Monday, October 24, 2011

పేరు ప్రతిష్టలు బట్టి దగ్గర జేరేవాణ్ణి. కాని వారి ప్రవర్తన, వారి మాటలు బెడిసికొట్టేవి - శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

నేను దర్శించిన పెద్దలు
----శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు

పుట్టపర్తి వారి అభినందన సంచిక నుండి
(3-5-1977 - కడప వివేకానంద ఆడిటోరియంలో జరిగిన అభినందన సభ)

"తెనుగుదేశంలో నన్నాకర్షించినవారు తక్కువ. వారి పేరు ప్రతిష్టలు బట్టి దగ్గర జేరేవాణ్ణి. కాని వారి ప్రవర్తన, వారి మాటలు బెడిసికొట్టేవి" - అని నిర్భయంగా చెప్పిన ఆ మహామహుడికి, సరస్వతీపుత్రుడికీ నమస్సులతో!

నిర్భయంగానే చెప్పినా -  చివరివరకూ చదివితే కాని విషయం అర్థం కాదబ్బాయి

ఎక్కడ చదవొచ్చా? 

ఇక్కడా

భవదీయుడు
వంశి

2 comments:

  1. మాగంటివారూ..మీరు బ్లాగ్ లో ఉంచిన అయ్యగారి రచనల వివరాలన్నీ అయ్య చెబుతుండగా నేను వ్రాసినవి. ఆ రకంగా ఆ సంచిక రూపకల్పనలో నాకూ కాస్త భాగం ఉందన్న సంగతి మీతో పంచుకోవటం ఆనందదాయకం. ఇంకా శారదా కళాశాల విజయవాడ వారు అయ్య గురించి రెందు ప్రత్యేక సంచికలు వేశారు. నృసింహప్రియ వారి ప్రత్యేక సంచిక ఉంది. అయ్యగురించి సాహిత్య ప్రపంచానికి ఇంకా తెలియవలసినది చాలా ఉందని ఒక సాహిత్యాభిమానిగా నా అభిప్రాయం.ఒకటి రెండు భాషల్లో పాండిత్యం సంపాదించగానే 'నేనూ సరస్వతీపుత్రుణ్ణే' అని ప్రకటించుకునే వారిని చూస్తుంటే, అయోమయంలో పడిపోతుంటాను. రాత్రీ, పగలుకు తేడా లేకుండా నిరంతరం సాహితీ తపస్సులో మునిగి ఉండిన అయ్యగారు ఎవరైనా వారి గదిలోకి హఠాత్తుగా వస్తే ఉలిక్కి పడేవారు.అంటే తన పఠనంలో అంతగా నిమగ్నమై ఉండేవారన్నమాట!. పదునాల్గు భాషలలో పాండిత్యం, సంగీత నాట్యాభినివేశం, వ్యాకరణ అలంకార శాస్త్రాల్లో .ప్రగాడ పరిచయం.అపారమైన అభినివేశం, ఇవన్నీ ఆయన నిరంతర సాహితీసమార్చన ఫలితాలు. మా కుటుంబ సభ్యులంతా.. ఇంకా వారి ఆప్తులుగా మెలిగిన రాచమల్లు, వై.సి.వి. జానమద్ది.. కేతు విశ్వనాధరెడ్డి గారు, నరాల రామారెడ్డి, రాజన్న కవి..మేమంతా ఆ చరిత్రకు సాక్షులమే..అయ్యగారి రచనలను గురించి వ్రాయాలన్నకోరిక గలవారు వారి సాహిత్యాన్ని ఇన్ని కోణాలనుండి వ్యాఖ్య్యానించవలసి ఉంటుందని ఆచార్య.జి.వి.సుబ్రమణ్యం గారు ఒక సభలో అనటం నాకింకా గుర్తు.మరి ఇన్ని యోగ్యతలున్న సాహిత్య విశ్లేషకులెవరైనా మనకి దొరుకుతారా అంటే అది ప్రశ్నార్ఠకమే!. ..పుట్టపర్తి నాగపద్మిని

    ReplyDelete
  2. ఇదివరకు చదివిందే అయినా మీ పీడీఎఫ్ లో పుట్టపర్తి వారి రచనలనన్నిటిని పేర్కొన్నారు. బావుంది.

    పుట్టపర్తి వారి రచనల గురించి కానీ, ఈయన కావ్యాల గురించి కానీ మాట్లాడే వారు, విశ్లేషించేవారు, విడమర్చే వారు దాదాపుగా లేరు. మాట్లాడగలిగిన కొద్ది మంది కూడా అందుకు పూనుకోరు. దీనికి సాహిత్యేతర కారణాలే ఎక్కువ. ఈ ధోరణి మారాలి. తప్పక మారుతుంది.

    ReplyDelete