Wednesday, October 19, 2011

జేమ్స్ జాయిస్ రచనకు శ్రీశ్రీ ఇమిటేషన్ - ???????

ఈ కింద ఇచ్చిన ప్రేమ గీతం శ్రీ శ్రీ గారి రచన అట. అందులోనూ ఇంకొకాయన - జేమ్స్ జాయిస్ - రచనకు ఇమిటేషనట...

ఇది చదివింతర్వాత బోల్డు ప్రశ్నలొచ్చేసినాయి బుర్రలోకి....

జేమ్స్ జాయిస్ "లవ్ సాంగ్" అనే గీతం రాసుండొచ్చు, కానీ దాని కాపీ నెట్టులో ఎక్కడా దొరకలా...

జరుక్ శాస్త్రి - శ్రీ శ్రీని ఆడుకున్నట్టు, శ్రీ శ్రీ జేమ్స్ జాయిస్ ను ఆడుకోటానికి వెటకారంగా రాసారనుకోవచ్చునేమో కూడా తెలియలా...

ఏమయ్యా, తెలీకడుగుతా - అలా అనుకోడానికి ఒక అర్థం పర్థం ఉండక్కరలా - అనేగా మీ ప్రశ్న ?

అవును జరుక్, శ్రీ శ్రీ తెలుగువారు - కాబట్టి వాళ్ళు ఒకళ్ల రాతల మీద ఒకళ్లు పడి కొట్టుకున్నారంటే అర్థం ఉంది, మరి జేమ్స్ జాయిస్ తెలుగు వాడు కాదుగా?

అబ్బా భలే పాయింటు పట్టావే?

సరే కానీ ఈ కింద ఇమిటేషను చదువుకో...చదువుకుని ఎక్కడైనా ఆ జేమ్స్ జాయిస్ మూలం దొరికితే ఇక్కడ కామెంటు రూపంలో తీసుకొచ్చి పడెయ్యి...బోల్డు ఋణపడి ఉంటా...


భవదీయుడు

వంశి


*******************************

ప్రేమ గీతం

(జేమ్స్ జాయిస్ రచనకు శ్రీశ్రీ ఇమిటేషన్)
(మూలం/సౌజన్యం: "ఢంకా" పత్రిక - 1945)


ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది
ప్రేమ ప్రేమను ప్రేమగా
ప్రేమిస్తుంది
ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది
నర్సు కొత్త డాక్టరును ప్రేమిస్తుంది
14 నం. కనిస్టీబు మేరీ కెల్లీని ప్రేమిస్తాడు
నాయకులు నాయికలను ప్రేమిస్తారు
మనవాళ్లయ్య వాళ్ల వాళ్లమ్మను ప్రేమిస్తాడు
సరోజాబాయి సైకిలు మీద వచ్చిన కుర్రాణ్ణి ప్రేమిస్తుంది
వీధి కొసను అమ్మాయి గోడచాటున అబ్బాయిని ప్రేమిస్తుంది
చీచీచీ చీనావాడు చౌచౌచౌ చీనాదాన్ని ప్రేమిస్తాడు
ముసుగు మనిషి చచ్చిపోయిన మనిషిని ప్రేమిస్తుంది
మహిషం మహిషిని ప్రేమిస్తుంది
నువ్వు ఒకానొకర్తెను ప్రేమిస్తావు
ఆ ఒకానొకర్తె ఇంకొకా నొకర్ని ప్రేమిస్తుంది
భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు


*******************************

6 comments:

 1. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది ఇది గమ్యం సినిమాలో మొదటి సారి విని ఎవరు రాసుంటారా అనుకున్నా అయితే ఇది శ్రీ శ్రీ గారి రచనన్నమాట!

  ReplyDelete
 2. మొదటి మూడులైన్లలోనే అన్ని "ప్రేమ"లా. ఆలక ప్రతిలైనుకూ ఒక ప్రేమా. ఏందీ గోల :)

  ReplyDelete
 3. It's not a poem, it's a passage from the 12th chapter of Joyce's novel Ulysses. Original goes like this:


  "Love loves to love love. Nurse loves the new chemist. Constable 14A loves Mary Kelly. Gerty MacDowell loves the boy that has the bicycle. M.B. loves a fair genteman. Li Chi Han lovey up kissy Cha Pu Chow. Jumbo, the elephant, loves Alive, the elephant. Old Mr. Verschoyle with the ear trumpet loves old Mrs. Verschoyle with the turnedin eye. The man in the brown macintosh loves a lady who is dead. His Majesty the King loves her Majesty the Queen. Mrs. Norman W. Tupper loves officer Taylor. You love a certain person. And this person loves that other person because everybody loves somebody but God loves everybody."

  It's just a random paragraph in the novel. I don't think Sri.Sri parodied it. Joyce himself wrote it in a parodic vein.

  ReplyDelete
 4. Aha! Meher - Thanks a million for the note. That clears a lot of air. Yes, I do think and believe that Sri Sri did not write this as a parody. But it will be very interesting to know from any of our literary friends, how ever silly it may sound, the context in which Sri Sri decided to go for it. Oh well, that would be too much to ask for or may be Sri Sri wanted it to be left out for speculation.. :)

  The reason why I say that is he for one, is a kind of person who openly comes out and says - Look, this is why I wrote it....and if I remember right, I should have a list of "contextual" quotes from him explaining the reasons behind some of his writings, of course written out on a old paper from 1950's - 60's. And it is from my father's collection. Now I need to go search for that. Will post it in the blog as soon as I find it....But I for sure can say that this "prEma gItam" was NOT there in that old piece of paper.

  Anyways - thanks again for the note.

  ReplyDelete
 5. శ్రీశ్రీ రాసిన అనువదించిన ఈ గీతం 1945లో కాకుండా 1941 ఫిబ్రవరిలో ‘ఢంకా’లో ప్రచురించారని శ్రీశ్రీ ‘ప్రస్థానత్రయం’ పుస్తకంలో ఉంది!

  మీరు కోట్ చేసిన గీతంలో ‘మహిషం..’ లైనుకు ముందు ఓ వాక్యం మిస్సయింది. అదిలా ఉంటుంది-
  ‘మహారాజు గారు మహారాణి గారిని ప్రేమిస్తారు’

  మరో విషయం!
  జరుక్, శ్రీ శ్రీ కవిత్వాన్ని పేరడీ చేయడాన్ని ‘ఆడుకోవటం’గా తేల్చెయ్యటం సరికాదు. శ్రీశ్రీ కవిత్వంపై ఎంతో ఇష్టం, గౌరవం ఉన్న వ్యక్తి జరుక్. ఆ అభిమానం, ఇష్టం లో భాగమే పేరడీ.
  శ్రీశ్రీ- జరుక్ లు ‘తెలుగువారు - కాబట్టి వాళ్ళు ఒకళ్ల రాతల మీద ఒకళ్లు పడి కొట్టుకున్నారంటే అర్థం ఉంది’.. అనే మీ వ్యాఖ్య సంగతికొస్తే... అలా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకళ్ళ రాతల మీద ఒకళ్ళుపడి ఎప్పుడు కొట్టుకున్నారా అని ఆశ్చర్యం!

  ReplyDelete
 6. 45 ఢంకా దెబ్బకు 41 ఢంకా దెబ్బకు మధ్యలో రాజు గారు, రాణి గారు మిస్సయ్యారన్నమాట....

  భలేవారే ఆ మేరువులను "తేల్చటం", "సరిచెయ్యటం" మీ వల్లా, నావల్లా, "పండిత పుత్రుల" * వల్లా ఏమవుతుందీ? ఆ లైను ఉద్దేశం వేరు....అసలు అర్థం దాని తర్వాతనున్న కొచ్చెను మార్కులో ఉన్నది...అదీ సంగతి... ;)

  * (చుక్క పెట్టినచోట) - అనగా పరమ శుంఠలవల్ల అని అర్థం చేసుకోవాలనీ....

  జరుక్ శాస్త్రి గారికి విశ్వనాథ అంతే ఎంత అభిమానమో - ఒక వ్యాసంలో తెలియచేస్తారు....అది - సైటులో వ్యాసావళి సెక్షన్లో పోష్టు చేసాను, అప్పుడెప్పుడో.....శ్రీ శ్రీ అన్నా అంతే అభిమానమని ఇంకో వ్యాసంలో తెలియచేస్తారు....ఆ వ్యాసం కూడా త్వరలో పబ్లిష్ చేస్తాను.....వేచి చూడాల్సిందే... :)

  ReplyDelete