Saturday, October 15, 2011

బావలతో వేళాకోళం పాటలు!

("బాల" పత్రిక - 1948)

బావలతో వేళాకోళం పాటలు

అ)

అక్కగారి విగ్రహం రాజవిగ్రహం
బావగారి విగ్రహం కాకి విగ్రహం
అక్కగారి భోజనానికి వెండి పళ్ళెము
బావగారి భోజనానికి మంటి పళ్ళెము
అక్కగారి ఆకులు తమలపాకులు
బావగారి ఆకులు జిల్లేడాకులు
అక్కగారి చెక్కలు పోకచెక్కలు
బావగారి చెక్కలు చింతపిక్కలు
అక్కగారి సున్నము వెన్నముద్దలు
బావగారి సున్నము కాకిరెట్టలు
అక్కగారి బట్టలు సిల్కు బట్టలు
బావగారి బట్టలు గోనెసంచులు
 


ఆ) 

భోజనంబైతేను
పెట్టించగలముగాని
మాయాడువారు మంకువారు

మంచినీళ్ళైతేను
ఇప్పించగలముగాని
మా వూరు చెరువులు ఎండిపోయె

తాంబూలమైతేను
ఇప్పించగలముగాని
ఆకు మాత్రమే పోకలేదు

పొగచుట్ట అయితేను
ఇప్పించగలముగాని
పొత్తి మాత్రమే పోర లేదు

దగ్గరలో వున్న మీ వూరు
వెడలిపోయి
భోజనము చేసిరండు బావగారూ

3 comments:

  1. బాగున్నాయండీ! అంత్యంత ప్రసిద్ధమయిన పాట మరిచారే?
    బావా బావా పన్నీరు
    బావని పట్టుకు తన్నేరు
    వీధీ వీధీ తిప్పేరు
    వీసెడు గంధం పూసేరు

    ReplyDelete
  2. chaalaa baagunnaai vamsee gaaru. sampadani bhadraparasthunnaaru. dhanyavaadamulu. telugulo.. ee vyaakhya vraayalenanduku manninchandi.

    ReplyDelete
  3. రసజ్ఞ - మరవలా ! :)

    ప్రసిద్ధం మనకెందుకు? ఇవి కూడా - అప్పుడు, అనగా 1940ల్లో ప్రసిద్ధాలే! కాలం కలిసిరాక చిత్తుకాయితాల్లోకి చేరిపోయినాయి కానీ...

    ReplyDelete