ

విశాఖపట్నానికి పిచ్చాసుపత్రి ఎట్లాటిదో ఆంధ్ర దేశానికి విశాఖపట్నం అట్లాటిదిట!

అల్లాటి "పిచ్చి" విశాఖపట్నానికి వచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన కట్టమంచి, అయ్యదేవర, రాజాజీ, నెహ్రూ - వారలేమన్నారో చదివి తెలుసుకోండి...మీదే ఆలస్యం

1948, మార్చి 24న వెలువడిన విజయవాణి వారపత్రికలో ఏకలవ్యుడు గారు రాసిన "పిచ్చి" రాతలు ఇక్కడ చూడండి

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, November 28, 2011

జాజితీగ - శ్రీ దాశరథి

జాజితీగ

జాజితీగ జాజితీగ
జాజితీగ
పూయవేమె పూయవేమె
వేగ వేగా
వసంతుడు వచ్చినాడు
వనంలోకి చొచ్చినాడు
చెట్లన్నీ చిగురించి
సింగారం చేసినాయి
కోవెలలూ కూసినాయి
మామిడులూ పూసినాయి
రంగుపూలతో పొదలు
తొంగితొంగి చూచినాయి


-- శ్రీ దాశరథి
-- ఆంధ్రప్రదేశ్ బాలల మహాసభలు సంచిక
-- ఫిబ్రవరి 10 - 13, 1977
-- ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి

Sunday, November 27, 2011

మన సినేమాల్లో స్త్రీ పాత్రలు - అసహజంగానూ , అర్భకంగానూ కనపడట్లా? అని 1954లో ప్రశ్నించిన షావుకారు జానకి

మన సినేమాల్లో స్త్రీ పాత్రలు - అసహజంగానూ , అర్భకంగానూ కనపడట్లా? అని 1954లో ప్రశ్నించిన షావుకారు జానకి

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

PS: ఈ పి.డి.ఎఫ్ లోనే గుర్రమెక్కిన పోలీసు సూపర్నెంటు గారు కూడా ఉన్నారండోయ్

(1954, జమీన్ రైతు పత్రిక నుండి)
(ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)

అనవుడు - నావుడు

అనవుడు - నావుడు
(కథానిక)

రచన: శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి
పత్రిక: మిత్ర, సెప్టెంబరు 1955
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

శ్రీ పాలగుమ్మి పద్మరాజు, శ్రీ ఆరుద్ర - జంట కథానికలు (1955)

ఒక వేసవి రాత్రి - శ్రీ పాలగుమ్మి పద్మరాజు
స్వర్గాదపి - శ్రీ ఆరుద్ర

పత్రిక: మిత్ర , సెప్టెంబరు 1955
క్రెడిత్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఈ జంట కథానికలు ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

ఆంధ్రప్రదేశ్ నాదస్వర, డోలుకళాకారుల చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం .......

అపురూపమైన బోలెడు ఆంధ్రప్రదేశ్ నాదస్వర, డోలు కళాకారుల చిత్రాలతో ఉన్న ఈ పుస్తకం తప్పక కొనుక్కుని బోషాణంలో పదిలపరచుకోవాల్సిన ఆణిముత్యమే

రచన: భూసురపల్లి వెంకటేశ్వర్లు
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

కళాకారుల చిత్రాలు మాత్రమే ఉన్నాయి ఈ పి.డి.ఎఫ్ లో.....ఆయా కళాకారుల వివరాలు ఆ పుస్తకంలో చదువుకోండి...లేదా ఓపిక పడితే ఇక్కడే కొద్దిరోజులాగి చూడవచ్చు...

ఫైలు సుమారు 23 ఎం.బి ...కాబట్టి ఓపిక పట్టండి..........

భవదీయుడు
మాగంటి వంశీ   

ఉత్తిష్ఠ - రావూరి భరద్వాజ (1954)

ఉత్తిష్ఠ

రచన:రావూరి భరద్వాజ
పత్రిక: బృందావని, మే 1954
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ   

Saturday, November 26, 2011

ఆడబ్రతుకే మధురం - కొడవటిగంటి కుటుంబరావు - 1946

ఆడబ్రతుకే మధురం

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: ఆంధ్ర మహిళ , అక్టోబరు 1946
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ    

పొణకా కనకమ్మ చిత్రం

పొణకా కనకమ్మ




ఈ చిత్రం 1946, ఆంధ్ర మహిళ పత్రికలో ప్రచురించబడింది...

‘కనకపుష్యరాగం’ - పొణకా కనకమ్మగారి స్వీయచరిత్ర - నెట్లో ఉన్న ఒక బ్లాగ్ పోష్టు ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ 

శాఫో - గేయనాటిక - బాలాంత్రపు రజనీకాంత రావు (1945)

శాఫో - గేయనాటిక

రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
పత్రిక: ఆంధ్ర మహిళ, అక్టోబర్ 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైట్

రజని గారు ఇలా అంటారు - "ప్రేమకోసం జీవితాన్ని బలియిచ్చిన శాఫో - గ్రీసుదేశపు కవయిత్రి. ఆమె కవితారీతులు, విశ్వజనీనములైన ఉన్నత భావాలు, గ్రీసుదేశపు సాహిత్యానికే కాక ప్రపంచ సాహిత్యానికే అమూల్యాలంకారము చేకూర్చాయి. ఇది ఊహగా అల్లిన ఆమె జీవితగాధ."

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

పరుసవేది - బాలాంత్రపు రజనీకాంతరావు

పరుసవేది
(సంగీత రూపకం)

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
పత్రిక: నాట్యకళ , 1964
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

ఆడియో ఎవరివద్దనైనా ఉంటే పంచుకోవలసినదిగా....

భవదీయుడు
మాగంటి వంశీ

Friday, November 25, 2011

ఆమూల్యమైన నృత్యనాటిక - చండీదాసు - బాలాంత్రపు రజనీకాంతరావు (1945)

చండీదాసు
(నృత్య నాటిక)

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
పత్రిక: ఆంధ్ర మహిళ , 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?


ఆడియో ఎవరివద్దనైనా ఉంటే పంచుకోవలసినదిగా....

చండీదాసు గురించి పరుచూరి శ్రీనివాస్ గారి మాటలు -

"chanDeedaas was recorded by AIR in those days. I think one (mana prEma - Balamurali & Sreerangam Gopalaratnam) or two songs (2nd one probably recorded by Suryakumari) from it were recorded as lalita geetaalu by other artists. In fact, the early plays of Rajani came out as compilation: viSwaveeNa in 1960s.


భవదీయుడు
మాగంటి వంశీ

స్త్రీ జాతిని గురించిన దుష్ప్రచారాలు - కొడవటిగంటి కుటుంబరావు

స్త్రీ జాతిని గురించిన దుష్ప్రచారాలు

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: ఆంధ్ర మహిళ , మార్చి 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ 

ప్రతిష్ఠానం - ఏకాంక నాటిక - కపిల కాశీపతి (1945)

ప్రతిష్ఠానం
(ఏకాంక నాటిక)

రచన: కపిల కాశీపతి
పత్రిక: ఆంధ్ర మహిళ , ఏప్రిల్ 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ 

Thursday, November 24, 2011

దాంపత్యంలో వ్యత్యాసాలు - కొడవటిగంటి కుటుంబరావు (1945)

దాంపత్యంలో వ్యత్యాసాలు

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: ఆంధ్ర మహిళ , మే 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ 

రాజగురువు (1945 నాటిక) - కపిల కాశీపతి

రాజగురువు (నాటిక)

రచన: కపిల కాశీపతి
పత్రిక: ఆంధ్ర మహిళ , మే 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

లోనికి రాకూడదు - ఆధారం: ఆస్కార్ వైల్డ్ - అనుసరణ: బి.కృష్ణవేణి (1945)

లోనికి రాకూడదు

ఆధారం: ఆస్కార్ వైల్డ్
అనుసరణ: బి.కృష్ణవేణి
పత్రిక: ఆంధ్ర మహిళ , జూన్ 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

ఆడపిల్లల పెళ్లిళ్లు - కొడవటిగంటి కుటుంబరావు

ఆడపిల్లల పెళ్లిళ్లు

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: ఆంధ్ర మహిళ , జులై 1945
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

కళోద్ధరణ - విశ్వనాధ కవిరాజు

కళోద్ధరణ

రచన: విశ్వనాధ కవిరాజు
పత్రిక: నాట్యకళ (డిసెంబరు 1934)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు 

ఎక్కడ

ఇక్కడ...


భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, November 23, 2011

స్త్రీలు - సాంఘిక ప్రవర్తన - కొడవటిగంటి కుటుంబరావు

స్త్రీలు - సాంఘిక ప్రవర్తన

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: ఆంధ్ర మహిళ - నవంబరు 1944
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఇక్కడ
చదువుకోండి

భవదీయుడు
మాగంటి వంశీ

స్త్రీ జీవితంలో ప్రేరణలు - కొడవటిగంటి కుటుంబరావు

స్త్రీ జీవితంలో ప్రేరణలు

రచన: కొడవటిగంటి కుటుంబరావు
పత్రిక: ఆంధ్ర మహిళ - డిసెంబరు 1944
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఇక్కడ చదువుకోండి

భవదీయుడు
మాగంటి వంశీ

దివిసీమ - బాలాంత్రపు రజనీకాంత రావు

దివిసీమ

-- రచన: బాలాంత్రపు రజనీకాంత రావు
-- ఏ.పి.రాష్ట్ర నాటకోత్సవాలు ప్రత్యేక సంచిక (1977)


కన్నడ రాయల కలలో
ఇన్నెలవున విష్ణుదేవుడే కనిపించెన్
మిన్నయగు బాస తెలుగున
నెన్నందగు కృతిని కాంకయిమ్మని యడిగెన్!

అత్తింటి కరిగెడు నల్లుండు కృష్ణలో
ఆతురసన్యాస మందెనిచట
కృష్ణుడాంధ్రునేల విష్ణుడై పాలించె
కడలిగట్టుపై శ్రీకాకుళమున!
గంగాధరుడు నట్టువాంగమ్మొసంగెను
పొరుగుననే కూచిపూడినిచట!
మువ్వల్ల మ్రోతల మురిపించు గోపాలు
డప్సరోభినయాల కలరె నిచట!

మునులు, దేవత, లప్సరలనవరతము
శివపితామహనందీశ శిక్షణవిధి
తరతరమ్ముల వెలయింత్రు భరత కళల
తెలియరే అట్టి దివిసీమ దివ్యసీమ

గణనీయగురులు నారా
యణతీర్థక్షేత్ర సిద్ధయతివర్యులు, జా
యన సేనానియు జన్మిం
చిన దివిసీమ అల దివ్యసీమ యనదగున్!
ఏమా అభినయచాతురి
ఏమా లాస్యప్రశస్తి, ఎంతటి పాటో!
ఏమా రసపోషణ! దివి
సీమను పొగడదగు దివ్యసీమయటంచున్!

మంచి నాటకం , మంచి సమాజం - రావూరు వెంకట సత్యనారాయణ రావు(1963)

మంచి నాటకం , మంచి సమాజం - రావూరు వెంకట సత్యనారాయణ రావు(1963)

రచన: రావూరు వెంకట సత్యనారాయణ రావు
పత్రిక: నాట్యకళ ( 1963 )
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ
 
ఇక్కడ...

భవదీయుడు
మాగంటి వంశీ

మన సంగీతం - మంచాళ జగన్నాధ రావు (1963)

మన సంగీతం - మంచాళ జగన్నాధ రావు (1963)

రచన: మంచాళ జగన్నాధ రావు
పత్రిక: నాట్యకళ ( 1963 )
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు


ఎక్కడ
 
ఇక్కడ...

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, November 22, 2011

ఏక్ కడీ మునిమనమడు ఛకడీ - దుకడీ, తీన్ కడీ, పాంచ్ కడీ?? - చక్రపాణి

యుగాంతరం

అనువాద రచన: చక్రపాణి
పత్రిక: ఆంధ్ర మహిళ - ఆగష్టు 1944
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఏక్ కడీ మునిమనమడు, దుకడీ మనుమడూ, తీన్ కడీ పుత్రుడూ అయిన పాంచ్ కడీ పోద్దార్ తన పుత్రుడైన ఛకడీ విషయమై చిక్కులో పడ్డాడు. 

ఏమిటా చిక్కు? ఏమా విషయం?

ఇక్కడ చదువుకోండి

భవదీయుడు
మాగంటి వంశీ

కళాపరిషత్తు కర్తవ్యం - కపిల కాశీపతి

కళాపరిషత్తు కర్తవ్యం

రచన: కపిల కాశీపతి
పత్రిక: నాట్యకళ
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ

ఇక్కడ...


భవదీయుడు
మాగంటి వంశీ

లలిత సంగీతం - నేటి పోకడలు - వింజమూరి లక్ష్మి (1963)

లలిత సంగీతం - నేటి పోకడలు - వింజమూరి లక్ష్మి (1963)

రచన: వింజమూరి లక్ష్మి
పత్రిక: నాట్యకళ ( 1963 )
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ
 
ఇక్కడ...

భవదీయుడు
మాగంటి వంశీ

జ్యోతిరైక్యం - సంగీత రూపకం - బాలాంత్రపు రజనీకాంతరావు

జ్యోతిరైక్యం - సంగీత రూపకం

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు 
పత్రిక: నాట్యకళ ( 1963 )
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ
 
ఇక్కడ...


ఆడియో ఎవరివద్దైనా ఉంటే పంచుకోవలసిందిగా.....

భవదీయుడు
మాగంటి వంశీ

సంబంధాలు - మాయల మరాఠీ గోవిందరాజుల సుబ్బారావు

సంబంధాలు

రచన: గోవిందరాజుల సుబ్బారావు
పత్రిక: నాట్యకళ (డిసెంబరు 1934)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ

ఇక్కడ...


భవదీయుడు
మాగంటి వంశీ

ఆచార్యులవారి హిరణ్యకశిపుడు

ఆచార్యులవారి హిరణ్యకశిపుడు

రచన: సముద్రాల రాఘవాచార్యపత్రిక: నాట్యకళ (డిసెంబరు 1934)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ

ఇక్కడ...

భవదీయుడు
మాగంటి వంశీ

Monday, November 21, 2011

నలవేషం - గూడవల్లి రామబ్రహ్మం

నలవేషం

రచన: గూడవల్లి రామబ్రహ్మం
పత్రిక: నాట్యకళ (డిసెంబరు 1934)
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ

ఇక్కడ...


భవదీయుడు
మాగంటి వంశీ

Friday, November 18, 2011

తెనుగు తల్లి - తెనుగు తండ్రి - తెనుగు పాప!!

 నేటికి

-- శివరామం

(1938, ప్రతిభ  పత్రిక నుండి)


మృడాని కంఠో
ద్ధృత హూంకారం
తెనుగు తల్లి తీ
యని యెలుగులకా!

హరు ఫాలాక్షి
స్ఫుర దగ్ని కణం
తెనుగు తండ్రి చ
ల్లని చూపులకా!

భూత పిశాచ
ప్రేత తాండవం
తెనుగు పాప చ
క్కని నడకలకా!

కళలు కవితలూ
కలకల్లాడే
తెలుగు నాటికా
ప్రళయం నేటికి!



nETiki

-- SivarAmam

(1938, pratibha  patrika nunDi)


mRDAni kanThO
dDHRta hUnkAram
tenugu talli tI
yani yelugulakA!

haru phAlAkshi
spHura dagni kaNam
tenugu tanDri ca
llani cUpulakA!

bhUta piSAca
prEta tAndavam
tenugu pApa ca
kkani naDakalakA!

kaLalu kavitalU
kalakallADE
telugu nATikA
praLayam nETiki!

చెత్తాచెదారం, దుమ్ముదుమారం, ఉత్థ ఉలారం, గాజుమలారం!!! - సొంతడబ్బా

సొంతడబ్బా

- పైడిపాటి సుబ్బరామశాస్త్రి

(ప్రతిభ పత్రిక , 1941)


చెత్తాచెదారం
దుమ్ముదుమారం
ఉత్థ ఉలారం
భోరుభోరునా
హోరెత్తిస్తూ -
గలగలగలగల
గాజుమలారం,
చెవులో చిటెళ్లు
ఫెఠిళ్లుమంటూ -
కంకరరాళ్లూ
ఖాళీడబ్బా,
డబడబడబడబ
లాడిస్తూ -

ఉప్పర మెగనే
డప్పులమోతా,
టుపటుపటుపటుప
మోగిస్తూ -
కీచురాళ్లతో
పేచీపడుతూ
గింగురుగింగురు
యీలలువేస్తూ -

ఢాంఢాంఢాంఢాం
రాండోల్మోతా
ట్రట్టర్ ట్రట్టర్
నగారదెబ్బా,
చెవులో డ్రమ్మును
బ్రద్దలు చేస్తూ -

ఒక్కమినిట్టూ
ఊపిరిసలపక,
చుడుగుడుగుడుగుడు
గుడుగుడుగుడుగుడు
లాడేస్తున్నావ్ -
దంచేస్తున్నావ్ -
చెక్కేస్తున్నావ్ -
పొడిచేస్తున్నావ్ -

చోటుమార్చినా
ప్లేటుమార్చకా
ఒకటే వూదర
ఒకటే వూదర
పెట్టేస్తున్నావ్
కొట్టేస్తున్నావ్ -

నవ్యం నవ్యం నవ్యం అంటూ
బడబడలాడే
పదజాలంతో
లోకంకళ్లూ
కప్పేస్తావ్?
వేడివేడిబల్
పెసరట్టంటూ
తీసిన అట్టే
తిరగేస్తావ్?
అయితే కానీ,
అట్లే కానీ,
వూకనే దంచూ
ఊదుతూవుంటా


మాటోయి - మాటా
మనలో - మాటే
ఏమన్నారో
విన్నావా - ?
వినవు నువ్వూ
వినవ్ నువ్వూ
ఇదే ! మరి
నీదగ్గర
నీమోతలో
నీకే వినపడదూ !
-- నీకూ
పైన పటారం
లోన లొటారం - ట ||
పాదరసం ఫేడై పోయీ
రూపాఇ రూపూ రూపరిపోయీ
అర్ధణాకాసే అసహ్యంగా
అగపడుతోందిట! అగపడుతోందిట!
నువ్వేంచేస్తావ్?
నేనేం చేస్తా __ ?
ఊ _ చూశావా _ అంట
ఎల్లా -
ధుమా పేలిపోయి
మజా మాడిపోయి
వీలు చెడి
ఎత్తుతప్పి
అసాధ్యంలో

డు
తోం
దో ||

(ఇది ఏ ఒక్కర్నీ ఉద్దేశించింది కాదు.)



****************************************
చివర బ్రాకెట్లోఉన్నది కూడా "సొంతడబ్బా" లోదేనండోయి....
ఇలాగన్నారంటే ఖచ్చితంగా ఒకళ్లని ఉద్దేశించిందే! :)
ఆ ఒకరు ఎవరనేది తెలిస్తే ఇక్కడో కామెంటు కొట్టండి...

Thursday, November 17, 2011

జరుక్ శాస్త్రి గారి "మా బాపిరాజు" గేయం - 1937

జరుక్ శాస్త్రి గారి "మా బాపిరాజు" గేయం - 1937

మా బాపిరాజు

-- శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి
(ప్రతిభ నవ్య సాహిత్య పరిషత్పత్రిక, 1937)


తెలుగువనముకు దోహదములన్
దీప్తి నిచ్చిన ఘనుడ వయ్యా....
పొసగగా కవనమ్ము శిల్పము
పోహళించితివి!

అందాలు చిందినవి పొంకాలు కుదిరినవి
కాళ్లగజ్జలు ఘల్లుఘల్లు మంటున్నాయి
లాస్యాలు ఆగినవి ఆస్యప్రభలు విచ్చి
ఆనంద మందుతూన్నది సరస్వతిదేవి !

మాకు...
అలరవీంద్రుడ వీవె అవనీంద్రుడవు నీవె
పట్టినదెల్ల బంగారమ్ము చేయగా
నీ బొనవ్రేలిచ్చు నెరచూర లందుకొని
కవనమూ శిల్పమూ గజ్జ కట్టినవి!

మీరు
ఒరులగొప్పను మెచ్చుకోలేని తెలుగుల్లో
చెయిజారి పడ్డారు శీర్ణమతులైనారు!
నాబాపిరాజ! ఓహో పాపఱేడ!
నాబాపిరాజ! ఓహో పాపఱేడ!

వేయితల లందుకోరాని భావమరీచి
క్షణములోపల మీకు కరతలామలకమే!
పాటల్లో కథలలో చిత్రాల్లో గోష్ఠిలో
నాగసర మూది నాతలపాము నాడించి

ఎదొమచ్చుజల్లి నాడెందమ్మును హరించి
దానితో నొకకొత్త సృష్టి చేతురు మీరు!

మీహృదంతర మొక్క "ఏఫీసనే" యౌను
జ్ఞానప్రసూనాంబ ఉపాస్యమ్మెకా!

రసస్రష్టలు మీరు రసపిపాసిని నేను
నాబాపిరాజ! ఓహో పాపఱేడ!

తెలుగువనముకు దోహదములన్
దీప్తి నిచ్చిన ఘనుడ వయ్యా....
పొసగగా కవనమ్ము శిల్పము
పోహళించితివి!

ఇవి చిరంజీవి పాటలుట. ఎప్పుడన్నా విన్నావా?

నాయనా - ఇవి చిరంజీవి పాటలుట. ఎప్పుడన్నా విన్నావా? చదివావా?

ఇవేమి పాటలో / గేయాలో, పుట్టుపూర్వోత్తరాలేమన్నా తెలిస్తే వివరించండి స్వాములూ. ఊరు పేరు లేదు, ఒక్క చిరంజీవి పాటలు అన్న పేరు తప్ప. 

దారుణంగా ఉన్నాయి - విశ్వనాధ అధ్యక్షులుగా ఉన్న పత్రికలో ఇలాటి పాటలెలా ప్రచురించబడ్డాయో తెలియరాలేదు.....

ఇప్పుడే అనుకుంటే  అప్పుడు కూడా ఉన్నయ్యన్నమాట, ఇలాటివి...హర హర మహాదేవా!



జై చిరంజీవ!


****************************************


చిరంజీవి పాటలు

- గేయాలు
(ప్రతిభ పత్రిక, 1941)


1.

పాత పాటే
పాడుకోనా
నీ తలంపే
వీడుకోనా ||

గొంతులోనే
కూలిపోనా
గుండెలోనే
మండిపోనా || ,, ||


నీటిలోనీ
నీడలోనే
మేడచేసీ
ఆడుకోనా  || ,, ||


2.

కొండమీదే
వుండి నవ్వే
చిన్ని చుక్కా
చెప్పవా నా
కెవరవో నీ
వెవరవో ||

చీకటంతా
చీల్చిపాడే
చిన్నిగొంతా
చెప్పవా నా
కెవరవో నీ
వెవరవో  ||


వాసనలతో
వచ్చిపిలిచే
చిన్నిపూవా
చెప్పవా నా
కెవరవో నీ
వెవరవో  ||


3.

నిదుర బరువులు నన్ను
వదులుటేనాడో
నీవు నామ్రోలనే
నిలుచుటేనాడో ||

కొండపై సూరేడు
కొలువు తీరిచెనంట
కొలనులోపల తామ
రలు పూచెనంట  || ,, ||


పగలుపోయెను రేయి
వచ్చినది యన్నారు
రేయిం బవలు లేక
రీతియే నాకు     || ,, ||

కనులనిండా నాకు
కారుచీకటులేన
నీవె చీకటివోలె
నిలిచినావేమొ    || ,, ||


4.

అతడు -

బంగారు సంకెళ్ల
బందీని నేను

ఆమె -

బంది గొంతుకలోని
పైడిగంటను నేను


అతడు -

పైడిసంకెలమ్రోత


ఆమె -

పైడిగంటలమ్రోత


అతడు - ఆమె

తాండవేశ్వరపాద
తాళనాదమ్ములో


అతడు -

కరిగిపోయేనా


ఆమె -

కలిసి బ్రతికేనా




5.

నీవు లేవని యందునా
నాతోటి
రావులె మ్మనుకొందునా  ||

నాచుట్టు నానీడలే
నవ్వుతూ
నడువ వేమని యడిగితే  ||,,||

దిక్కులన్నీ జాలిగా
ఒక్కతెవె
ఎక్కడికి పోదువంటే     ||,,||

మొండిరాయై గుళ్లలో
నీస్వామి
వుండెనని లోక మంటే    ||,,||



6.

నాకు భయమేస్తోందినాన్నా
ఏదో
నల్లనల్లని నీడ
నావైపు నడిచింది
నాకు భయమేస్తోందినాన్నా ||


నాచేయి వదలకే నాన్నా
నువ్వు
నాచేయి వదిలితే
నడిచివస్తదినీడ
నాచేయి వదలకే నాన్నా ||


నన్ను చూస్తూ నడువు నాన్నా
నన్ను
నీవు చూడకపోతె
నీడలు పిలుస్తాయి
నన్ను చూస్తూ నడువు నాన్నా ||



7.

న న్నెరుగరా నాకు
నేలంతకడుపు
నేలంతకడుపులో
మబ్బంత ఆకలి
మబ్బంత ఆకట్లో
మనసంత మంట
మనసంత మంటలో
మండిపోయానే
న న్నెరుగరా మీరు
న న్నెరుగరా ||



8.

నన్ను పాపనుచేసి ఊపుతున్నావా?
మిన్ను కూయెలకట్టి
మన్నునూయెలచేసి
నన్ను పాపనుచేసి ఊపుతున్నావా?



నన్ను నిద్దురపుచ్చి నవ్వుతున్నావా
నానిద్ర రేయిగా
నీనవ్వు పగలుగా
నన్ను నిద్దురపుచ్చి నవ్వుతున్నావా?



కలలలోనే నీవు కానిపిస్తావా
నాకలలు నీడగా
నూకాంతి నీవుగా
కలలలోనే నీవు కానిపిస్తావా

దెయ్యాల పెళ్ళి

దెయ్యాల పెళ్ళి

(గేయ రచన: శ్రీ దేశిరాజు కృష్ణశర్మ)
(ప్రెస్ అకాడెమీ వెబ్సైటు, ప్రతిభ పత్రిక 1938)

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, November 16, 2011

శ్రీ పాలగుమ్మి పద్మరాజు గేయాలు - (1938)

అప్పుడు

(గేయ రచన: శ్రీ పాలగుమ్మి పద్మరాజు)
(1938, ప్రతిభ పత్రిక, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)


పైరుగాలికి నాట్యమాడే
పైటరాపిడి తగిలి చిటుకున
పండిపోయిన దాని మ్మొకటి
పగిలి విచ్చింది
పండు దొండకు సాటివచ్చే
పడతిపెదవులలోన దాగిన
పండ్లముత్తెపుతళుకు లన్నీ
పక్కుమన్నాయి

అప్పుడు నేననుకొన్నాను
అందాని కర్ధం ఇదే నని.

గట్లమీదా పుట్లమీదా
గంతులేస్తూ తిరిగివచ్చిన
కోడెదూడని బాడి అయినా
గోవు నాకింది
దుస్తులంతా దుమ్ముపడినా
దులపకుండా చేరవచ్చిన
కన్నతండ్రిని తల్లి ఎత్తుకు
కౌగిలించింది.

అప్పుడు నేననుకొన్నాను
ఆనంద మంటే ఇదే నని.


తేనెకోసం పూవుపూవుకి
తిరుగుతుండే గండుతుమ్మెద
కాలికంటినపుప్పొ డంతా
పూల కంటింది
పూటపూటకు సేకరించిన
పూరజంతో బరువు లెక్కిన
విరులగుత్తులు పురుడుపోసుకు
పిందె లయినాయి

అప్పుడు నేననుకొన్నాను
అచ్చపు సత్యం ఇదే నని.



*****************************************


మౌనశ్రుతి


(గేయ రచన: శ్రీ పాలగుమ్మి పద్మరాజు)
(1938, ప్రతిభ పత్రిక, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)


చిన్నశంఖంలోన చిక్కువడినట్టుగా
ఆమెగొంతుకలోన అంబుధులుమూల్గినవి
దీర్ఘమౌ మౌనగీతికలరాగాలతో
మారుమ్రోగినవి నామనసులోగుహలు.

ఆమెహృదయంలోన ఆచికొన్న వలపులు
కనులతళతళలో మినుకుమని మెరసినవి
అంధకిరణాలతో ఆక్రమించినది ఆ
కనుబడని వెలుగు నామనసులోగుహల.

ఆమెతనువునపులక లఖిలదిక్కోణాల
గాలికెరటాలపై కదలివ్యాపించినవి
మూలమూలల నొదిగి మురిగిపోయినగాలి
మారుపులకించె నామనసులోగుహల.

చిన్నశంఖంలోన చిక్కువడినట్టుగా
ఆమెగొంతుకలోన అంబుధులుమూల్గినవి
దీర్ఘమౌ మౌనగీతికలరాగాలతో
మారుమ్రోగినవి నామనసులోగుహలు.



****************************************


చిత్రరచన

(గేయ రచన: శ్రీ పాలగుమ్మి పద్మరాజు)
(1938, ప్రతిభ పత్రిక, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి)



ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
చిన్నపిల్లల బొమ్మరిళ్ళలో నాజూకూ
చిట్టిపాపల తప్పటడుగులవయ్యారం
చిరుతపలుకుల ముద్దులొలికే మైమరపూ.

ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
చిలిపికజ్జాలనీ, వలపుకన్నీటినీ,
ఎడబాటువగలనీ, కడకంటిఎరుపునీ,
మరలకలయికలనీ, కరగుహృదయాలనీ.

ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
ముడతలుపడ్డదేహంలోపల
ముక్కిపోయినమనసులూ
తేనెలెతీపిని చే దనితోసే
తిక్కలెక్కినజిహ్వలూ
ఆయాసంతో అలసట చెందీ
అదే వాగే నాల్కలూ.

ఏమి వ్రాస్తున్నావు చిత్రకారా?
ఏడుపులూ నవ్వులూ ఏకంగా జేసేసి
ఈజీవితపు కష్టసౌఖ్యాలనీడల్ని
ఏడురంగుల్లోకి అనువదిస్తున్నాను.

ఇదే విషయమ్మీద అఫ్సర్ గారి బ్లాగులో, కొత్తపాళీ గారి బ్లాగులో ఆవేశ రూపం కాకపోయినా, అంతోటి రూపమే చూపించాల్సి వచ్చింది ఓ సారి!!

అచటనేయుండు

-- దేశిరాజు కృష్ణశర్మ
(1938, Pratibha Patrika)
(Credits: Press Academy Website)

పాకుతూ సోలుతూ
పై బడగ దొర్లుతూ
పరితాప పడుతు నే
మరలి వచ్చేదాక
అచటనే యుండు నీ
వచటనే యుండు

కన్నులే కాయలై
గిర్రుగిర్రున తిరుగ
మన సెల్ల అవశమై
మరచి వచ్చేవేళ
మరచి పోబోక నీ
వచటనే యుండు

చక్రాల తిరుగుళ్ళు
చరచు పరపుల దాగి
శల్యమై ప్రాణాలు
చిక్కబట్టుక నేను
సరవి వచ్చేదాక
సాగి పోబోక నీ
వచటనే యుండు

చిన చిన్న దీపాలు
శక్తిరూపాలు
పెద్ద పెద్ద దీపాలు
పెద్ద పాముల్లు
దీపాల వెలుగులో
దేదీప్యమానవై
తేజరిల్లుచు నన్ను
మరచిపోబోక నే
మరలి వచ్చేదాక
అచటనే యుండు

క్రూరములు క్షుభితములు
ఘోరరూపాలలో
కోసి చూచినగాని
గుండెలే లేవయ్య!
చేతనంబును బొంది
జీవములు లేనట్టి
ఈ శవంబుల మధ్య
నే చచ్చుచును బ్రతికి
సరవి వచ్చేదాక
సాగి పోబోక నీ
వచటనే యుండు

ఉదయభానును చూసి
బుద్ధి మంతుడ నౌచు
సాంధ్య చంద్రుని చూచి
చట్టు బుద్ధుల నెరిగి
ప్రొద్దు పొడుపుల జీవ
పుంజమ్ము మేల్కొలిపి
సాంధ్య కాంతులలోన
సమయుచును బ్రతికి నే
సరవి వచ్చేదాక
సాగిపోబోక నీ
వచటనే యుండు

మృదువుగా తరళముగ
వెలిపూల చాలులో
రేకగా క్రొన్నీటి
తరగలో నురుగుపై
కొసరుగా సులువుగా
పై కెగయు విహగ మటు
ఒదిగి ఒదుగుల్లోన
నలిగి నలిగీ నేను
తలక్రిందుగా తిరిగి
అటు తిరిగి ఇటు తిరిగి
పాకుతూ సోలుతూ
పై బడగ దొర్లుతూ
పరితాప పడుతు నే
సరవి వచ్చేదాక
సాగిపోబోక నీ
వచటనే యుండు

ఇటు చూచి అటు చూచి
వెనక ముందుల చూచి
తలకిందుగా చూచి
మనసులో చూపుంచి
ఎలుగెత్తి ఏడ్చుచూ
చేయెత్తి పిలుచుచూ
పుణ్య పాపాలన్ని
మంచి చెడ్డల నెల్ల
నాయేడ్పులో కలిపి
నా చూపులో చూపి
నిను చూచుచూ నేను
పాకుతూ సోలుతూ
పై బడగ దొర్లుతూ
పరితాప పడుతు నే
మరలి వచ్చేదాక
మరచి పోబోక నీ
వచటనే యుండు నీ
వచటనే యుండు!


నాకు బోల్డంత ఆశ్చర్యం వేసేట్టు, ఆనందం కలిగేట్టు - ఓ సంఘటన 1938లోనే జరిగింది....ఏమిటి బాబూ అది?

ఇది ఫుట్ నోట్సున్న కవితకో చక్కని ఉదాహరణ. అసలు కవి ఎందుకు రాసాడు ? ప్రేరణ ఏమిటి - అన్నది పాఠకుడికి చక్కగా అర్థమయ్యి - నచ్చితే మరింత ఆనందించటానికి, నచ్చకపోతే పక్కనపడెయ్యకుండా అర్థం చేసుకోడానికి ఉపయోగపడే పని ఈనాటి మన కవులు ఎందుకు చెయ్యరో నాకైతే అర్థం కాదు కానీ.....

ఇదే విషయమ్మీద అఫ్సర్ గారి బ్లాగులో, కొత్తపాళీ గారి బ్లాగులో ఆవేశ రూపం కాకపోయినా, అంతోటి రూపమే చూపించాల్సి వచ్చింది ఓ సారి... ఆవేశరూపం ఏమిటి నా బొంద....ఊరకే అన్నాలెండి....అది వారికీ తెలుసు ....:) - ....


అర్థమయ్యిందా, ఇప్పుడు మొత్తం కథ?

అదీ సంగతి....

అదంతా సరే కానీ 1938 - ఫుట్ నోట్సేది?

వస్తున్నా - ఇదిగో

[కొండ మీద దేవాలయం. సగంలో భక్తుడు జర్రున కాలు జారిపడ్డాడు. మళ్ళీ ఎక్కడానికి విశ్వప్రయత్నిస్తున్నాడు. జీవిత లక్ష్యమే దేవాలయం. భక్తుడు జీవయాత్రికుడు]

అదండీ....ఇహ ఇప్పుడు ఇది, అనగా - ఈ ఫుట్ నోట్సు దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఓ సారి ఆ పై కవితను చదివి రండి...

1938వ సంవత్సరంలోనే జరగ్గా లేనిది, ఇప్పుడు చెయ్యలేకపోడానికి కారణం ఏమిటి?

నాకైతే కారణం తెలుసు.....మీకు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి...మిగతా అందరికీ తెలుస్తుంది....

"సామిధేని" - "కాగితమే కంపించింది" - శ్రీ శ్రీరంగం నారాయణబాబు

సామిధేని

-- శ్రీ శ్రీరంగం నారాయణబాబు

రక్త పతాకం
శక్తి నాలుక
అగ్ని కిరీటం
ఆకాశమున
మునిమాపు
కేకలు వేస్తూ
పిలిచింది;

కాలం నాగు
వినువీధుల్లో
వెన్నెలపడగ
విప్పింది

శారదరాత్రి
శంకరుఫాలం
బూదిపవిత్రత
బూరా ఊదింది
దేహం వీడి
దేశం వీడవు
దిక్కుల ఉరి
కొయ్యలనుండి
దేశనాయకుల
ప్రాణాలు
మూగగాలులు
మూలుగుతు వీచాయి;

హంతకు చేతిని కత్తులు
వింతహృదయమున భావాలు
శిరసున రతనము
గళమున విషమ్ము
కలమ్ము కొసలో
కాటుక మబ్బులు
కాగితమే కంపించింది
పాటే
గ్రహపాట?

సూరన అడిదాన్ని
తిక్కన ఖడ్గాన్ని
పేలిన బిజాపూరు
ఫిరంగి గుండు
నా గుండె!

(రుధిర జ్యోతి నుండి - ప్రతిభ పత్రిక 1938 సంచిక నుంచి)

Tuesday, November 15, 2011

జెండా! జెండా! జెండా! జెండా! - అంటున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి

జెండా

- దేవులపల్లి కృష్ణశాస్త్రి
(ప్రతిభ, 1936 నవంబరు సంచిక)

పరువంపు మా జెండా!
భారతీయుల జెండా!
గరువంపు గగనమే
ఒరసి యాడెడు జెండా!

నిదురపోయిన జెండా!
నీలి నీడల జెండా!
కొదమ చుక్కల దండ
కొసల మఱచిన జెండా!

సగము సోలిన జెండా!
స్వప్నసీమల జెండా!
సందె వన్నెల నిండ
సాగి ప్రాకిన జెండా!

మేలుకొనిన జెండా!
గాలి దారుల జెండా!
వెలుఁగు పొడుపుకొండ
నిలిచి పిలిచెడు జెండా!

మెరసి పోయెడు జెండా!
మింటి నడిమి జెండా!
తరుణ తరణి కిరణా
భరణము మా జెండా!

మౌఢ్యం - స్వార్ధం - క్రౌర్యం

పురాకృతం
-- శ్రీ పురిపండా అప్పలస్వామి
(ప్రతిభ, 1936 నవంబరు సంచిక)

గౌతమముని ఛిన్నాస్థుల కోసం
కలహించిన నాపూర్వుల మౌఢ్యం

కబళంకోసం భిక్షాపాత్రిక
పగిలించిన మావ్యాసుని స్వార్ధం

తగవుమాలి సీతమ్మ నడవులకు
వెడలించిన మారాముని క్రౌర్యం

బానిసీనిగా
బిచ్చగానిగా
పతితజీవిగా
చేసి నన్నిపుడు
పీడిస్తున్నవి,
కన్నీళ్లారని నానట్టింటను
కరాళ నృత్యం సాగిస్తున్నవి
నరకజ్వాలలు వెలిగిస్తున్నవి!

Monday, November 14, 2011

ఇలాటి ప్రయత్నాలకు తెలుగులో ఇదే మొదటిది అనవచ్చు!! - (1936)

"గృహలక్ష్మీ కంఠాభరణం" - ఈ పుస్తకం గురించి 1936 ప్రతిభ పత్రికలో "గ్రంథ విమర్శనం" శీర్షిక క్రింద ఈ విధంగా రాయబడి ఉన్నది...."గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడ్డ ఏకవర్ణ, త్రివర్ణ చిత్రాలను - బ్లాకులు వృధా పోకుండా - అన్నీ ఏకత్రా సమకూర్చి, సరస, సముచిత, సంగ్రహ వ్యాఖ్యలతో ఈ సంపుటాన్ని తయారు చేశారు. ఇలాటి ప్రయత్నాలకు తెలుగులో ఇదే మొదటిది అనవచ్చు" - అని ఉన్నది...

మరి ఆ మొదటి ప్రయత్నం ఇప్పటి జనాలకు చేరువ కావాలంటే -  ఆ పుస్తకం కాపీ ఎవరివద్దనైనా ఉంటే పంచుకోవలసినదిగా విన్నపం...







ప్రెస్ అకాడెమీ వెబ్సైటులో గృహలక్ష్మి పత్రిక 1929 కాపీ ఉన్నది...అందులో ఒక వర్ణ చిత్రం ఇక్కడ...


Sunday, November 13, 2011

గుమ్మసారి గుమ్మన్నా!! - చాగంటి సోమయాజులు

గుమ్మసారి గుమ్మన్నా
 --- శ్రీ చాగంటి సోమయాజులు

(1945 ప్రతిభ పత్రిక నుండి, ప్రెస్స్ అకాడెమీ వెబ్సైటు సౌజన్యంతో!)


వానపడ్డది వానా
వానంటె వానా?
వరహాల వాన
గొడుగుల్లో
ఉడుపురో !
గుమ్మసారి గుమ్మన్నా !


పదమట్టె పిల్లా
తందానతాన పదం
పండు గల్లె
పడుకుంట
పదమట్టె పిల్లా
గుమ్మసారి గుమ్మన్నా !


అప్పుల్ల పెరిగిపోయి
ఆకాశపు తాళ్ళూ
దెయ్యంలా సింతా
దేవతల్లె సెందురుడు
గుమ్మసారి గుమ్మన్నా !



ఎన్నెలెక్కిందెన్నెలా !
ఎన్నెలంటెన్నెలా?
ఎన్నలాసందమామ
ఎండిలాగెన్నెలా
గుమ్మసారి గుమ్మన్నా !


పండు గల్లె
పడుకుంట
పదమట్టె పిల్లా
గుమ్మసారి గుమ్మన్నా !

పిచ్చా! - అంటున్న విశ్వనాథ వారి ఆప్త మిత్రులు కొడాలి ఆంజనేయులు

పిచ్చా!

శ్రీ కొడాలి ఆంజనేయులు
(విశ్వనాథ వారి ఆప్త మిత్రులు - జంటకవుల్లో ఒకరు)

గణ గణ మోగే
గంటల చప్పుడు
మిధ్యా దైవము
మేలు కొల్పునా!

విప్రులు చదివే
వేదపు పనసలు
రాతి బొమ్మలను
రంజిస్తయ్యా !

భక్తులు చేసే
భజనల మోతకు
శిల కాకుంటే
చెవుడు పుట్టదా !

అతని పేరుతో
అయ్యే హత్యల
కస లత డుంటే
హడిలి పోవడా !

మతము పిచ్చతో
మానవ లోకం
మురుగెత్తించే
మొద్దా దైవం?


(ప్రతిభ పత్రిక - 1937, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి )

కపాల మోక్షం !!

కపాల మోక్షం

-- శ్రీ శ్రీరంగం నారాయణబాబు

వేదసన్నిహితు
ఆదిశంకరుని
తపస్సమాధిని
ఓంకారమ్మే
హుంకరించినది.
చలించినవి
చరాచరమ్ములు
భూతా లుద్రేకించినవి
కాటుక పెట్టిన
నయనేంద్రియమై
కర్మసాక్షియే
చీకటు లురిలాడు.
అభ్ర గంగలో
శుభ్ర వీచికల
హాలహలమ్మే
తల యెత్తింది.
శేషుని ఫణాల
మణుల కాంతులు
వీసర వోయినవి
పూదోటలు లేనే లేవు
వసంతములు రానేరావు
ముల్లోకంబుల
తబిసి మిన్నలు
ముర్మరించినారు
అనంతకోటి
జీవరాసుల
హా హా కారం చేశాయి
హరోం హరాయని
పాహి పాహి యని
ప్రణమిల్లాయి.
ఆర్ద్ర మైనది
ఆ మహామహుని
అంతఃకరణ.
అంతట అక్షులు   విప్పి
ఆకలి ఆకలి అంటూ
భిక్షాపాత్రకు
చేయి చాపినాడు.
ఉగ్రతపస్సున
మ్రగ్గినది.
వేడి కంటికి
సూడిద పెట్టిన
బ్రహ్మకపాలం
పట పట
పళ్ళు కొరికినాడు
నటరాజు;
భూత పిశాచాల్
బొబ్బరిల్లినవి
వందిమాగధులు
వణికారు.
భయపడి బసవడు
రంకె వేసినాడు.
భూలోకమ్మున
తురకల గోరీలందు
క్రైస్తవుల సమాధులలోన
హిందూ శ్మశానవాటుల
కపాలమ్ములు
విక విక నవ్వినవి.
పుణికలు
పులకరించినవి;
కంకాళమ్ములు
ఘల్లున మ్రోగినవి;
స్వేయ్త పర్వతపు
శిఖరాచలముల
కనకభాండమే
కదిలింది.
స్వాహావల్లభు
సువర్ణ గర్భం
సళువరించినది
కళవళించినది.
గంగ వక్షమే
పాల పోటుతో
సింధు గర్భమున
గంగ కడుపులో
లవణ సాగరపు
లోతుల్లో
దాగిన నేత్రాగ్ని
మానవరూపం దాల్చింది.
మన్నే వెలిగించింది,
మిన్నే పొగచూరింది,
మంటల్లోనే పుట్టాడు,
మంటల్లోనే పెరిగాడు,
మంటల్లోనే మడిశాడు.
అగ్ని వీణయై
భుగ్న కంఠమై
భగ్న గీతియై
తారకమంత్రం
పరంజ్యోతిగా
వీరశైవుడు
భారతవీరుని
కపాల మొక్కటి
కపర్ది చేతికి
రివ్వున వాలింది.
కెవ్వున కెకేశాడు
కంఠే కాలుడు,
ఫాల నేత్రమే
స్పందించింది.
అండపిండ
బ్రహ్మాండమ్మంతా
తాండవనృత్యం చేసింది,
ఆనందాశ్రుల నించింది.
శేషుని ఫణాల
మెత్తనిశయ్య
పుడమి
ఒత్తిలిగించింది
ఎడారి పుష్పించింది
ఎందరు పుట్టలేదు
ఇంకెందరు గిట్టలేదు
అందరికీ
లభియిస్తుందా
హాలాహల మంటిన
హస్త స్పర్శ,
పెదవుల చుంబనము,
కపాల మోక్షం,
కపాల మోక్షం!

(రుధిర జ్యోతి నుంచి)
(ప్రతిభ పత్రిక - 1937 సంచిక)
ప్రెస్ అకాడెమీ వెబ్సైట్ నుండి

లకుమాదేవి - శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు - ఆకాశవాణి సంగీత నాటిక

లకుమాదేవి - శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు

శ్రీ భావరాజు వేంకట కృష్ణారావు గారి కథను అనుసరించి "రజని" గారు ఆకాశవాణి కోసం రూపొందించిన సంగీత నాటిక...

ఎక్కడ

ఇక్కడ...

ఆడియో ఉంటే దయచేసి పంచుకోండి స్వామీ...ముందస్తు ధన్యవాదాలతో...

Saturday, November 12, 2011

"రాజకీయాలను ప్రజలనుండి కాపాడే మహనీయుల రాజకీయాలు దిగ్విజయం పొందుగాక" - కొ.కు

"రాజకీయాలను ప్రజలనుండి కాపాడే మహనీయుల రాజకీయాలు దిగ్విజయం పొందుగాక" - అని కొ.కు గారు అనేసారు...ఎక్కడ?


సాహిత్యము - రాజకీయాలు అనే వ్యాసంలో

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

PS: ఇందులోనే ముద్దుకృష్ణ కవిత కూడా ఒకటి చూడవచ్చు....

NOTE: ఈయన (ముద్దుకృష్ణ)  - వైతాళికులు అని ఓహటేసారు - అచ్చేసారు...ఆయనవి కావులెండి, కలగలుపు కాబట్టి ...బతికిపోయాం కానీ, అదొక్కటి మినహా - ఈయన కైతలు ఎప్పుడైనా చదవాలంటే మటుకు నేనోసారి అలా ఓ సారి గొంతులోకి వేళ్ళు దింపుకుని వమనం చేసుకుని, కడుపు ఖాళీగా పెట్టుకుని వచ్చి చదువుతూ ఉంటాను అన్నమాటలో అతిశయోక్తి లేదని విన్నవించుకుంటూ....ముద్దుకృష్ణ అభిమానులు నొచ్చుకుంటే నొచ్చుకున్నారు గాక నాకేటి అని శలవు....

బిచ్చగాళ్ళామండి నారాయణా!!

బిచ్చగాళ్ళామండి నారాయణా, కాశిని
బియ్యం పెట్టించండి నారాయణా
పట్టెడన్నం లేదు నారాయణా! మాకు
కట్ట గుడ్డా లేదు నారాయణా!
కొంప గోడూ లేదు నారాయణా! చింపి
గుడ్డ లిప్పించండి నారాయణా! ఆ
కలికి చస్తున్నాము నారాయణా! మేము
చలికి నొస్తున్నాము నారాయణా!
లేనివాళ్ళమండి నారాయణా! మాకు
లేదనబోకండి నారాయణా!


శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఇంటి ముందు బిచ్చానికి వచ్చిన బిచ్చగాళ్ళు పాడే పాటట ఇది...

ప్రతిభ వారపత్రిక నుండి

Thursday, November 10, 2011

శ్రీ శ్రీ గారి జాబు - జవాబు!!

 శ్రీ శ్రీ గారి జాబు - జవాబు

1969, ప్రగతి సచిత్ర వారపత్రిక  నుండి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు 

ఎక్కడ చదవొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
వంశీ

బ్లాగ్ సోదరీమణులూ - మీకోసం కొన్ని ముగ్గులు సుధామ గారు వేయించారు !!!

సంక్రాంతి, దానితోపాటు ముగ్గుల పోటీ - రెండూ ముందే వచ్చేసినాయి "సుధామ" గారి పుణ్యమాని... :)

బ్లాగ్ సోదరీమణులూ - మీకోసం కొన్ని ముగ్గులు సుధామ గారు "కుమారి" గారి చేత వేయించి తన వ్యాసంలో అచ్చేయించారు...

ఏం ముగ్గులా? ఇవిగో....


చుక్కల ముగ్గు
మామిడాకు ముగ్గు
దిక్సూచి ముగ్గు
కొబ్బరి బొండాల ముగ్గు
పద్మం ముగ్గు
అడ్డాకు ముగ్గు
లక్ష్మీ పాదాల ముగ్గు
అష్టదళ పద్మం ముగ్గు

ఇల్లా బోల్డు బొమ్మలతో  ముగ్గుల నిగ్గులు వివరించారు ...ఇప్పుడు కాదండోయి ....అప్పుడెప్పుడో 1973లో....

ఎక్కడ చూడొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

ప్రగతి సచిత్ర వారపత్రిక 1973, జనవరి 26వ తారీకున వెలువడిన సంక్రాంతి ప్రత్యేక సంచిక నుండి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

"తనతో తాను" - డైరెక్టరు k.విశ్వనాథ్ - (1972)

తనతో తాను - డైరెక్టరు k.విశ్వనాథ్ గారు

ప్రగతి సచిత్ర వారపత్రిక నుండి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమి వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

చిత్రనిర్మాణం గురించి డి.రామానాయుడు గారి వ్యాసం (1972)

చిత్రనిర్మాణం గురించి డి.రామానాయుడు గారి వ్యాసం (1972)
1972 ప్రగతి సచిత్ర వారపత్రిక నుండి
క్రెడిట్స్: ఏ.పి.ప్రెస్ అకాడెమీ వెబ్సైటు


ఇక్కడ చదవండి ....

భవదీయుడు
మాగంటి వంశీ

Wednesday, November 9, 2011

త్రీ ఛీర్స్ టు శ్రీశ్రీ - దాశరథి

త్రీ ఛీర్స్ టు శ్రీశ్రీ
-- దాశరథి

మా తరానికి గురువు శ్రీశ్రీ
మా కలానికి బలము శ్రీశ్రీ

తెల్లని చల్లని మల్లెలతో తృప్తి పడడు శ్రీశ్రీ
జ్వాలలతో మాలలల్లి
జగతి హిమగళాన వేసి
జాగరితం చేస్తాడు శ్రీశ్రీ
శ్రమికజాతి తిరుగుబాటు శ్రీశ్రీ
నిజమైన ప్రబలవోటు శ్రీశ్రీ

పేదల ఆవేశం
విప్లవ పాలాశం
కవితా జలపాతం
నవతా కలగీతం - శ్రీశ్రీ

శ్రీశ్రీ మానాల్కలపై మంత్రం
శ్రీశ్రీ అగ్నిగీత మాలపించు జంత్రం
కృత్రిమ మెరుగనివాడు
కుట్రలు తెలియనివాడు
ద్వేషం రోషం కావేషం
భేషజన్మ్ లేనివాడు
పతితులకై భ్రష్టులకై
పదం పాడినాడు
కర్షకులకు జలధరమి
వర్షించినాడు
చెత్త దారి విడిచినాడు
కొత్తదారి నడిచినాడు
విప్లవ కవితారీతుల
విత్తనాలు నాటినాడు

అతడు మా పతాక
అతడు మా ప్రతీక
కల్లోలిత హృదయోద్గత
కావ్యాలకు టీక

చందమామలో మచ్చలు
చాలా వున్నాయిగాని
మా శ్రీశ్రీ మనస్సులో
మచ్చలేదు చిచ్చుతప్ప
అమృతమయుడు శ్రీశ్రీ
అమాయకుడు శ్రీశ్రీ
స్నేహశీలి శ్రీశ్రీ
దయాశీలి శ్రీశ్రీ

ఇరువదవ శతాబ్దము
ఇచ్చిన గొప్పవరము శ్రీశ్రీ
సమసమాజ నవసరోజ
పరీమళము శ్రీశ్రీ
త్రీ ఛీర్స్ టు శ్రీశ్రీ




ప్రగతి పత్రిక - శ్రీశ్రీ షష్ట్యబ్ద సంచిక - Feb 6, 1970 నుండి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎస్.పి..బాలసుబ్రహ్మణ్యంగారు భయంకరమైన యాక్సిడెంటుకు గురయ్యారుట....1970ల్లో సంగతిలెండి...

అయ్యో..... అయ్యయ్యో .....

మన ప్రియతమ గాయకులు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు భయంకరమైన యాక్సిడెంటుకు గురయ్యారుట ....1970ల్లో సంగతిలెండి...


భవదీయుడు
మాగంటి వంశీ

PS: ఖంగారు పడకండి బాబూ...అసలే నాకు రక్తపోటు కూడా ఉన్నది...మీరు ఖంగారు పడితే నా రక్తపోటుకు ఏమవుతుందో తెలీని అయోమయంలో ఉన్నా...........

విషయం కోసం పోష్టు కింద దాకా వెళ్ళి రండి ఓ సారి......





ఇది ఈనాటి వార్త అని గుండెలు గుభేలుమన్నాయా? అనుకున్నా.......అనుకున్నా......

ఇది అప్పుడెప్పుడో 1970ల్లో జరిగింది సుబ్బారావూ.... ఆ దేవుడనేవాడు ఉండటం వల్ల, ఆయన అదృష్టం బాగుండటం వల్లానూ........ మన అదృష్టమూ పండిందనే చెప్పొచ్చు....

1972 - ప్రగతి సచిత్ర వారపత్రికలో "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా" అనే వ్యాసంలో వారి ఈ భయంకరమైన అనుభవాన్ని వివరించారు...

క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

అయ్యిందా? ఇప్పుడు మనసు స్థిమితం చేసుకుని 

ఇక్కడ చదవండి ....

భవదీయుడు
మాగంటి వంశీ

Tuesday, November 8, 2011

తమలపాకుతో కొ.కు - తలుపు చెక్కతో ఆరుద్ర!! అహ్హా......

తమలపాకుతో కొ.కు - తలుపు చెక్కతో ఆరుద్ర

ఏమిటీ టైటిలు?

అదా? చెబుతా వినుకో వీరకుమారా తమలపాకు కథను, అహ్హా తలుపుచెక్క కథనూ!!

అనగా అనగా "ప్రగతి" అని సచిత్ర వార పత్రిక ఉండేదిట. ఆ పత్రిక సంపాదకుడైన మద్దుకూరి చంద్రశేఖర రావు గారికి ఏమొచ్చిందో ఏమో - 1969 సంవత్సరంలో ఓ రోజు కొ.కు గారిని "అయ్యా - కె.వి రమణారెడ్డి గారు గిరీశం మీద ఓ వ్యాసం రాసారు...ఇప్పుడు మీరు ఆ గురజాడ గిరీశాన్ని, దాంతో పాటు రమణారెడ్డి గారి రాతలను ఓ పట్టు పట్టాలి" అని బతిమాలో బామాలో ఆయన చేత "గిరీశం పాత్ర" అనే వ్యాసం రాయించారని ఇతిహాసం.

ఇది ఇతిహాసమేనండోయ్......ఇతిహాసమో / పుక్కిట పురాణమో - ఈ రెండిట్లో ఏదో ఒకటండోయి ....నిజమెంతో తెలియదు...నన్ను తప్పు పట్టవద్దు దయచేసి....

అలా కొ.కు గారిచేత రాయించిన వ్యాసం 1969, ఏప్రిల్ 4వ తారీకున ప్రజల్లోకి వచ్చిన పత్రికలో 30వ పేజీలో ప్రచురించబడింది అని ఆ పత్రిక విషయసూచికలో ఉన్నది...

ఇక్కడో అద్భుతమైన వార్త మీ చెవిన వెయ్యాలి....అదేమంటే మనకందుబాటులో, అనగా ఆ ప్రెస్ అకాడెమీ వెబ్సైటులో ఉన్న ఆ ప్రతిలో ఆయొక్క 30వ పేజీ తప్ప అన్నీ ఉన్నాయి....అందువల్ల ఆయన, అనగా కొ.కుగారు నిజంగా గిరీశాన్ని, రమణారెడ్డి గారిని ఏమని పట్టు పట్టారో తెలియరాలేదు...

సరే అది అయిపోయిందా? ఆ తర్వాత వెలువడిన పత్రికా ప్రతుల్లో, అనగా 11 ఏప్రిలున సదరు పత్రిక సంపాదకుడు ఈ గిరీశం వ్యాసం మీద జనాలని "అప్పారావే గిరీశమా" అనే చర్చకు పెట్టినట్టున్నూ, కొ.కు గారి అభిప్రాయ వ్యాసం మీద "సార్కర్" / "పార్కర్" అనే ఆయన తన స్వంత అభిప్రాయం వెల్లడించారనిన్నీ, అందువల్ల ఆ వ్యాసాలన్నీ ప్రచురిస్తున్నామనీ, అలాగే ఇతర రచయితల అభిప్రాయలను ఆహ్వానిస్తున్నామనీ ప్రకటించేసి, మాకు ఆ ప్రచురించే అభిప్రాయాలతో సంబంధం లేదని ఓ స్టేటుమెంటు ఇచ్చి పక్కకు తప్పుకున్నారు....

అల్లా ప్రకటించేసాక, 18వ తారీకున బొల్లిముంత నాగేశ్వర రావు అనే ఆయన రాసిన "గిరీశం ది క్రిటిక్" అనే అభిప్రాయ వ్యాసం ప్రచురించారు...25వ తారీకున చక్రి అనే ఆయన రాసిన "గిరీశం పాత్ర" అనే అభిప్రాయ వ్యాసం ప్రచురిస్తూ దానికి అనుబంధంగా కొ.కు గారు "గిరీశం పాత్ర పై లేఖ" అని సంపాదకులకు రాసిన లేఖ (సారాంశమో ఏమో తెలియరాలేదు) కూడా ప్రచురించారు.

ఆ భాగం ఇక్కడ చూడవచ్చు....

ఆ తర్వాత మే 2వ తారీకున వెలువడిన పత్రికలో "గిరీశం ది డెవిల్" అనే వ్యాసం ఒకటీ, 9వ తారీకున "లేఖ మీద లేఖ" అని ఆరుద్ర గారు రాసిన వ్యాసం ఒకటీ ప్రచురించారు....

ఆ ఆరుద్ర గారి వ్యాసం ఇక్కడ చూడవచ్చు....

ఈ పై రెండు లంకెల్లో ఉన్న వ్యాసాలు చదివేసి రండి ముందు...ఆ తర్వాత ఈ కిందిది చదవొచ్చు


ఇంతకీ కుటుంబరావు గారు తమలపాకుతో గిరీశాన్ని ఏమని తడిమారో తెలియలేదు కానీ, ఆరుద్ర గారు తలుపుచెక్కతో కొ.కు గారిని, గిరీశాన్ని నిమరటానికి చెయ్యవలసిన ప్రయత్నం చేసారేమోనని అనుమానం వచ్చింది....కానీ ఆరుద్ర గారి మొత్తం లేఖ చదివాక ఆ అనుమానం ఆవిరైపోయింది....

ఇవి చదివాక మీ ఆవిరులు, అనుమానాలు పంచుకుంటారేమోనని ఇక్కడ టపా కింద వేసానన్నమాట.

అదొక్క కారణమే కాక ఎవరి వద్దైనా కొ.కు గారి అసలు లేఖ ప్రతి ఉన్నదేమో , ఉంటే పంచుకుంటారేమోనని కూడానూ...అదండీ సంగతి....

ఆక్షేపించేందుకు, కించపరిచేందుకు రాసిన రాతలు కావని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి...

భవదీయుడు
మాగంటి వంశీ

తా.క: ఆ తర్వాత మే 16వ తారీకున "గిరీశంలోని ఫాల్ స్టాఫ్" అని రవిబాబు రాసిన వ్యాసంతో, మే 23వ తారీకున బూజు కర్ర గిరీశం అని కాటూరి రవీంద్ర త్రివిక్రం, మే 30వ తారీకున గిరీశం ఇంగ్లీషు చదువు అని కొత్తపల్లి సుధాబాల రాసిన వ్యాసాలతో  చర్చ ముగిసిపోయినట్టు కనపడుతోంది....

అవునూ - ఇంతకీ ఆ మిగిలిన భాగాలూ, వ్యాసాలు ఎక్కడ ?

ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులో ఉన్నాయి చూసుకోండేం!!

అన్నీ అప్పనంగా ఇస్తే చదివేద్దామనే? కొంచెం మీరు కూడా కష్టపడండి బాబులూ ...

నాకు కొ.కు గారు, ఆరుద్ర గారు ఇష్టమైన వ్యక్తులు కాబట్టి ఈ రెండు ఇక్కడ పోష్టు చేసా...

త్యాగరాజు - ద్వారం వెంకట స్వామి నాయుడు

త్యాగరాజు ప్రతిభ - శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడు
1947, నవోదయ పత్రిక నుండి
క్రెడిట్స్: ఏ.పి.ప్రెస్ అకాడెమీ వెబ్సైటు



ఎక్కడ?

ఇక్కడ

భవదీయుడు
మాగంటి వంశీ

తెలుగు సినిమా పరిశ్రమ - శ్రీ కొడవటిగంటి కుటుంబరావు

"తెలుగు సినిమా పరిశ్రమ" - శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
1947, నవోదయ పత్రిక నుండి
క్రెడిట్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

ఎక్కడ?

ఇక్కడ

ఈ వ్యాసం - తప్పదురా నాయనా ఈయనెవడో మనల్ని వదిలేట్టు లేడు - ఏదో ఒహటి రాసి ఇచ్చేస్తే పోతుంది అని ఓ పది నిముషాలు కూర్చుని , పేపరు మీద బరికేసి ఇచ్చినట్టు కనపడుతోంది నాకైతే!!

మీకేమనిపించిందో చెప్పండి సుబ్బారావు గారు

భవదీయుడు
వంశీ

జో ఫ్రేజియర్ - మహమ్మద్ అలీ - Two Great Champions!! Watch This One....

Two Great Champions Meet.

You can see Ali's Sportsmanship, Sportiveness, Innocence as is the case with the Big Joe - Watch the clip.

Don't take your eyes off the clip from second 16 to second 40. You can see the spark in Ali's eyes. That's what I call a champion's spark.

When you see your opponent (I mean - సమవుజ్జీ) , respect him, adore him, play with him. Where did all that sportsmanship go man? It's a pity! pity! pity!  




మహమ్మద్ అలీ - జో ఫ్రేజియర్


ఛాంపియన్ జో ఫ్రేజియర్ ఈవేళ మరణించాడు.......

May His Soul Rest In Peace

Monday, November 7, 2011

మూర్ఛిల్లే కళాభిమానం - కళాభిమాని - కొడవటిగంటి కుటుంబరావు

"కళాభిమానం" - శ్రీ కొడవటిగంటి కుటుంబరావు
ఆంధ్ర పత్రిక , జనవరి 1950 సంచిక నుండి
ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటు సౌజన్యంతో

కుంటిదైన నాటక కళ కళాభిమానికి చేతికి చిక్కి, ఆ అభిమాని చేతిలో అప్పులు మిగిల్చీ, బికారిని చేసేస్తూ చివరాఖరికి బుర్రలో బల్బు వెలిగించిన దానికి ప్రాయశ్చిత్తంగా నాటక కళామతల్లినే మూర్ఛిల్లేట్టు చేసాడు ఓ కళాభిమాని...ఎలాగనేది ఇక్కడ చదవండి... 

భవదీయుడు
వంశీ

దొరికేసిందయ్యోయ్...దొరికేసింది.....!!

దొరికేసిందయ్యోయ్...దొరికేసింది.....

తెన్నేటి సూరి గారి "ఒరిజినల్" చెంఘిజ్ ఖాన్, ఆన్లైనులో దొరికేసింది...  1950, సెప్టెంబరు 24వ రోజున వెలువడిన ఆంధ్ర పత్రికలో సారస్వతానుబంధం సెక్షన్లో మొదటి భాగం కనపడింది......

ఆన్లైను అన్నావు....ఎక్కడో చెప్పు బాబూ...ఇంతకీ ఎక్కడ కనపడింది?

యెహా...విసిగించకు....చెబుతున్నాగా ....ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటులోనయ్యా....

అది సరే కానీ ఎన్నిసార్లు చదివానో గుర్తుకూడా లేని, అన్నిసార్లు చదివినా , చదివిన ప్రతిసారీ రోమాలు నిక్కబొడుచుకునిపోయి, పుస్తకం ఏకబిగిన పూర్తి చేసేదాక వదలనివ్వని శ్రీ తెన్నేటి సూరిగారి “చెంఘిజ్ ఖాన్” ఒరిజినల్ ప్రింటు బుక్కు నావద్ద ఉన్నదోయి....నీలాటి అర్భకులకు, ఆపైన వివరాలు తెలియని కొంతమంది  అమాయకులకు ఉపయోగపడుతుందేమోనని (ఆ ఆన్లైను వివరాలు ) ఇక్కడ చెబుతున్నా....

ఆ సెప్టెంబరు 24 తారీకు నుండి 7 రోజులు లెక్కేసుకుని ఆ తర్వాత వచ్చే ప్రతి ఆదివారం వెలువడిన "ఆంధ్ర పత్రిక" ఎడిషన్లు తెరుచుకుని, అన్నీ కలుపుకుని ఓ పుస్తకం కింద చేసుకో - చేసుకో - చేసుకో - చేసుకో!!! ఏం?

చేసుకుని ఊరుకోకు....చదువు.....బాగుపడతావు....

అదేదో - ఆ పుస్తకమేదో నువ్వే చేసియ్యకూడదూ?

అన్నీ నేన్జేసిస్తే నువ్వేం చేస్తా? ఎత్తుకెళ్ళి ఎక్కడో పెట్టి నా పెతాపమేనని ఊగుతావా? లేకపోతే అక్కడెక్కడో పెట్టి - ఆ పైన నామమాత్రంగా ఏదో చెప్పాలి కాబట్టి - అజ్ఞాతలిచ్చారని సోది చెబుతావా?

తెలియకడుగుతా కానీ - అజ్ఞాతలు ఇల్లాటివి, ఇవి కాకపోతే అపురూపమైనవి ఆడెవడొ ఊరు పేరు లేనోడు నీకివ్వటమేమిటీ? ఎవడో ఊరు పేరు తెలియనోడు/లేనోడు నీకెందుకిస్తారు?.......

పోనీలే - నీ ఆనందం నీది....అల్లా అజ్ఞాతకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండు! ...అల్లాగైనా నా వెబ్సైటు నుండి ఎత్తుకెళ్ళినదానికి నేనూ ఓ అజ్ఞాతగా చరిత్రలో మిగిలిపోతానేమో చూసుకుంటా....

చరిత్ర బాబూ చరిత్ర - అది ఎక్కడినుంచి చూస్తా నువ్వు?

అనుమానం వచ్చిందా? శుభం....

భవదీయుడు
మాగంటి వంశీ

Sunday, November 6, 2011

దేవులపల్లి - గుహుడు - బాబోయి, నాయనోయి !!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి "గుహుడి కథ" చదివటం మొదలుపెడదామని పి.డి.ఎఫ్ ప్రింటు ముందేసుకుని కూర్చుని మొదటి పేజీ నాలుగు పేరాలు చదవగానే, లాభం లేదురా నాయనా - ఈయన పాటలు, కవితలు రాస్తేనే చదవగలం కానీ - ఇల్లాటివి రాస్తే చదవలేం అనిపించింది......పక్కనపడేసా....

మళ్ళీ సాయంత్రం ఎందుకో అలా కుర్చీ మీద పడేసున్న ఆ కాయితాలు దీనంగా నా వంక చూస్తుంటే సరే మొత్తం చదివేస్తే ఓ పనైపోతుంది, ఈ కథనం సాగిన చిరాకుతో నిద్ర పట్టడానికి బోల్డంత సమయం తీసుకుంటుందేమో అని బుర్రలో ఉన్న బ్రెయిను షంటుతూ ఉన్నా, ఏకబిగిన ఎనిమిది నిముషాల్లో ఆ ఐదు పేజీలు పూర్తిగా చదివి పక్కన పెట్టా....

ఆతర్వాత ఏమయ్యింది బాబూ?

ఇంతకీ నిద్ర పట్టిందా లేదా? మాకు ఇక్కడ రక్తపోటు పెరుగుతోంది...చెప్పు !!

అది తర్వాత చెబుతా....

ముందు - మీరు ఇది చదివి మీ అభిప్రాయం చెప్పండి

ఆలిండియా రేడియో వారి సౌజన్యంతో అని ఉన్నది.....మరి ఆయన 1950లో చదివిన ప్రసంగ పాఠమో ఏమో తెలియరాలేదు....ఒకవేళ ఎవరివద్దైనా ఆ ఆడియో ఉంటే పంచుకోండి...ముందస్తు ధన్యవాదాలతో

భవదీయుడు
మాగంటి వంశి

PS:
Source: Press Academy Website, Kinnera Patrika April 1950

మల్లంపల్లి - మల్లాది - ఆరుద్ర!!

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ - రహస్యాలు వెల్లడించే రాళ్ళు

శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి - దేవగాంధారి

శ్రీ ఆరుద్ర - చాపక్రింది నీరు

ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైట్ - కిన్నెర పత్రిక, 1949 సంచికల నుండి

భవదీయుడు
వంశి

పీఠిక - ఆరుద్ర

ఆరుద్ర గారి రచన - "పీఠిక"
1949, జనవరి - కిన్నెర పత్రికలో ప్రచురితం
Source: Press Academy Website

ఎక్కడ చదవొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
వంశీ

Saturday, November 5, 2011

మీరు "అదే"నని బుర్రలున్నవాళ్ళ నమ్మకం!!

అసురసంధ్య - శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి

ఇది చదివాక "ఆహా ఏం రాశాడురా ఈయన" అనిన్నూ,  "తెలుగులో ఇంత చక్కగా రాయొచ్చా" అనిన్నూ మీకనిపించలేదు అంటే మీరు ఖచ్చితంగా "అదే"నని బుర్రలున్నవాళ్ళ నమ్మకం....

ఇలాటివి బోలెడు రాసాడాయన!

వందనం సరస్వతీ పుత్రా - వందనం, శతకోటి వందనం, సహస్రకోటి వందనం!

1949, March - కిన్నెర పత్రికలో ప్రచురితం
Source: Press Academy Website, Kinnera Patrika 1949

ఎక్కడ చదవొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
వంశీ

అశుభం - విశ్వనాథ

విశ్వనాథుల రచన - "అశుభం"
1949, జనవరి - కిన్నెర పత్రికలో ప్రచురితం

ఎక్కడ చదవొచ్చా?

ఇక్కడ

భవదీయుడు
వంశీ

శ్రీ శ్రీ గారు - చి.కా.బు ??


శ్రీ శ్రీ గారు - చిత్తు కాగితాల బుట్టను, చి.కా.బు అని పిలుస్తూ బుట్టలో వెతుక్కుంటే బోలెడు కథలకు బీజాలు లభిస్తాయనీ, కథ అనే వస్తువుకు సంబంధించి తన అభిప్రాయాలని ఎంత చక్కనైన మాటల్లో పేర్చుకొచ్చారో   అనామిక "స్కెచ్" లో చదువుకోండి...

Source: Press Academy Website, Kinnera Patrika 1949 

కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశం లేదని విన్నవించుకుంటూ

భవదీయుడు
మాగంటి వంశీ
 

Friday, November 4, 2011

నండూరి వారు హైడ్రోజన్ బాంబు వేసారండీ! తాజ్ మహలూ, ఆశాజీవులను కలుపుకొని

కావ్యజగతిలో హైడ్రోజన్ బాంబుట - తాజ్ మహలూ, ఆశాజీవులను కలుపుకొని

1950, మార్చి 19వ తారీకున / April 2 వ తారీకున వెలువడిన ఆంధ్ర పత్రికలో నండూరి రామ్మోహన రావు గారి కవిత??

Source: Press Academy Website



 





భవదీయుడు
వంశీ

పుష్పవిలాపం - పశువిలాపం!!

పుష్పవిలాపం ? - అందరికీ తెలిసిందే!!
పశువిలాపం ? - ఎందరికి తెలిసిందో!!

తెలియనివారి కోసం -- "ఆంధ్రపత్రిక" - 1950 సంవత్సరం, ఫిబ్రవరి 12 వ తారీకున వెలువడిన పత్రికలో శ్రీ వేదాంత కవిగారు - ఆ పశువుల బాధ చూడలేక వాటి గోడు మన భాషలో, మనుషుల భాషలో  వివరించారు.....

ఎందుకా?

ఏమో? చదివి చూడండి మీకే తెలుస్తుంది....

ఈ పశువిలాపాన్ని ఘంటసాల మాష్టారు పుష్పవిలాపం పాడినంత శ్రావ్యంగా, ఎవరిచేతన్నా పాడిస్తే బాగుంటుందన్న ఆలోచన మీకొచ్చిందా? శుభం...మీకిఉ తిరుగులేదు.....

పశువుల గోడు ఓండ్ర పెడుతూ పాడితే బాగుంటుంది అన్న ఆలోచనేమన్నా మీకొచ్చిందా? ఇంకా శుభం....

"ఆలస్యమేన కుడితే (*) పాయసం!"

(*) - కుడితి




  
Source: Press Academy Website

కథనం చూసి, ఇది నండూరి రామ్మోహనరావు గారు రాసిన కథేనా అని ???

నండూరి రామ్మోహన రావుగారి "భూలోక స్వర్గం"
1950, జనవరి మాసంలో మూడు భాగాలుగా, వరుస ఆదివారాలు - ఆంధ్రపత్రికలో ప్రచురితం
Source / Courtesy: Press Academy Website

ఎక్కడ చదవవచ్చా?

ఇక్కడ

అక్షరాలు సరిగ్గా కనపడాలంటే పి.డి.ఎఫ్ లోని పేజిలను "జూం" చేసి చదువుకోండి...

కథనం చూసి, అసలు ఇది ఆయన రాసిన కథేనా అని ఒక భీకరమైన అనుమానం వచ్చింది....... కానీ......???.... :) :)


భవదీయుడు
వంశీ

Thursday, November 3, 2011

గురవే నమః - చెళ్ళపిళ్ళ వారు - విశ్వనాథ వారి సంతాపం

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు స్వర్గస్తులైనప్పుడు విశ్వనాథ వారు - తమ గురువుగారి గురించి చెప్పిన మాటలు....

(ఫిబ్రవరి 19, 1950) ఆంధ్ర పత్రికలో ప్రచురితం
ప్రెస్ అకాడెమీ వారి వెబ్సైటు నుండి






Wednesday, November 2, 2011

"స్థానం వారి స్థానం" - "మాయాబజార్" శాస్త్రి గారి వ్యాసం !

వంగర వెంకట సుబ్బయ్య గారంటే ఈనాటి ప్రజలకు చాలా మందికి తెలియకపోవచ్చు. అలాటివారికి మాయాబజారు సినిమాలో శర్మ శాస్త్రి ద్వయాన్ని గుర్తుచేస్తే చప్పున కళ్ళ ముందుకొచ్చేస్తారు.......ఆయన - నేను విపరీతంగా అభిమానించే "అభిమాన నటుల్లో" ఒకరు...

వారి మీద 2008లో శాక్రమెంటో రేడియో స్టేషన్లో ఒక కార్యక్రమం సమర్పించాను కూడా.....ఆ ప్రోగ్రాము ఇక్కడ వినవచ్చు.....

ఆయన "స్థానం వారి స్థానం" అని ఒక పుస్తకం రాసారని ఈరోజు తెలిసింది.

ఎలా తెలిసిందా?

దానికో కథ చెప్పాలి...ఇంతకుముందు అప్పుడెప్పుడో పిల్లలకథలు సైటులో పెడుతున్నప్పుడు వేసిన టపాల్లో, ఒక టపాలో ఒక సంగతి చెప్పడం జరిగింది.....తమిళనాడు గవర్నమెంటు వారు పిల్లల పాఠ్య పుస్తకాలు ఆన్ లైనులో పెట్టిపారేసి సుళువుగానూ, అందుబాటులోనూ పెట్టేసారు....ఎల్.కె.జి నుంచి 12వ తరగతి దాకా....అందులో తెలుగుకు సంబంధించిన పుస్తకాలు, తెలుగులో బోధించే పుస్తకాలు - పి.డి.ఎఫ్ ఫార్మాట్ లో ఉండేవి...

అవి , అనగా ఆ పి.డి.ఎఫ్ లు 2007-2008 ప్రాంతాలనుంచి అనుకుంటా, ప్రతి సంవత్సరం హార్డ్ డ్రైవులో సేవ్ చేసుకోటం మొదలుపెట్టా...

ఈవేళ ఎందుకో ఆ పుస్తకాలు తిరగేస్తూ ఉంటే 12వ తరగతి పిల్లలకోసం ప్రచురించిన పాఠ్యపుస్తకంలో వంగర గారి ఈ క్రింది వ్యాసం కనపడింది....కనపడింది కదాని, బొమ్మలు చేసి ఇక్కడ పెడుతున్నా !!


అవును బాబూ మీకోసమే, లేపోతే నా కోసమా! ఎదవ ప్రశ్నలు తమరూనూ ! ...





ఆ పి.డి.ఎఫ్ లో గద్య భాగానికి సంబంధించిన విషయ సూచిక ఇక్కడ చూడవచ్చు...

ఆంధ్రదేశ ప్రముఖుల చిత్రాలు కొన్ని!!

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి


శ్రీ ధూళిపాళ

శ్రీ జానుమద్ది హనుమఛ్ఛాస్త్రి 



శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు


శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ

శ్రీ పావులూరి శంకరనారాయణ
(ప్రప్రథమ ఆంగ్ల - ఆంధ్ర నిఘంటు నిర్మాత )
(వీరి నిఘంటువు ఆంధ్రభారతి సైటులో చూడవచ్చు)

 శ్రీ పీసపాటి లక్ష్మీ నరసింహ మూర్తి
తెలుగు నాటక రంగంలో అద్వితీయమైన స్థానం వీరిది 



Courtesy / Source: Various Books From Press Academy Website

Tuesday, November 1, 2011

Barn On A Ranch.... Eh? Barn Again - Oh yeah !! Love it....

Barn On A Ranch.... Eh?

Barn Again? - Oh yeah !! Love it....

Canvas: 14 X 11 Stretched
Time: 56 Minutes
Level Of Happiness With The Painting: Happy

Acrylic Colors:
Nutmeg Brown / Burnt Umber / Raw Siena / Crimson / Pool Blue / Lime Green/ Titanium White