Monday, October 24, 2011

"నా రచనలు దొంగిలిస్తున్న శిష్యబ్రువులు" - శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు

"నా రచనలు దొంగిలిస్తున్న శిష్యబ్రువులు" - శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు

1960 - తెలుగు సంక్రాంతి అనే పత్రికకు గౌరవ సంపాదకత్వం వహించి ఆ పత్రికలో - "కొంతమంది శిష్యులు తన రచనలు దొంగిలించి తమ పేరు వేసుకుని చలామణి చేస్తున్నారని" ప్రకటించిన శ్రీమాన్ పుట్టపర్తి వారు -  ఆ రచనలు, చాటువులు తామే అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసారు....

సరస్వతీపుత్రులకే తప్పలేదన్న మాట ఈ బాధలు....ఆ దొంగలెవరో కూడా ఆ పత్రికా ముఖాన చెప్పేసుంటే పోయేది...ఎందుకనుకున్నారో ఏమో...

ఎక్కడ చదవచ్చా?

ఇక్కడ....

భవదీయుడు
వంశి

3 comments:

 1. బావుందండి (శివకర్ణామృత శ్లోకాలు అర్థం కాకపోయినా :)).

  అగ్నివీణ పేరుతో ఈయన, వీరి శ్రీమతి కలిసి కొన్ని భావకవితలు వ్రాశారు. ఇవి కూడా చాటువులవంటివే అనుకుంటాను. ఎక్కడా ప్రచురింపబడినట్లు తెలియదు. ఇప్పుడు అలభ్యం (అని నా అనుమానం). నా వద్ద ఎలానో ఈ ప్రతి ఒకటి దొరికింది. అందులో ఓ చిన్న కవిత -

  స్మృతి

  "కొండలో,కోనలో
  క్రొందలిరుటాకులో -
  నీ నటనలేతోచు
  నీ మాయలేపూచు -
  మనసులో, తలపులో
  మర్మరధ్వనులలో -
  నీ పాటలేతోచు
  నీ మాటలేపూచు
  రక్తబిందువులలో
  రసిక గీతములలో -
  నీ విభ్రమమె తోచు
  నీ మాయలే పూచు"

  ReplyDelete
 2. రవి - ఆ తెలుగు సంక్రాంతి పత్రికలోనే, వారి శ్రీమతి రచనలు కొన్ని ప్రచురించారు....మిగిలిపోయినవి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాటివి!! వాటి సంగతులు పుట్టపర్తి వారి అమ్మాయిలు, బ్లాగరులు - అనురాధ గారు, నాగపద్మిని గారే మనకు తెలియచెయ్యాలి......

  అగ్నివీణ - పేరు చాలా బాగుంది....

  ఓ రకంగా మీరు అదృష్టవంతులే - ఆ కాపీ ఉన్నందుకు....

  ReplyDelete
 3. మాగంటిగారూ..నమస్సులు.మాగంటిగారూ... మీ బ్లాగ్ లో మా అయ్యగారి గురించి చూచి చాలా ఆనందం కలిగింది. అగ్నివీణ అయ్య, అమ్మ కలిసి వ్రాసిన కావ్యం ఇందులో అయ్యగారి కొన్ని చాటువులు, కవితలు, ఇంకా అమ్మ కవితలూ ఉన్నాయి.. అదేకాక, గాంధీజీ మహాభనిష్క్రమణానికి వారిరువురి బాష్పాంజలి ఉంది.. ఆమ్మకు ఉత్తమ కవయిత్రిగా పురస్కారం తెచ్చి పెట్టింది ఆ కావ్యమే!..అసలు అయ్యగారి రచనలు చాలా వాటికి అమ్మే లిపికారిణి. ఎన్నో జన్మల పుణ్య విశెషం వల్ల వారి కుమార్తెగా జన్మించే భాగ్యం దక్కింది. ఈ భాగ్యానందాన్ని పదుగురితో పంచుకోవాలనే తపన, వారి కొన్ని రచనలను ముద్రించేందుకు నన్ను ప్రేరేపించింది మా అయ్యగారి ‘మహాభారత విమర్శనము. శివకర్ణామృతము (తెలుగు అనువాదం తో పాటు శివతాండవమూ ఇందులో ఉంది) ఇంకా,, ప్రాకృత వ్యాసాలు, విజయనగర మధుర గాధ, ‘సరస్వతీపుత్రునితో సంభాషణలు,, పేరుతో అయ్యగారి అపురూప పరిచయాలు..ఇలా కొన్ని గ్రంధాలు ప్రచురించాను...
  … సాహితీ మిత్రులకు ఒక విన్నపం.మా అయ్యగారి. లేఖా సాహిత్యం, ఇంకా ఇతర విశెషాలు మీ సేకరణలలో ఉంటే.. నాకు తెలియజేయవలసినదిగా ప్రార్థన. నా. ఈ మైల్
  puttaparthipadmini8@gmail.com ..కి సమాచారం అందివ్వవలసినదిగా విన్నపం.డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని...

  ReplyDelete